మకర రాశి Makara Raasi Characteristics, Personality, Strength & Weakness

మకర రాశిలక్షణాలు, వ్యక్తిత్వం, బలం & బలహీనత: మకర రాశి Makara Raasi జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము, అదృష్ట విషయములు మరియు ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Makara Raasi (Capricorn Sign) Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.

Makara Raasi (Capricorn Sign) Details

రాశి సంఖ్య10, మకరము
రాశిమకర రాశి
అధిపతిశని
నక్షత్రములుఉత్తరాషాడ 2,3,4, శ్రవణము 1,2,3,4 ధనిష్ట 1,2 పాదములు  
గుర్తుమొసలి
సూర్య గ్రహ సంచారండిసెంబర్ 22 – జనవరి 19
తత్వము (element)భూమి
పురుషార్దముఅర్ధము
శరీర భాగముమోకాలు
చర/స్తిర/ ద్విస్వభావచర రాశి
లింగముస్త్రీ
ఆయుర్వేద దోషమువాతము
గుణముతమో
దిశదక్షిణము
రంగుచిత్ర వర్ణము (mixed)
పగలు / రాత్రిరాత్రి
ఉదయం (raising)prishthodaya
వర్ణంవైశ్య

Makara Raasi Characteristics

మకర రాశి లో జన్మించిన వారి గుణగణాదులు: 

కష్టించే స్వభావము, విధేయత, వినయము, నిజాయితీ, సేవా భావము, సాంప్రదాయము, నాయకత్వ లక్షణములు, సృజనాత్మకత, చమత్కారుడు, పరిపూర్ణుడు, రోగి, నిర్వాహకుడు, జాగ్రత్తగా, రహస్యమైన, ఆచరణాత్మకమైన. 

Makara Raasi Personality

మకర రాశి లో జన్మించిన వారి స్వభావము: 

మకర రాశి అధిపతి శని, ఇది కర్మ స్తానము. భూతత్వ రాశి. మకర రాశి కష్టపడి పని చేసే స్వభావాన్ని సూచిస్తుంది. చరిత్ర లో ఎక్కువ కాలము నిలిచి పోయే పనులను, వస్తువులను, పద్దతులను, సంప్రదాయములను సూచిస్తుంది.

మకరరాశి వారి జీవితం లక్ష్యాలు మరియు ఆకాంక్షలచే నడపబడుతుంది.

వీరు తమ ప్రయత్నాలలో విజయం సాధించాలనే అచంచలమైన సంకల్పం కలిగి ఉంటారు. మకరరాశి వారు బౌతికమైన మరియు ఆధ్యాత్మిక రంగాలలో ప్రయాణం చేయడంలో ప్రవీణులు.

వీరు సవాళ్లకు సృజనాత్మక పరిష్కారాలను కనుగొంటారు. మకరరాశివారు ఒక  పరిణతి చెందిన ప్రవర్తనను ప్రదర్శిస్తారు. వివేకంతో మరియు బాధ్యతతో జీవితాన్ని గడుపుతారు. 

ఈ రాశి వారికి స్వంత వారితోనే తగాదాలు ఎక్కువ గా వచ్చు అవకాశము వున్నది. దీనికోరకు వ్యత్తిగత జాతకములోని బుధుని పరిశీలించవలెను. బుధుడు ఆరుకు మరియు తొమ్మిది కి కూడా అధిపతి అగుట వలన తండ్రి తో సరి అయిన సంభందబాందవ్యము ఉండదు.  

పాత వస్తువులను , నాణెములను సేకరించేవారు ఈ రాశి లో ఎక్కువ. ఈ రాశి వారికి అదృష్టము తక్కువగా వుండును ప్రతీదీ కష్ట పడి సాధించ వలసి వచ్చును. పోటీ తత్వము ద్వారా స్పూర్తిని పొంది విజయము సాధిస్తారు.

రహాస్యములను దాచడము వలన లాభము పొందుతారు. రెండవ భావం కూడా శని అధిపతి అగుట వలన వీరి అభివృద్దికి శని ని గమనించవలెను. శని బలము గా వున్నవారు ఆర్భాటములకు పోకుండా వినయముగా వుందురు.

జీవితము లో మంచి స్తాయి కి చేరుకుంటారు. ధనకారకుడు అయిన గురువు వ్యయమునకు కూడా అధిపతి అగుట వలన వీరు చేయదలుకున్న పనిని ముందుగా ఎవరికైనా చెబితే అది జరుగక నష్ట పోవుదురు.

పంచమ దశమఅధిపతి శుక్రుడు. ఈ రాశి వారు సంతానము కలిగిన తరువాత వృత్తి లో కొంత నిలకడ పొందుదురు. ఎక్కువగా ప్రేమ విఫలము జరుగు అవకాశము వున్నది.

వీరికన్న పై స్తాయి  వారిని జీవిత భాగస్వామి గా పొందుదురు. ఈ ఫలితములు కేవలము రాసులను అనుసరించి ఇవ్వబడినవి. వ్యత్తిగత జాతకము లో గ్రహముల అమరిక లగ్నము యొక్క బలము అనుసరించి ఫలితము చూడవలెను.  

Also Read: ధనస్సు రాశి Dhanassu Raasi Characteristics, Personality, Strength & Weakness

Makara Raasi Strength

మకర రాశి లో జన్మించిన వారి బలము

కష్టించే స్వభావము

వినయము

నిజాయితీ

Makara Raasi Weakness

మకర రాశి లో జన్మించిన వారి బలహీనత

ఆర్భాటము

ఆరోగ్యము

మొండితనం

Makara Raasi Luck & Favourable

మకర రాశి లో జన్మించిన వారి అదృష్ట మరియు అనుకూల అంశములు

అదృష్ట రంగుతెలుపు, నలుపు
అదృష్ట రత్నంవజ్రం
అదృష్ట వారముశుక్ర వారము
అదృష్ట సంఖ్య8
అనుకూల రాశి (compatible sign)వృషభము, కర్కాటకము
బీజ మంత్రంॐ श्रीं वत्सलाय नमः ।।

Makara Raasi Education

మకర రాశి – విద్య

Chemicals, ఫ్యాషన్ డిజైన్, అగ్రికల్చర్, సినిమా, ఫిజిక్స్, సైకాలజీ, హ్యూమన్ రిసోర్స్ మ్యానేజ్మెంట్

Makara Raasi Profession, Job, Business

మకర రాశి – వృత్తి, ఉద్యోగ, వ్యాపారములు

సేవ రంగము, సిమెంట్, iron, hardware, ఆయిల్, pesticide, forest డిపార్ట్మెంట్, షూ షాప్, ఫర్నీచర్, construction, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్.  

Makara Raasi Health

మకర రాశి – ఆరోగ్యము

మకర రాశి వారికి సాధారణము గా పెద్ద ఆరోగ్య సమస్యలు వుండవు కానీ చిన్న ఆరోగ్య సమస్యలు తరుచూ గా భాదించును. జలుబు, ఉబ్బసం, arthritis, మోకాలు, కిడ్నీ లో రాళ్ళు, జీర్ణ సంభందిత సమస్యలు, చర్మ సంభందిత సమస్యలు ముఖ్యం గా ఈ రాశి సూచించును.

Makara  Raasi Remedies

మకర రాశి – పరిహారములు

నీలము రంగు వస్త్రము దగ్గర వుంచుకొనవలెను, శివునికి ఆరాధన చేయటము మంచిది. రావి చెట్టు, మర్రి చెట్టు పూజ చేయటము మంచిది. నెమలి పించం ఇంట్లో వుంచుకొనవలెను. గుడి లో సేవ చేయడము మంచిది.  నవ దాన్యాలను పారే నది లో చేపలకు ఆహారము గా వేయవలెను. జంతువులకు, చేతలకు హాని చెయ్యరాదు. వేకటేశ్వర స్వామి ఆరాధన కూడా మంచిది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *