వృషభ రాశి లక్షణాలు, వ్యక్తిత్వం, బలం & బలహీనత: వృషభ రాశి (Vrushabha Raasi) జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము, అదృష్ట విషయములు మరియు ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Vrushabha Raasi (Taurus Sign) Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.
Table of Contents
Vrushabha Raasi (Aries Sign) Details
రాశి సంఖ్య | 2, సరి రాశి |
రాశి | వృషభం |
అధిపతి | శుక్రుడు |
నక్షత్రములు | కృత్తిక 2,3,4, రోహిణి 1,2,3,4, మృగశిర 1,2 పాదములు |
గుర్తు | ఎద్దు |
సూర్య గ్రహ సంచారం | ఏప్రిల్ 20 – మీ 20 |
తత్వము (element) | భూమి |
పురుషార్దము | అర్ధం |
శరీర భాగము | ముఖం |
చర/స్తిర/ ద్విస్వభావ | స్తిర రాశి |
లింగము | స్త్రీ |
ఆయుర్వేద దోషము | వాతము |
గుణము | రజో గుణము |
దిశ | దక్షిణం |
రంగు | తెలుపు |
పగలు / రాత్రి | రాత్రి |
ఉదయం (raising) | Prishthodaya రాశి |
వర్ణం | వైశ్య |
Vrushabha Raasi Characteristics
వృషభ రాశి లో జన్మించిన వారి గుణగణాదులు: అందమైన, ముఖం, స్థిరమైన, నిదానమైన, నమ్మకమైన ధోరణి, ఓపిక, దయ, తార్కిక బలము, చక్కటి దంతాలు, పెద్ద కళ్ళు, మందపాటి జుట్టు.
Vrushabha Raasi Personality
వృషభ రాశి లో జన్మించిన వారి స్వభావము: శుక్రుడు వృషభ రాశి అడిపతి. ఇది స్తిర రాశి. భూతత్వం కలిగి వున్నది. ఈ రాశి వారికి బలమైన, స్థిరమైన మరియు పక్షపాత వ్యక్తిత్వం కూడా వస్తుంది.
రాశిచక్రం యొక్క రెండవ రాశి వృషభం. ఈ వ్యక్తులు నిశ్శబ్దంగా మరియు సున్నితంగా ఉంటారు, కానీ వారికి వారి స్వంత భావాలు కలిగి వుంటారు.
వృషభ రాశి వారు డబ్బు, సంపద మరియు హోదాను ఇష్టపడతారు. వ్యాపార విషయాలలో రాణిస్తారు. ఈ రాశి యొక్క ఆధిపత్య లక్షణం వంగని, స్థిరమైన స్వభావాన్నిఇస్తుంది. రొటీన్‌లో మార్పులను ఇష్టపడరు. సహాయము చేయటానికి సిద్దముగా వుంటారు. పెద్ద గుంపుకు భరోసా గా వుంటారు.
ఒక సారి నిర్ణయించుకుంటే సాధించే వరకు వదలరు. వృషభరాశి స్థానికులు తమకు కావలసిన వాటిని పొందటానికి ప్రయత్నిస్తారు. ఆహ్లాదకరమైన, ఓదార్పునిచ్చే విషయాలను ఇష్టపడతారు.
వారు స్వభావంలో చాలా అంతర్ముఖులు మరియు చాలా విశ్వాసకులు. ఈ రాశి వ్యక్తుల మిత్రులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు. వీరిని విశ్వసించవచ్చు.
భద్రత మరియు భావోద్వేగ నిబద్ధత వీరికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. కానీ వృషభ రాశి జాతకులు వీరి భాగస్వామికి స్వేచ్ఛను అందించడానికి ఇష్టపడకపోవచ్చు.
చెడు గ్రహ ప్రభావము వలన సులభంగా చెడు అలవాట్లకు లోనవుతారు మరియు కొన్ని సమయాల్లో సోమరితనం కలిగి ఉంటారు. వీరు స్థిరనివాసి, బిల్డర్ మరియు పెట్టుబడిదారు. వృషభరాశి స్థానికులు విధి, బాధ్యత మరియు విశ్వసనీయత యొక్క భావాన్ని కలిగి ఉంటారు.
Also Read: మేష రాశి Mesha Raasi Characteristics, Personality, Strength & Weakness
Vrushabha Raasi Strength
వృషభ రాశి లో జన్మించిన వారి బలము
- తార్కికం
- ఉదారం, దయ
- విషయ అవగాహన
Vrushabha Raasi Weakness
వృషభ రాశి లో జన్మించిన వారి బలహీనత
- మొండితనం
- బద్దకం
- వ్యాపార ధోరణి
Vrushabha Raasi Luck & Favourable
వృషభ రాశి లో జన్మించిన వారి అదృష్ట మరియు అనుకూల అంశములు
అదృష్ట రంగు | తెలుపు |
అదృష్ట రత్నం | వజ్రం |
అదృష్ట వారము | శుక్ర వారము |
అదృష్ట సంఖ్య | 6 |
అనుకూల రాశి (compatible sign) | కన్య , వృశ్చికం |
బీజ మంత్రం | ॐ ह्रीं क्लीं श्रीं | |
Vrushabha Raasi Education
వృషభ రాశి – విద్య
Statistics, గణితము, సివిల్ ఇంజనీరింగ్, ఎంబిఏ, ఫైనాన్స్, హోటల్ మ్యానేజ్మెంట్, డిజైన్, ఆర్ట్స్, సైకాలజీ
Vrushabha Raasi Profession, Job, Business
వృషభ రాశి – వృత్తి, ఉద్యోగ, వ్యాపారములు
బ్యాంక్, ఆడిటర్, నిర్మాణాలు, ఫ్యాన్సి షాప్, ఏజెన్సీ, సినిమా, బట్టల షాప్, పూలు, నిత్యవసర వస్తువుల షాప్
Vrushabha Raasi Health
వృషభ రాశి – ఆరోగ్యము
కళ్ళు, మొటిమలు, గొంతు, ముక్కు, జలుబు, కొవ్వు కు సంభందించిన వ్యాధులు
Vrushabha Raasi Remedies
వృషభ రాశి – పరిహారములు
వృషభ రాశి వారు ప్రతి శని వారము రావి చెట్టును, ఆంజనేయ స్వామిని పూజించవలెను. ముఖ్యమైన పనులకు వెండి, తెల్లని వస్త్రము దగ్గర వుంచుకొనవలెను. చందనము నుదుటన ధరించ వలెను. సుగంధము, శుభ్ర మైన వస్త్రములను ధరించ వలేను. స్త్రీ లను గౌరవించవలెను, శుక్ర వారము కుల దేవతను ఆరాధించవలెను. మంగళ వారము కందిపప్పు దానము ఇవ్వడము, పారే నీటిలో వడలదము మంచిది.