Ashlesha Nakshatra: ఆశ్లేష నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Ashlesha Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.
Table of Contents
Ashlesha Nakshatra Details
నక్షత్రము | ఆశ్లేష |
---|---|
అధిదేవత | నాగ |
తారల సంఖ్య | 6 |
గుర్తు | సర్ప |
గ్రహం | బుద |
పురుషార్థ | ధర్మ |
యోని (Gender) | స్త్రీ |
గణ | రాక్షస |
వర్ణ | చండాల |
ఎలిమెంట్ | జల |
త్రిమూర్తి | శివ |
త్రి దోష | కఫం |
రంగు | ఎరుపు |
దిక్కు | దక్షిణం |
గోత్రం | వశిస్ట |
గుణము | సత్వ గుణం |
శరీర భాగము | చెవి |
జంతువు | పిల్లి |
పక్షి | జల కాకం (sea crow) |
చెట్టు | పున్నాగ |
మొదటి అక్షరం | డీ, డూ, డే, డో |
Ashlesha Nakshatra Characteristics
ఆశ్లేష నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:
ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించినవారి జీవితం బుద మహాదశలో ప్రారంభమవుతుంది. ఈ దశ 17 సంవత్సరం లు. అనంతరం కేతు మహాదశ 7 సంవత్సరాలు. ఈ ఆశ్లేష నక్షత్రంలో ఫుట్టినవాళ్ళు సాధారణంగా ఈ నక్షత్ర సంజాతులు వాగుడుకాయులు, రాజ గౌరవం పొందే వాళ్ళూ, చూపువాసి పొట్టివాళ్ళూ (తమని తాము తక్కువ యెంచుకునే వాళ్ళూ,) కోపభూయిష్టమైనకళ్ళు గలవాళ్ళూ ఇతరేతర ప్రాంతాలలో నివసించేవారూ, భయం కలిగించే మాటలు కలవారూ, యజమానుల పనులు చేయడంలో నేర్పరులూ, కాముకులూ, పొట్ట – భాగాలలో పుట్టమచ్చలూ వగయిరా తిలకాదులు కలవారూ, ప్రవర్తకులుగా ఉంటారు,
Ashlesha Nakshatra Personality
ఆశ్లేష నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:
ఆశ్లేష నక్షత్రం 1 వ పాదం – ఆశ్లేష ప్రథమపాదం గురుడుది ధైర్యవంతులు, సత్యవాదులు, మంచి బుద్ది కలవారుగా ఉంటారు.
ఆశ్లేష నక్షత్రం 2 వ పాదం – ద్వితీయపాదం శనిది పాపాంశ. వీళ్ళు నిత్యం వ్యాధి గ్రస్తులు, పాపకార్యాసక్తులు, చంచల స్వభావులు, నీచమైన పనుల ద్వారా డబ్బు సంపాదించేవారూ, శుచిశుభ్రాలు లేనివారూ అవుతారు.
ఆశ్లేష నక్షత్రం 3 వ పాదం – మూడో పాదం కూడా శనిదే. ఇది క్రోధాంశ అబద్దాలాడడం, కుట్రలు చేయడం, అన్యాయంగా డబ్బు సంపాదించడం , బుద్ది మాంద్యం, వాతరోగం వీళ్ళ లక్షణాలు.
ఆశ్లేష నక్షత్రం 4 వ పాదం – నాలుగోపాదం గురుడిది. కాని ఉగ్రాంశ ఈ వేళాప్రభాతులు మాతాపితరులకి మారక_ కారకులవుతారు. ధననాశకులు, పరుల పెంపకంలో ఉండేవారూూ ఏదో నామ్‌కే వాస్తే సుఖపడేవాళ్ళుగా ఉంటారు.
Ashlesha Nakshatra Strength
ఆశ్లేష నక్షత్ర జాతకుల బలాలు:
- గౌరవం
- నేర్పరితనం
- దైర్యం
Ashlesha Nakshatra Weakness
ఆశ్లేష నక్షత్ర జాతకుల బలహీనతలు:
- అబద్దాలు
- వ్యాదులు
Ashlesha Nakshatra Favorable & Unfavorable
- అనుకూలము – వ్యాజ్యాలు దాఖలు చేయడం, పాయిజనింగ్, శత్రువులకు వ్యతిరేకంగా కుట్రలు, స్వల్పకాలిక ప్రాస్పెక్ట్ లు, కుండలినీ యోగా, జూదం, చీడపీడల నియంత్రణ, లైంగిక కార్యకలాపాలు మరియు పనికిరాని వస్తువులను పారవేయడం కఠినమైన ప్రవర్తన అవసరమయ్యే కార్యకలాపాలు
- అననుకూలము – అబద్ధం చెప్పడం, డబ్బుతో వ్యవహరించడం, కొత్త కార్యకలాపాలను ప్రారంభించడం లేదా సానుకూల స్వభావం కలిగిన ప్రాజెక్ట్ లను ప్రారంభించడం, బిజినెస్, ట్రేడ్, మరియు ఫైనాన్షియల్ లోన్ ఇవ్వడం లేదా అందుకోవడం
- ఈ నక్షత్రంలో 32 వ ఘటిక తర్వాత విషనాడీ
ఆశ్లేష నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు
Nakshatram | Ashlesha |
---|---|
తిథి | పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి |
వారాలు | బుద, గురు, శుక్ర, శని వారములు |
సంవత్సరము | 16, 23, 30, 36, 42, 44, 48, 53 |
నక్షత్రాలు | ఉత్తరాభాద్ర |
సంఖ్య | 5 |
రంగు | పచ్చ |
రత్నం | పచ్చ |
రుద్రాక్ష | పంచ ముఖి |
లోహం | బంగారం |
దిక్కు | ఉత్తరం |
దైవము | విష్ణువు |
Ashlesha Nakshatra – Education
ఆశ్లేష నక్షత్రం – విద్య:
సివిల్/మెకానికల్/ట్రాన్స్ పోర్ట్/ఇన్ స్ట్రుమెంటల్ఇంజనీరింగ్, భూగర్భ జలాలు. వృథా నీరు.
ఫార్మసీ, మాస్టర్ ఆఫ్ లా, సేల్స్ & మార్కెటింగ్
Ashlesha Nakshatra – Profession, Job, Business
ఆశ్లేష నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:
వ్యాపారం, వాణిజ్యం, అంతర్జాతీయ వాణిజ్యం, ఏజెంట్, రచయిత, రచయిత, నీటి సరఫరా ఇంజనీర్, నూలు, పెన్ను, కాగితం, గైడ్, హోస్టెస్ లో డీలర్. జ్యోతిష్కుడు, మంత్రసాని, నర్సు.
Ashlesha Nakshatra Health
ఆశ్లేష నక్షత్రం – ఆరోగ్యము:
జలుబు- కడుపు, చుక్కలు, గాలులు, మోకాళ్లు మరియు కాలు నొప్పులు, హిస్టీరియా, ఆందోళన, అజీర్ణం, కఫం, అపానవాయువు, గాలి-నొక్కే డయాఫ్రమ్శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది, నెఫ్రిటిస్.
Ashlesha Nakshatra Remedies
ఆశ్లేష నక్షత్రం – శాంతి పూజ విధులు:
ఆశ్లేష నక్షత్రం 2,3,4 పాదములు దోషము కలదు.
ఈ తార లో వ్యాదిగ్రస్తలకు ప్రాణగండం. అందు నిమిత్తంగా పసుపూ తేనెరంగు కలిపిన నాగ దేవత ప్రతిమను చేసి మూలమం త్రంతో సర్పదైవాన్ని ప్రతిమ లోకి ఆవాహనచేసి షోడశోపచారాలతోనూ ఆరాధించాలి, పూజలో కుంకుము గంధా న్నీ ససుపురంగు వస్త్రన్నీ, ఎ(రని పువ్వు, నెయ్యి గుగ్గిలం కలిపిన ధూసాన్నీ వినియోగించాలి. క్షీరాన్నం నివేదించాలి .
Ashlesha Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka
ఆశ్లేష నక్షత్ర గాయత్రి మంత్రం:
ఓం సర్పరాజాయ విద్మహే
మహారోచకాయ ధిమహి
తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్
ఆశ్లేష నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ॥ 33 ॥
ఆశ్లేష నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
ఇష్టోఽవిశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ 34 ॥
ఆశ్లేష నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ 35 ॥
ఆశ్లేష నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః ।
వాసుదేవో బృహద్భానురాదిదేవః పురంధరః ॥ 36 ॥