Mula Nakshatra (మూల నక్షత్రం)

Mula Nakshatra: మూల నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Mula Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.

Mula Nakshatra Details

నక్షత్రముమూల
అధిదేవత నిఋతి
తారల సంఖ్య 5
గుర్తు సింహం తోక
గ్రహం కేతు
పురుషార్థ కామ
యోని (Gender)నపుంసక
గణ రాక్షస
వర్ణ చండాలుడు
ఎలిమెంట్ వాయు
త్రిమూర్తి బ్రహ్మ
త్రి దోష వాతం
రంగు నలుపు
దిక్కు ఉత్తరం
గోత్రం మారిచి
గుణము తమో గుణం
శరీర భాగము ఎడమ
జంతువు కుక్క
పక్షి చక్ర వాకం
చెట్టు వేగి
మొదటి అక్షరం యే,యో, బా, బి

Mula Nakshatra Characteristics

మూల నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:

ఈ మూల నక్షత్రంలో జన్మించినవారి జీవితం కేతు మహాదశలో ప్రారంభమవుతుంది. ఈ దశ 7 సంవత్సరం లు. అనంతరం శుక్ర మహాదశ 20 సంవత్సరాలు. ఈ మూల నక్షత్రంలో ఫుట్టినవాళ్ళు ధర్మం తెలిసినవాళ్ళు, ధనవంతులు, అభిమానవంతులు, ప్రేమకలవాళ్ళు, ఎరుపురంగు శరీరఛాయ కలవాళ్ళూ, కాముకులు. దొంగతనంచేసే గుణం కలవాళ్ళూ, అతి రోగులు, చపలచిత్తులు, దయా కరణలున్నవాళ్ళూ, ఎరుపురంగు కళ్ళు కలవాళ్ళూ, స్త్రీల చేత ఆకర్షింపబడేవాళ్ళుగా ఉంటారు.

Mula Nakshatra Personality

మూల నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:

మూల నక్షత్రం 1 వ పాదం – మొదటిపాదం కుజుడిది. తస్కరాంశ. ఈ వేళా సంజాతులు తండ్రి నెరగనివాళ్ళు. మూలశంకాది వ్యాధిగ్రస్తులు, దరిద్రులు అవుతారు.

మూల నక్షత్రం 2 వ పాదం – రెండోపాదం శుక్రుడిది. భోక్తాంశ. వీళ్ళు మాతృహీనులు దయా నిధులు. క్షీరాన్నంపట్ల బెల్లంపట్ల లాలసులు రవంత భోగం, వాహనా పరులు

మూల నక్షత్రం 3 వ పాదం – తృతీయసాదం బుధుడిది, విచక్షణాంశ ఈ జాతకులు ధనవంతులు ఖర్చు మనుషులు, “మంచి సంభాషణాపరులు విద్యావంతులు, జ్యోతిష్యవిద్య తెలిసినవాళ్ళు ఎదుటివారితో వినయంగా ప్రశంగించేవాళ్ళుగా ఉంటారు.
మూల నక్షత్రం 4 వ పాదం – ఆఖరిపాదం చంద్రుడిది, ధనాంశ, వీళ్ళు రాజోద్యోగులు, సేనాపతులు, పరోపకారులు, కాముకులు, రవ్వంత క్షయరోగ సూచనలున్నవాళ్ళు, ఆడవాళ్ళ కంఠస్వరాన్ని పోలిన గొంతు కలవాళ్ళు, మెత్తగా మాట్లాడేవాళ్ళు, లౌకికం తెలిసినవాళ్ళుగా ఉంటారు.

Mula Nakshatra Strength

మూల నక్షత్ర జాతకుల బలాలు:

  • ధర్మం
  • ఆకర్షణ

Mula Nakshatra Weakness

మూల నక్షత్ర జాతకుల బలహీనతలు:

  • చపలచిత్తం

Mula Nakshatra Favorable & Unfavorable

  • అనుకూలము – విషయం యొక్క మూలానికి దిగడం, జ్ఞానాన్ని సేకరించడం, మూలికలు మరియు ఔషధాలను నిర్వహించడం, నాటడం మరియు తోటపని, వ్యవసాయం, డిజైనింగ్, వక్తృత్వ కార్యకలాపాలు, శక్తివంతం, డైనమిజం, గృహాలకు పునాదులు వేయడం, నిర్మాణం, గృహాలను కొనడం మరియు అమ్మడం
  • అననుకూలము – సంతులనం, లౌక్యం, వైవాహిక సంఘటనలు, దౌత్యం, అప్పు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం, భౌతికవాదం, దీక్షలు లేదా ప్రారంభాలు, వివాహ వేడుక, ఆర్థిక లావాదేవీలు
  • ఈ నక్షత్రంలో 20 వ ఘటిక తర్వాత విషనాడీ

మూల నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు

Nakshatram Mula
తిథి పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశి
వారాలు ఆది, గురు వారములు
సంవత్సరము 25, 31,34,40,43,47,52
నక్షత్రాలు రేవతి
సంఖ్య 7
రంగు తెలుపు
రత్నం పిల్లి కన్ను
రుద్రాక్ష 5,9
లోహం బంగారం
దిక్కు ఈశాన్యం
దైవము కాళీ, గణపతి

Mula Nakshatra – Education

మూల నక్షత్రం – విద్య:

బి.ఎ హిస్టరీ, ఎకనామిక్స్, ఫిజిక్స్, B.Sc. కంప్యూటర్, ఇంజినీరింగ్- సివిల్/కెమికల్/కంప్యూటర్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ మరియు ఆప్తమాలజీ

Mula Nakshatra – Profession, Job, Business

మూల నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:

మతపరమైన ఎండోమెంట్, సామాజిక కార్యకర్త, న్యాయమూర్తి, టీచర్, ఫిజీషియన్, కౌన్సిలర్, ప్రొవిజన్ డీలర్, అసెంబ్లీ స్పీకర్, మారకం, దిగుమతులు, పండ్లు, పువ్వులు, దంతవైద్యులు, పోలీసులు వ్యవహరించడం అధికారులు, డిటెక్టివ్లు, న్యాయమూర్తులు, ఖగోళ శాస్త్రజ్ఞులు, జ్యోతిష్కులు, అణు భౌతిక శాస్త్రవేత్తలు

Mula Nakshatra Health

మూల నక్షత్రం – ఆరోగ్యము:

రుమటిజం, హిప్-డిసీజ్, పల్మనరీ ట్రబుల్స్, లోకో మోటార్ అటాక్సియా

Mula Nakshatra Remedies

మూల నక్షత్రం – శాంతి పూజ విధులు:

మూల నక్షత్రం 4 పాదములు దోషము కలదు.

కారునలుపు శరీరచ్చాయ, రెండు చెేతులు కలిగిన నిఋతీ దేవతా విగ్రహాన్ని నలుపులోహం ( ఇనుము) ఈ చేయించి ప్రాణ ప్రతిష్ట శోధన కళాన్యాసాది కార్యక్రమాలు ముగించి ధ్యానావాహనాది షోడశోపచార విధిని పూజించాలి. ఈ పూజలో నిఋతీ దేవతానిలో ఇత్యాది మంత్రాలతో చేయాలి. ఈ పూజకి ఎర్రని వస్త్రం; కృష్ణాగురుగంధం, తామర పువ్వులు లేదా కలువపువ్వులు, మేఘశృంగము ప్రత్యేక ద్రవ్యంతో ధూపం, ఎర్రరంగుతో కూడిన మినుములతో ఆహారం నివేదనగానూ సమర్పించాలి, పూజానంతరం గాయాత్రష్టోత్రా శతంతో కందమూలఫలాల తో నెతితో హోమంచేయాలి.

Mula Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka

మూల నక్షత్ర గాయత్రి మంత్రం:

ఓం ప్రజాధిపాయై విద్మహే
మహా ప్రజాధి దాయై ధీమహి
తన్నో మూల: ప్రచోదయాత్

మూల నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥

మూల నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥

మూల నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః ।
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః ॥ 75 ॥

మూల నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *