Punarvasu Nakshatra: పునర్వసు నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Punarvasu Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.
Table of Contents
Punarvasu Nakshatra Details
నక్షత్రము | పునర్వసు |
---|---|
అధిదేవత | అదితి |
తారల సంఖ్య | 5 |
గుర్తు | బాణం |
గ్రహం | గురు |
పురుషార్థ | అర్థ |
యోని (Gender) | పురుష |
గణ | దేవ |
వర్ణ | వైశ్య |
ఎలిమెంట్ | జల |
త్రిమూర్తి | బ్రహ్మ |
త్రి దోష | వాతము |
రంగు | బూడిద |
దిక్కు | ఉత్తరం |
గోత్రం | మారిచి |
గుణము | సత్వ గుణం |
శరీర భాగము | ముక్కు |
జంతువు | పిల్లి |
పక్షి | హంస |
చెట్టు | వెదురు |
మొదటి అక్షరం | కె, కో, హ, హీ |
Punarvasu Nakshatra Characteristics
పునర్వసు నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:
ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించినవారి జీవితం గురు మహాదశలో ప్రారంభమవుతుంది. ఈదశ 16 సంవత్సరం లు. అనంతరం శని మహాదశ 19 సంవత్సరాలు. ఈ పునర్వసు నక్షత్రం లో జన్మించినవాళ్ళు భోజన ప్రియులు, సత్యవాదులూ, మంచి – గుణాలు కలవారు, – ఉత్సాహవంతులు, త్యాగశీలులు, వైభవోపేతులు, హాస్యప్రియులు, హీనమైన కంఠస్వరం కలవాళ్ళూ, బుద్దిమంతులుగ ఉంటారు.
Punarvasu Nakshatra Personality
పునర్వసు నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:
పునర్వసు నక్షత్రం 1 వ పాదం – ప్రథమపాదం కుజుడిది ఉత్తమాంశ. ఈ జాతకులు దేవ బ్రాహ్మణభిక్తి కలవారు. ఎర్ర టి కళ్ళుంటాయి. కుత్సిత బుద్ది ఉంటుంది.
పునర్వసు నక్షత్రం 2 వ పాదం – రెండవపాదం శుక్రుడిది భోగాంశ ఈ అంశాజాతులు వస్రాలంకార వంతులూ, క్షీరన్న భోజనప్రియులు ధనికులూ అవుతారు.
పునర్వసు నక్షత్రం 3 వ పాదం – తృతీయపాదం బుధుడిది సౌంయాంశ. వీళ్ళు కాముకులు లోభులు, చిరాయుష్మంతులు, అయినప్పటికీ స్వల్పరోగవంతులు
పునర్వసు నక్షత్రం 4 వ పాదం – 4 వ పాదం చంద్రుడిది దనాంశ తేజస్వి, సర్వజనులకు ప్రియం చేసే వారు, దనవంతులు అవుతారు.
Punarvasu Nakshatra Strength
పునర్వసు నక్షత్ర జాతకుల బలాలు:
- ఆకర్షణ
- జ్ఞానం
- ఓపిక
Punarvasu Nakshatra Weakness
పునర్వసు నక్షత్ర జాతకుల బలహీనతలు:
- మొహమాటం
Punarvasu Nakshatra Favorable & Unfavorable
- అనుకూలము – ప్రయాణం, అన్వేషణ, తీర్థయాత్ర, ఊహ, ఆవిష్కరణ, బలిపీఠాల స్థాపన, మాతృ దేవతను ఆరాధించడం, పిల్లల సంరక్షణ, గృహాలు మరియు కార్లు కొనడం, వ్యవసాయం, తోటపని, భవనంలో పని ప్రారంభించడం, వివాహం, విద్య, ధ్యానం, సంబంధాల కోసం కొత్త ప్రారంభం, ప్రాజెక్ట్‌లు మరియు కార్యకలాపాలు
- అననుకూలము – రుణాలు ఇవ్వడం, రుణం తీసుకోవడం, చట్టం, చట్టపరమైన విషయాలు, సంఘర్షణ లేదా దూకుడు
- ఈ నక్షత్రంలో సూర్యోదయాది 14 వ ఘటిక తర్వాత విషనాడీ
పునర్వసు నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు
Nakshatram | Punarvasu |
---|---|
తిథి | పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశి |
వారాలు | ఆది, సోమ, గురు వారములు |
సంవత్సరము | 18, 21, 26, 30, 39, 48, 57 |
నక్షత్రాలు | శతభిషం |
సంఖ్య | 3 |
రంగు | పసుపు |
రత్నం | కనకపుష్యరాగం |
రుద్రాక్ష | పంచ ముఖి |
లోహం | బంగారం |
దిక్కు | ఈశాన్యం |
దైవము | శివుడు, దత్తాత్రేయుడు |
Punarvasu Nakshatra – Education
పునర్వసు నక్షత్రం – విద్య:
M.Com, కంపెనీ సెక్రటరీ, ఆడిటర్, మార్కెటింగ్/ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఇన్సూరెన్స్, IAS, జర్నలిజం, జ్యోతిష్యం, ఆంగ్ల సాహిత్యం, రాజకీయ శాస్త్రం.
Punarvasu Nakshatra – Profession, Job, Business
పునర్వసు నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:
స్టోరీ రైటింగ్, ఎడిటింగ్, పబ్లిషింగ్, లా, లిటరేచర్, ఇన్సూరెన్స్ ఏజెన్సీ, అకౌంటెంట్స్, ఆడిటర్స్, జడ్జీలు, స్కూల్ మాస్టర్, ఇంటర్‌ప్రెటర్.జ్యోతిష్యుడు, గుమస్తా, బట్టలు, ఉన్ని వ్యాపారులు.
Punarvasu Nakshatra Health
పునర్వసు నక్షత్రం – ఆరోగ్యము:
బ్రోన్కైటిస్, న్యుమోనియా, లాక్టీల్స్, థొరాసెస్, ఛాతీ, బెరిబెరి, కడుపు నొప్పి, అవినీతి రక్తం, క్షయ, కాలేయ సమస్యలు, అజీర్తి, కామెర్లు.
Punarvasu Nakshatra Remedies
పునర్వసు నక్షత్రం – శాంతి పూజ విధులు: ఈ పునర్వసూ తారలో వ్యాధి గ్రస్తులయిన వారికి వారం రోజులపాటు అరిష్టం యేర్పడుతుంది. ఆ అరిష్టశాంత్యర్టం –
నల్హనిరంగు కలదీ వాలుగు భుజాలుకలదీ, అక్షసూత్ర కమండువులను ధరించినదీ, గుర్రపు వాహనం పై వున్నదీ అయిన అదితి విగ్రహాన్ని నిర్మించి దానికి ప్రాణ ప్రతిష్టాపనా కళాన్యాసాదులూ ఆవాహన. చేసి షోడశోపచారాలతో పూజించాలి. ముఖ్యంగా ఈ పూజలో పీత (బంగారు రంగు) కుంకుమ గంధం, మల్లికలు, మలయజధూపం వినియోగించాలి. గుడాన్నం (బెల్లంతో కలిసివ, లేదా కలిపి వండిన అన్నం) నివేదించాలి.
Punarvasu Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka
పునర్వసు నక్షత్ర గాయత్రి మంత్రం:
ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే
అదితి పుత్రాయ ధిమహి
తన్నో పునర్వసు ప్రచోదయాత్
పునర్వసు నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః ।
అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ॥ 25 ॥
పునర్వసు నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ 26 ॥
పునర్వసు నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః ।
సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః ॥ 27 ॥
పునర్వసు నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః ।
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః ॥ 28 ॥