Jyeshta Nakshatra (జ్యేష్ట నక్షత్రం)

Jyeshta Nakshatra: జ్యేష్ట నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Jyeshta Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.

Jyeshta Nakshatra Details

నక్షత్రముజ్యేష్ట
అధిదేవత ఇంద్ర
తారల సంఖ్య 3
గుర్తు గొడుగు
గ్రహం బుద
పురుషార్థ అర్థ
యోని (Gender)స్త్రీ
గణ రాక్షస
వర్ణ సేవక
ఎలిమెంట్ వాయు
త్రిమూర్తి శివ
త్రి దోష వాతం
రంగు తెలుపు
దిక్కు పశ్చిమం
గోత్రం అత్రి
గుణము సత్వ గుణం
శరీర భాగము మర్మ భాగం
జంతువు జింక
పక్షి చాతకం
చెట్టు పోక
మొదటి అక్షరం నో, యా, యీ, యో

Jyeshta Nakshatra Characteristics

జ్యేష్ట నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:

ఈ జ్యేష్ట నక్షత్రంలో జన్మించినవారి జీవితం బుద మహాదశలో ప్రారంభమవుతుంది. ఈ దశ 17 సంవత్సరం లు. అనంతరం కేతు మహాదశ 7 సంవత్సరాలు. జ్యేష్టా నక్షత్రజాతకులు నల్ల శరీరచ్చాయగలనాళ్ళూ పుత్రసంతానవంతులు, స్నేహశీలురు, సంతుష్ట్రులు, సత్యవాదులు, ధృఢమైన చేతులు కలవాళ్ళూ, లాలసులు, పొడుగైన ముక్కు కలవాళ్ళు

Jyeshta Nakshatra Personality

జ్యేష్ట నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:

జ్యేష్ట నక్షత్రం 1 వ పాదం – గురువుది. ఉత్పన్నాంశ. ఈ వేళాసంజాతులు వ్రాయసం, హాస్యం , గర్విస్టులుగా ఉంటారు.

జ్యేష్ట నక్షత్రం 2 వ పాదం – రెండోపాదం శనిది. ఉగ్రాంశ, నిత్య రోగులు, పరవశీకరణ తంత్రులు గా వుంటారు.

జ్యేష్ట నక్షత్రం 3 వ పాదం – మూడో పొదం కూడా శనిదె. ఇది పాపంశ, అల్ప భోగం, చూపుసరిగా ఆనకపోవడం, నిత్యం ఇతరుల పనులు చేసి పెట్టడం వీరి లక్షణాలు
జ్యేష్ట నక్షత్రం 4 వ పాదం – అఖరిపాదం గురుడిది. శుభాంశ, వీళ్ళు చెవిటివాళ్ళు, శాస్త్రచేత్తలవుతారు.

Jyeshta Nakshatra Strength

జ్యేష్ట నక్షత్ర జాతకుల బలాలు:

  • ఇతరుల రహస్యాలు తెలుసుకోవడం

Jyeshta Nakshatra Weakness

జ్యేష్ట నక్షత్ర జాతకుల బలహీనతలు:

  • గర్వం

Jyeshta Nakshatra Favorable & Unfavorable

  • అనుకూలము – కఠినత్వం, గూఢచర్యం, పన్నాగం, నియంత్రణ, అధికారం, పరిపాలన, సంరక్షణ, బాధ్యత తీసుకోవడం, క్షుద్రపూజలు, పర్యవేక్షణ, బాధ్యత, ఆందోళన, కుటుంబ వ్యవహారాలు, పెద్దలకు సహాయపడటం, తీవ్రమైన విషయాలను చర్చించడం, పెద్ద ఎత్తున ప్లానింగ్, బాధ్యత అవసరమైన కార్యకలాపాలు, రక్షణ, పన్నాగం
  • అననుకూలము – డిప్రెషన్, కోపం, అవిశ్వాసం, స్వార్థపరత్వం, దోపిడీ, వివాహం, రికవరీ, వినోదం, లౌక్యం, మృదుత్వం, ప్రయాణం, ఇతరుల ప్రయోజనాన్ని పొందడం, స్వస్థత, ఎక్కువ విశ్రాంతి, మితిమీరిన అసహనం, దౌత్యం లేదా సున్నితత్త్వం అవసరమయ్యే కార్యకలాపాలు
  • ఈ నక్షత్రంలో 14 వ ఘటిక తర్వాత విషనాడీ

జ్యేష్ట నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు

Nakshatram Jyeshta
తిథి పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశి
వారాలు బుద, గురు, శుక్ర, శని వారములు
సంవత్సరము 16, 23, 32, 42, 44, 48, 53
నక్షత్రాలు పుష్యమి
సంఖ్య 5
రంగు పచ్చ
రత్నం పచ్చ
రుద్రాక్ష 3,6 ముఖి
లోహం వెండి
దిక్కు ఉత్తరం
దైవము విష్ణువు

Jyeshta Nakshatra – Education

జ్యేష్ట నక్షత్రం – విద్య:

బి.ఎ, లిటరేచర్/కార్పొరేట్/సెక్రటరీ, ఎమ్.బి.బి.ఎస్, మెడిసిన్/సర్జరీ/ఆయుర్వేదిక్ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, సి.ఎ.

Jyeshta Nakshatra – Profession, Job, Business

జ్యేష్ట నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:

ఇన్స్యూరెన్స్ ఏజెంట్, సర్జికల్ ఇనుస్ట్రుమెంట్, టానిక్స్, స్క్రమ్స్ తయారీదారులు, ప్రచురణ, వస్త్రం మిల్లు, సెషన్ జడ్జి, కేబుల్ మరియు వైరు తయారీదారు.

Jyeshta Nakshatra Health

జ్యేష్ట నక్షత్రం – ఆరోగ్యము:

రక్తస్రావం పైల్స్, ప్రేగు-సంక్రామ్యత, కణితులు, ఫిస్టులా, రహస్య భాగాలలో డిస్టెంపర్, ల్యూకోరియా, చేయి మరియు భుజాలలో నొప్పి.

Jyeshta Nakshatra Remedies

జ్యేష్ట నక్షత్రం – శాంతి పూజ విధులు:

ఈ నక్షత్రం 4 పాదములు దోషము కలదు.

ఈ నక్షత్రంలో శాంతి కొరకు పసుపురంగు కలిగి, ఒక చేత వజ్రాన్నీ మరోచేత అంకుశాన్నీ ధరించ వున్న రండు చేతులుండిన, ఇంద్ర ప్రతిమను బంగారంతో చేయించి ప్రాణప్రతిష్టా శోధన కళాన్యాసాదులన్నీ పూర్తిచేసి “అయం వో విశ్వత’ ఇత్యాది మంత్రయుతంగా ధ్యానావాహనాది షోడశోపచారాలా పూజించాలి. శ్రీగంధాన్నీ, పాటలీపుష్పాలను, పసుపురంగు పట్టుబట్టు నీ ఉపయోగించాలి. చిత్రాన్నం నైవేద్యం చేయాలి. పూజానంతరం గాయ త్ర్యాస్టోత్తరశతంతో నెయ్యి చిత్రాన్నాలను హోమం చేయాలి. గంధమాల్యాల్నీ నువ్వుల అన్నాన్నీ ఉత్తరదిక్కులో బలిచేయాలి. దీనివలన అరిష్టాలు హరించుకుపోతాయి. ఒక నెలలో సర్వసౌఖ్యాలూ కలుగుతాయి,

Jyeshta Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka

జ్యేష్ట నక్షత్ర గాయత్రి మంత్రం:

ఓం జ్యేష్ఠాయై విద్మహే
మహాజ్యేష్ఠాయై ధీమహి
తన్నో జ్యేష్ఠా: ప్రచోదయాత్

జ్యేష్ట నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః ।
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥

జ్యేష్ట నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః ।
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనంతో ధనంజయః ॥ 70 ॥

జ్యేష్ట నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥

జ్యేష్ట నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।
మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *