Vishakha Nakshatra (విశాఖ నక్షత్రం)

విశాఖ నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Vishakha Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.

Vishakha Nakshatra Details

నక్షత్రమువిశాఖ
అధిదేవత ఇంద్ర అగ్ని
తారల సంఖ్య 5
గుర్తు కుమ్మరి సారె
గ్రహం గురు
పురుషార్థ ధర్మ
యోని (Gender)పురుష
గణ రాక్షస
వర్ణ మ్లేఛ
ఎలిమెంట్ అగ్ని
త్రిమూర్తి బ్రహ్మ
త్రి దోష కఫం
రంగు బంగారం
దిక్కు తూర్పు
గోత్రం వసిస్ట
గుణము సత్వ గుణం
శరీర భాగము రొమ్ము
జంతువు పులి
పక్షి జలూకమ్
చెట్టు నాగాకేసరం , మొగలి
మొదటి అక్షరం తీ,తూ,తే,తో

Vishakha Nakshatra Characteristics

విశాఖ నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:

ఈ విశాఖ నక్షత్రంలో జన్మించినవారి జీవితం గురు మహాదశలో ప్రారంభమవుతుంది. ఈ దశ 16 సంవత్సరం లు. అనంతరం శని మహాదశ 19 సంవత్సరాలు. ఈ విశాఖ నక్షత్రంలో ఫుట్టినవాళ్ళు పండితప్రియులు, వినయసంపన్నులు, ధనవంతులూ, బంధువర్గానికి మేలుచేసేవాళ్ళే, ఏ పనిలోనైనా నేర్పరులు, ఏ విషయాన్నయినాసరే స్పష్టంగా, దాపరికాలు లేకుండా చెప్పగలిగేవాళ్ళూ అయివుంటారు. కాని, అతి ఋణపీడితులూ, ఎర్రటికళ్ళు కలవాళ్ళూ, స్త్రీప్రియులూ, త్వరితగతిలో వ్యాధిగ్రస్తులు, ముఖ్యంగా గుహ్యం ఉదరాలపై మత్స్యాంకాది తిలకాలు కలవాళ్ళూ అవుతారు. అయినప్పటికీ
నీళ్ళు దీర్ఘాయుష్మంతులు.

Vishakha Nakshatra Personality

విశాఖ నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:

విశాఖ నక్షత్రం 1 వ పాదం – విశాఖ మొదటిపాదం కుజుడిది. సౌఖ్యాంశ. పలచటి ఛాతీ, ఎరుపు కన్నులూ కలిగి, ధనవంతులయి ఉంటారు.

విశాఖ నక్షత్రం 2 వ పాదం – రెండోపాదం శుక్రుడిది. భోగాంశ. రూపవంతులు, సౌందర్భవంతులు, అందమైన భార్యకలవాళ్ళూ, సౌఖ్యవంతులు, దేనినైనా న్యాయపరంగానే సంపాదించుకునేవాళ్ళూ అవుతారు. చెవిటివాళ్ళూ అవుతారు.

విశాఖ నక్షత్రం 3 వ పాదం – మూడోపాదం బుధుడిది. సౌమ్యాంశ. ఈ జాతకులు మంచీచెడులపట్ల విచక్షణ కలవాళ్ళూ, నేర్పరులు, దానగుణవంతులుగా ఉంటారు. అంధులయ్యే అవకాశం ఉంది.
విశాఖ నక్షత్రం 4 వ పాదం – నాలుగోపాదం చంద్రుడిది, అర్థాంశ. ఈ వేళా సంజాతులు, అంత్రరోగులు, స్త్రీప్రియులుగా ఉంటారు.

Vishakha Nakshatra Strength

విశాఖ నక్షత్ర జాతకుల బలాలు:

  • స్వయం కృషి
  • సాదకులు
  • ఆకర్షణ

Vishakha Nakshatra Weakness

విశాఖ నక్షత్ర జాతకుల బలహీనతలు:

  • వ్యాదులు

Vishakha Nakshatra Favorable & Unfavorable

  • అనుకూలము – యుద్ధం, కార్యనిర్వాహక సామర్థ్యం, వాదన, కఠినత్వం, మానసిక దృష్టి, గోల్ ఓరియెంటెడ్ యాక్ట్ లు, వేడుకలు, పార్టీలు, ఫంక్షన్ లు, అవార్డులు, డెకరేటివ్ యాక్ట్ లు, రొమాన్స్, సెక్సువాలిటీ, తపస్సు, పరిష్కరించడం, పనులు పూర్తి చేయడం, దుడుకుగా లేదా కఠినమైన యాక్టివిటీస్, ఎగ్జిక్యూటివ్ టాలెంట్ లు, ఆర్గ్యుమెంటేటివ్ వ్యూహాలు,
  • అననుకూలము – వివాహం, ప్రయాణం, ఆరంభాలు, లౌక్యం, దీక్షలు మరియు దౌత్యం
  • ఈ నక్షత్రంలో 40 వ ఘటిక తర్వాత విషనాడీ

విశాఖ నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు

Nakshatram Vishakha
తిథి పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశి
వారాలు గురు వారము
సంవత్సరము 16, 23, 30, 36, 42, 44, 48, 53
నక్షత్రాలు మృగశిర
సంఖ్య 3
రంగు పసుపు
రత్నం కనక పుష్యరాగం
రుద్రాక్ష 5,6 ముఖి
లోహం బంగారం
దిక్కు ఈశాన్యం
దైవము శివుడు

Vishakha Nakshatra – Education

విశాఖ నక్షత్రం – విద్య:

B.Sc, B.Tech బీఏ, లా, డిప్లొమా హోమియోపతి మెడిసిన్, సర్జరీ, రేడియాలజీ. టెక్స్టైల్/సివిల్ ఇంజినీరింగ్. ఆర్కిటెక్చర్, సిటీ &
రీజనల్ ప్లానింగ్.

Vishakha Nakshatra – Profession, Job, Business

విశాఖ నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:

టూరిస్ట్ ఆఫీసర్, షిప్పింగ్, ఎయిర్ ట్రావెల్, రేస్గోయర్స్, ట్యాక్స్ అండ్ రెవిన్యూ డిపార్ట్ మెంట్, జడ్జి, ఆడిటర్, ప్రొఫెసర్, ప్రిన్సిపాల్, ఆడిటర్, యాక్టర్, ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు, మింటింగ్.

Vishakha Nakshatra Health

విశాఖ నక్షత్రం – ఆరోగ్యము:

గర్భాశయ వ్యాధి, ముక్కు నుంచి రక్తస్రావం, మూత్రపిండాల్లో రాళ్లు,
చుక్కలు, చీలిక, ప్రోస్టేట్-విస్తరణ, ఫైబ్రాయిడ్, కణితి, రుతుస్రావం అసాధారణ రక్తస్రావం, మూత్ర సమస్య, మధుమేహం, మందగించిన మూత్రపిండాలు, చర్మం విస్ఫోటనం, మెదడు యొక్క రద్దీ, గర్భాశయం
కణితులు, ముక్కు నుంచి రక్తం కారడం.

Vishakha Nakshatra Remedies

విశాఖ నక్షత్రం – శాంతి పూజ విధులు:

విశాఖ నక్షత్రం 4 పాదములు సామాన్య దోషము కలదు.

ఈ నక్షత్రంలో శాంతి కొరకు ఎర్రని రంగు కలిగి ఏనుగును అధిరోహించినదీ, ఒక చేతిలో పాశం (తాడు లేదా సూత్రం) మరొకచేతిలో అంకుశం ధరించి మిగిలిన రెండుచేతులా అభయ వరద
ముద్రలు వహించిన చతుర్భుజయుక్త ఇంద్రాగ్నుల విగ్రహాన్ని బంగారంతో చేయించి కుంకుమగంధం’ వందరేకులున్న పువ్వులు, దేవదారు ద్రవ్య దూపం, బెల్లంతో వండిన పరమాన్నం నివేదనగా ‘ఇంద్రాగ్నయో’ కతి మంత్రంతో ధ్యాన వాహన నార్ఘ్యపాద్యాది షోడశోపచారాలతోనూ ఆరాధించాలి. అనంతరం గాయత్ర్యాష్టోత్తర సహితంగా క్షీరాన్నంతో హోమం చేయాలి. చివరగా గంథమాల్యాదులతోనూ, బెల్లంతో వండిన
200 పరమాన్నంతోనూ, ఉత్తర దిక్కులో బలిచేయాలి. తద్వారా పదిహేను రోజులలో అరిష్టాలు నశించి సుఖశాంతులు కలుగుతాయి.

Vishakha Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka

విశాఖ నక్షత్ర గాయత్రి మంత్రం:

ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే
మహాశ్రేష్ఠాయై చ ధీమహీ
తన్నో విశాఖ: ప్రచోదయాత్

విశాఖ నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

సుధన్వా ఖండపరశుర్దారుణో ద్రవిణప్రదః ।
దివఃస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥

విశాఖ నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్యాసకృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణం। 62 ॥

విశాఖ నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

విశాఖ నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః ॥ 64 ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *