వృశ్చిక రాశి లక్షణాలు, వ్యక్తిత్వం, బలం & బలహీనత: వృశ్చిక రాశి Vruschika Raasi జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము, అదృష్ట విషయములు మరియు ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Vruschika Raasi (Scorpio Sign) Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.
Table of Contents
Vruschika Raasi (Scorpio Sign) Details
రాశి సంఖ్య | 8, సరి రాశి |
రాశి | వృశ్చికము |
అధిపతి | మంగళుడు |
నక్షత్రములు | విశాఖ 4, అనురాధ 1,2,3,4 జ్యేష్ట 1,2,3,4 పాదములు |
గుర్తు | తేలు |
సూర్య గ్రహ సంచారం | అక్టోబర్ 23 – నవంబర్ 21 |
తత్వము (element) | జలము |
పురుషార్దము | మోక్షము |
శరీర భాగము | జననేంద్రియములు (private parts) |
చర/స్తిర/ ద్విస్వభావ | స్తిర |
లింగము | స్త్రీ |
ఆయుర్వేద దోషము | కఫము |
గుణము | రజో |
దిశ | ఉత్తరము |
రంగు | ఎర్ర గోధుమ |
పగలు / రాత్రి | పగలు |
ఉదయం (raising) | Seershodaya |
వర్ణం | బ్రాహ్మణ |
Vruschika Raasi Characteristics
వృశ్చిక రాశి లో జన్మించిన వారి గుణగణాదులు:
మానసిక మరియు శారీరక సామర్థ్యాలను పరీక్షించే కఠినమైన సవాళ్లను అనుసరిస్తారు. జ్ఞానం కోసం మరియు సృష్టి రహస్యాలను తెలుసుకోవాలని పరితపిస్తారు. రహస్యాలను దాచి వుంచడం, ఇతరుల రహస్యాలను తెలుసుకోవడం, దాడి చేయుటకు సరి అయిన సమయం కోసం ఎదురు చూడడటం. తీవ్రమైన దేశ భక్తి, అంకితభావం మరియు విధేయత
Vruschika Raasi Personality
వృశ్చిక రాశి లో జన్మించిన వారి స్వభావము:
ఈ రాశి అధిపతి అంగారకుడు. జల రాశి మరియు స్తిర రాశి. గుర్తు తేలు. ఈ రాశి వారికి బయము తక్కువ.
ఏదైన విషయమును లోతుగా ఆలోచిస్తారు. కేతువు గ్రహము అనుగ్రహము ఉంటే బాగా ధ్యానము చేయగలుగుతారు, ఏకాంతం ను ఇష్ట పడతారు.
ఒకరి జోలికి పోరు , ఎవరయిన వీరిని అనవసరంగా వీరి జోలికి వస్తే ఇక వారికి కష్ట కాలము మొదలు అయినట్టే, ఒక సారి నిర్ణయించు కుంటే దొంగ దెబ్బ తీయడానికి కూడా వెనకాడరు, వీరిని మోసము చేయడము కష్టము ఎవరిని త్వరగా నమ్మరు, ఒక వేళ ఇతరులు వీరిని మోసము చేస్తే ఇక వారిని ప్రశాంతం గా బ్రతకనివ్వరు.
ఈ రాశి మార్మిక మైనది. అనేక రహాస్యములను, ముఖ్యమైన మరియు అనుకొని మార్పులను సూచించును. ఈ రాశి వారు మంత్ర, తంత్రములను సాధన చేయడము, సృష్టి రహాస్యములను ,
ఇతరుల రహాస్యములను తెలుసుకోవడము లో నేర్పరులు, వీరి లో చాలా మంది దేశ భక్తులు కూడా వుందురు. రహస్య గూడ చారులు ఎకువగా ఈ రాశిలో వుందురు.
వీరిని నమ్ముకున్న వారిని స్నేహితులను ఆదుకుంటారు. వీరికి పట్టుదల ఎక్కువ గా వుండును. కుజుడు బలము గా వుంటే పగ తీర్చుకోవడం, అనుకున్నది సాధించేవరకు వదలక పోవడం వంటివి జరుగును.
వీరు మంచి వక్తలు గా వుందురు. చక్కని సంతానము కలిగి వుందురు. జీవితం వివాహమునకు ముందు ఆ తరువాత అనునట్లు వుండును.
జాతకము లో సప్తమ భావం బాగుంటే వివాహము తరువాత మంచి అభివృద్ది వుండును. ఈ రాశి లో కొందరికి స్త్రీ కొరకు ఎక్కువ గా ఖర్చు పెట్టవలసి వచ్చును.
కుజ శుక్రులు బాగుంటే విపరీత శృంగార కోరికలు ఉండును. లేకపోతే ఆధ్యాత్మిక బాట పట్టి గొప్ప యోగులు గా కూడా అగును. శత్రువుల పై ఆధిపత్యం కలిగి వుంటారు. అనేక విషయముల పైన అవగాహన కలిగి వుంటారు.
Check: తుల రాశి Tula Raasi Characteristics, Personality, Strength & Weakness
Vruschika Raasi Strength
వృశ్చిక రాశి లో జన్మించిన వారి బలము
- అనేక విషయముల పైన అవగాహన
- సరి అయిన సమయము కోసం ఎదురు చూడటం
- ధైర్యము
Vruschika Raasi Weakness
వృశ్చిక రాశి లో జన్మించిన వారి బలహీనత
- కోపము
- పగ
- పట్టుదల
Vruschika Raasi Luck & Favourable
వృశ్చిక రాశి లో జన్మించిన వారి అదృష్ట మరియు అనుకూల అంశములు
అదృష్ట రంగు | రక్త వర్ణం |
అదృష్ట రత్నం | కెంపు |
అదృష్ట వారము | గురువారము , ఆది వారము |
అదృష్ట సంఖ్య | 9, 1 |
అనుకూల రాశి (compatible sign) | వృషభము, మీనము, కన్య |
బీజ మంత్రం | ॐ नारायणाय सुरसिंघाय नमः ।। |
Vruschika Raasi Education
వృశ్చిక రాశి – విద్య
Minimg engineering, పురావస్తు శాస్త్రము, హ్యూమన్ రిసోర్స్ మ్యానేజ్మెంట్, మెకానికల్, వైద్యం, మంత్ర ,తంత్ర శాస్త్రములు,
Vruschika Raasi Profession, Job, Business
వృశ్చిక రాశి – వృత్తి, ఉద్యోగ, వ్యాపారములు
డిటెక్టివ్, మందుగుండు సామగ్రి తయారీ, పోలిటిక్స్, పోలీస్, military, ఎక్కువ చక్రములు వున్న వాహనములు నడుపుట (రైల్వే), minerals ఫ్యాక్టరీ, లైఫ్ ఇన్సూరెన్స్.
Vruschika Raasi Health
వృశ్చిక రాశి – ఆరోగ్యము
ఈ రాశి లో పాప గ్రహములు వుంటే జననేంద్రియము లకు సంభందించిన సమస్యలు, మొలలు, రక్త పీడనం (BP) స్త్రీ లకు అధిక రక్త శ్రావము లేదా ఋతు చక్ర సమస్యలు ముఖ్యమైనవి.
Vruschika Raasi Remedies
వృశ్చిక రాశి – పరిహారములు
సముద్ర శంఖము పూజ మందిరము లో వుంచవలెను, ఎర్ర కండి పప్పు దానము చేయడము, పారే నది లో చేపలకు ఆహారము వేయవలెను. గులాబీ లతో నది పూజ చేయ వలేను. గురువారము అరటి చెట్టు దీపారాధన చేయవలెను. దీని వలన ఆర్ధిక సమస్యలు తొలగును. శని వారము ఆంజనేయ స్వామికి ఆరాధన చేయవలెను. ఆవుకు చీమలకు బెల్లము ఆహారము గా ఇవ్వడము మంచిది. ఎర్రని వస్త్రము దగ్గర వుంచుకోవలెను.