Pushyami Nakshatra (పుష్యమి నక్షత్రం)

Pushyami Nakshatra: పుష్యమి నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Pushyami Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.

Pushyami Nakshatra Details

నక్షత్రముపుష్యమి
అధిదేవత బృహస్పతి
తారల సంఖ్య 4
గుర్తు ఆవు పొదుగు
గ్రహం శని
పురుషార్థ ధర్మ
యోని (Gender)పురుష
గణ దేవ
వర్ణ క్షత్రియ
ఎలిమెంట్ జల
త్రిమూర్తి విష్ణు
త్రి దోష పిత్తం
రంగు తెలుపు
దిక్కు తూర్పు
గోత్రం మారిచి
గుణము సత్వ గుణం
శరీర భాగము ముఖం
జంతువు మేక
పక్షి జల కాకం (sea crow)
చెట్టు రావి
మొదటి అక్షరం హూ, హే, హొ, డ

Pushyami Nakshatra Characteristics

పుష్యమి నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:

ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించినవారి జీవితం శని మహాదశలో ప్రారంభమవుతుంది. ఈ దశ 19 సంవత్సరం లు. అనంతరం బుద మహాదశ 17 సంవత్సరాలు. ఈ పుష్యమీ నక్షత్రంలో ఫుట్టినవాళ్ళు సర్వజ్ఞులు, మేధావులు. జ్యోతిషాది శాస్త్రవేత్తలు, ధైర్యవంతులు. బంధువర్గాలకు అత్యంత ఉపకొారులు, తీపి వస్తువులందు వాంఛ కలవాళ్ళు. నీలంరంగు అందమైన కళ్ళు కలవాళ్ళు, అభిమానవంతులు, ఏకాంత ప్రియులు. చేతులలోనూ అరికాళ్ళలోనూ మత్సాాయాంకితాలు వున్న వారూ, దీర్గాయుష్మంతులుగా ఉంటారు.

Pushyami Nakshatra Personality

పుష్యమి నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:

పుష్యమి నక్షత్రం 1 వ పాదం – పుష్యమీ ప్రథమపాదం రవిది భూపాంశ. ఈ వేళా సంజాతులు ఏకాకులుగా ఉంటారు. ఏ పనినైనా అతిచురుగ్గా నిర్వర్తిసారు. స్తూలకాయులుగా ఉంటారు.

పుష్యమి నక్షత్రం 2 వ పాదం – ద్వితీయపాదం బుధుడిది. సౌమ్యాంశ. వీళ్ళు పరస్త్రీరతులు, ధనకాంషులు, స్నేహపరంగానూ, పరస్త్రీ, వాంఛాపరంగానూ కస్టాలు పొందుతారు.

పుష్యమి నక్షత్రం 3 వ పాదం – మూడో పాదం శుక్రుడిది. శూరాంశ చాలా ప్రసన్నంగా ఉంటారు. భోగవంతులూ, నిత్యం మనశ్శాంతితో అలరారేవారుగా ఉంటారు.
పుష్యమి నక్షత్రం 4 వ పాదం – నాలుగోపాదం కుజుడిది నీచాంశ . ఈ వేళా సంజాతులు ఇతరుల ద్రవ్యాన్ని అపహరించేవాళ్ళూ, కలహప్రియులుగా ఉంటారు.

Pushyami Nakshatra Strength

పుష్యమి నక్షత్ర జాతకుల బలాలు:

  • మేధావులు
  • ధైర్యవంతులు.

Pushyami Nakshatra Weakness

పుష్యమి నక్షత్ర జాతకుల బలహీనతలు:

  • ఒంటరితనం

Pushyami Nakshatra Favorable & Unfavorable

  • అనుకూలము – దేనినైనా ప్రారంభించడం, భవన నిర్మాణానికి పునాదులు వేయడం, వేడుకలు, సమావేశాలు, ఊహాత్మక కార్యకలాపాలు, సంగీతం, నృత్యం, ప్రయాణం, ఆర్థిక ప్రణాళిక, న్యాయ సహాయం అందుకోవడం, విరోధులను ఎదుర్కోవడం, వంట చేయడం
  • అననుకూలము – వివాహం, క్రూరత్వం మరియు కఠినత్వం ఇమిడి ఉండే కార్యకలాపాలు
  • ఈ నక్షత్రంలో 20 వ ఘటిక తర్వాత విషనాడీ

పుష్యమి నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు

Nakshatram Pushyami
తిథి పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశి
వారాలు బుద, గురు, శుక్ర, శని వారములు
సంవత్సరము 16, 23, 30, 36, 42, 44, 48, 53
నక్షత్రాలు రేవతి
సంఖ్య 8
రంగు నీలం
రత్నం నీలం
రుద్రాక్ష సప్త ముఖి
లోహం వెండి
దిక్కు ఈశాన్యం
దైవము శివుడు

Pushyami Nakshatra – Education

పుష్యమి నక్షత్రం – విద్య:

డ్రాఫ్ట్స్ మ్యాన్, బి.ఎ, అగ్రికల్చర్/హార్డ్ వేర్/వాటర్ వర్క్స్ ఇంజనీర్ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, ఎం.ఎ.

Pushyami Nakshatra – Profession, Job, Business

పుష్యమి నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:

వ్యవసాయ భూములు, గని ఉత్పత్తుల్లో ఒప్పందాలు, కిరోసిన్, బొగ్గు, పెట్రోల్. యొక్క స్థానాలను కలిగి ఉండటం ట్రస్ట్, సెక్స్టన్, జైలర్, ఇంజనీర్ బావులు తవ్వడం; రాత్రులు మరియు భూగర్భంలో పనిచేసే వారు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు మరియు విద్యా నిపుణులు.

Pushyami Nakshatra Health

పుష్యమి నక్షత్రం – ఆరోగ్యము:

క్షయ, గ్యాస్ట్రిక్ అల్సర్లు, గాల్ స్టోన్, దగ్గు, వికారం, బెల్చింగ్, రొమ్ములో జడలు, క్యాన్సర్, కామెర్లు, ఎక్కిళ్ళు, తామర, డిస్పెప్సియా. శ్వాసకోశ వ్యవస్థలో పుండు.

Pushyami Nakshatra Remedies

పుష్యమి నక్షత్రం – శాంతి పూజ విధులు:

పుష్యమి నక్షత్రం మొదటి 2 పాదములు దోషము కలదు.

ఈ నక్షత్రంలో జ్వరపడినవారికి 7 దినాలు అరిష్టం, శాంతి కొరకు నాలుగు చేతులూ, ఆ నాలుగు చేతులందునా అక్షసూత్రకమండువులు వరదముద్రా ధరించి వున్నట్టుగానూ, బంగారపు రంగు -. కట్టుకున్న బృహస్పతి విగ్రహాన్ని నిర్మించి ఆవాహన చేసి “బృహస్పతే…. అనే మం త్రాదిగా షో డశోపచారాలు – చేయాలి. ఈ పూజలోకి’ ఎర్రతామర పూవుల్నీ చంద్రధూకుంకుముగంధాన్ని ఉపయోగించాలి. _ దద్దోజనాన్ని సమర్పించాలి.

Pushyami Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka

పుష్యమి నక్షత్ర గాయత్రి మంత్రం:

ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే
మహాదిశాయాయ ధిమహి
తన్నో పుష్య: ప్రచోదయాత్

పుష్యమి నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః ।
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ 29 ॥

పుష్యమి నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ।
ఋద్దః స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః ॥ 30 ॥

పుష్యమి నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

అమృతాంశూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః ।
ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః ॥ 31 ॥

పుష్యమి నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।
కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః ॥ 32 ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *