Bharani Nakshatra (భరణి నక్షత్రం)

Bharani Nakshatra: భరణి నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Bharani Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.

Bharani Nakshatra Details

నక్షత్రముభరణి
అధిదేవతయముడు
తారల సంఖ్య3
Meaning Bearing children
గుర్తుయోని, అధోముఖ త్రిబుజం
గ్రహంశుక్ర
పురుషార్థఅర్థ
యోని (Gender)స్త్రీ
గణమనుష్య
నాడీ మద్య
వర్ణచండాలుడు
ఎలిమెంట్పృథ్వీ
త్రిమూర్తివిష్ణు
త్రి దోషపిత్తం
రంగురక్త వర్ణము
దిక్కుపశ్చిమం
గుణముశత్వ గుణం
శరీర భాగముదిగువ పాదం
జంతువుమగ ఏనుగు
పక్షికాకి
చెట్టుఉసిరి
మొదటి అక్షరంలీ, లూ, లే, లో

Bharani Nakshatra Characteristics

భరణి నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:

ఈ భరణి నక్షత్రంలో జన్మించినవారి జీవితం శుక్ర మహాదశలో ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు – చపలురు, అధిక శత్రువులు కలవాళ్ళూ, సుఖవంతులు, దీర్ఘాయుష్మంతులూ, సత్యవాదులూ, మంచి భోజనంపట్ల ఆసక్తికలవాళ్ళూ, అతినిద్రా పరులూ, తత్తత్కాల విశేషంగా రవంత ఎరుపురంగు కన్నులు కలవాళ్ళూ, విశాలమైన పాలభాగం కలవాళ్ళూ, వంకర టింకర తల వెంట్రుకలు కలవాళ్ళూ, భోగనీయ శరీర సౌష్ఠవులూ, బొడ్డు ప్రాంతంలో తిలకాది ( పుట్టుమచ్చలు వగయిరా) చిహ్నాలు కలవాళ్ళూ అవుతారు.

Bharani Nakshatra Personality

భరణి నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:

భరణి నక్షత్రం 1 వ పాదం – ఈ భరణి నక్షత్రం మొదటిపాదం రవిది – ఇది సృష్టాంశ ఈ యోగ పాదంలో జన్మించినవాళ్ళు రాజగౌరవాన్ని పొందుతారు. సమస్తమైన మంచి లక్షణాలను కలిగివుంటారు.

భరణి నక్షత్రం 2 వ పాదం – ద్వితీయపాదం బుధునిది. పరమలోభులు, ముఖ్యంగా డబ్బు విషయంలో అతి లోభులు, నపుంసకులుగా ఉంటారు.

భరణి నక్షత్రం 3 వ పాదం – తృతీయపాదం శుక్రుడిది – అభయాంశ – బాధ్యతా రాహిత్యమైన జీవితాన్ని ఆశించేవారూ అవసర కార్యాలలో అత్యంత ఉత్సాహవంతులూ, శూరులుగా ఉంటారు.

భరణి నక్షత్రం 4 వ పాదం – చతుర్ధపాదం కుజుడిది- పాపాంశ- ఈ జాతకులు క్రూర స్వభావులూ, కృతఘ్నులూ, ఇతరులపట్ల మత్సరవంతులూ, అధిక సంతానవంతులూ, ఇత్యాదిగుణాలు కలిగియుంటారు.

Bharani Nakshatra Strength

భరణి నక్షత్ర జాతకుల బలాలు:

  • సుఖవంతులు
  • సత్యవాదులు

Bharani Nakshatra Weakness

భరణి నక్షత్ర జాతకుల బలహీనతలు:

  • అధిక శత్రువులు
  • అతినిద్ర
  • లోభి

Bharani Nakshatra Favorable & Unfavorable

  • అనుకూలం – సృజనాత్మక మరియు మార్టిన్ కార్యకలాపాలు (తీవ్రమైన, క్రూరమైన, విధ్వంసక, పోటీ లేదా యుద్ధపరమైన), లైంగిక, రసిక, సంతానోత్పత్తి, వ్యవసాయం & సంతానోత్పత్తి ఆచారాలు, ప్రారంభం/ముగింపులు, అగ్నితో కూడిన చర్యలు, వాయిదా వేయబడిన లేదా నిర్లక్ష్యం చేయబడిన కార్యకలాపాలు, స్వీయ క్రమశిక్షణ, ఉపవాసం లేదా శుద్ధి చేసే ఆచారాలు, పిల్లలతో వ్యవహరించుట
  • అననుకులము – ప్రయాణం (భరణి ట్రాఫిక్ జామ్‌లు మరియు ప్రమాదాలకు సంబంధించినది), ఓర్పు, దీక్షలు, ప్రస్తుత రోజుల్లో ప్రారంభంలో కంటే ముగింపులకు మంచిది
  • ఈ నక్షత్రజాతకులకి పుట్టిన 3వ రోజు మధ్యాహ్నవేళ 21/2 సంవత్సరాల లోపల – మృగభయం. 24వ యేట మారకం

భరణి నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు

Nakshatram Bharani
తిథి పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి
వారాలుసోమ,బుధ, గురు, శుక్ర వారములు
సంవత్సరము15, 24, 32, 42, 46
సంఖ్య4, 6, 7
రంగుతెలుపు
రత్నంవజ్రం
రుద్రాక్షఏక ముఖి, పంచ ముఖి
లోహంవెండి
దిక్కుఉత్తరం
దైవముశివుడు, సూర్యుడు, గణపతి

Bharani Nakshatra – Education

భరణి నక్షత్రం – విద్య:

BA, హోమ్ సైన్స్, ఫారిన్ లాంగ్వేజ్, లా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ – కెమికల్, సివిల్, ఫార్మసీ, ఎలక్ట్రికల్.

Bharani Nakshatra – Profession, Job, Business

భరణి నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:

కళ ప్రకటన, మొబైల్, ఎరువులు, పట్టు, రెజ్లర్, రైల్వే, వెటర్నరీ వైద్యులు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్రిమినల్ లాయర్, న్యాయమూర్తి, ఆప్టిషియన్, వ్యవసాయదారులు, తోలు, తయారీదారులు, తొక్కలు మరియు చర్మాలు, గైనకాలజిస్ట్‌లు, ఫెర్టిలిటీ క్లినిక్‌లు, వ్యభిచారం, జీవశాస్త్రవేత్తలు మరియు మైక్రోబయాలజిస్టులు.

Bharani Nakshatra Health

భరణి నక్షత్రం – ఆరోగ్యము:

నుదిటిపై గాయం, జలుబు, వెనెరియల్ డిస్టెంపర్, సిఫిలిస్, పగ్గాలు, ప్రభావితమైన ముఖం మరియు దృష్టి, తలలో పిల్లికూతలు, లైంగిక అలవాట్లు & బలహీనత, పిల్లికూతలు.

Bharani Nakshatra Remedies

భరణి నక్షత్రం – శాంతి పూజ విధులు: భరణి నక్షత్ర 3 వ పాదంనకు దోషము కలదు. కృష్ణవర్ణంతో కూడినదీ, రెండు చేతులుగలదీ, పాశాన్నీ దండాన్నీ ధరించినదీ, దున్నపోతు నధిరోహించి వున్నదీ అయిన యమధర్మరాజు విగ్రహాన్ని నిర్మించి నక్షత్రాధిపతియైన యముణ్ణి ఆ ప్రతిమయందు ఆవాహనచేసి, ‘‘యమాయసోమమ్” ఇతి – మంత్రాద్యాః షోడశోపచార పూజలు నిర్వర్తించాలి. నీలవస్త్రం, కృష్ణా గరుగంధం, తామరపుష్పం, మహిషాక్షి – ద్రవ్యధూపం, బెల్లంతో కూడిన అన్నం నివేదన – చెయ్యాలి. గాయత్ర్యష్టోత్తరయుతంగా – నేయి, తేనెలతో హోమం చెయ్యాలి.

Bharani Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka

భరణి నక్షత్ర గాయత్రి మంత్రం:

ఓం కృష్ణవర్ణై విద్మహే
దండధరాయై ధిమహి
తన్నో భరణి: ప్రచోదయాత్

భరణి నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।
అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ 5 ॥

భరణి నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ॥ 6 ॥

భరణి నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

అగ్రాహ్యః శాశ్వతో కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ।
ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్ ॥ 7 ॥

భరణి నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః ।
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ 8 ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *