Uttara Phalguni Nakshatra: ఉత్తరా ఫల్ఘుని నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Uttara Phalguni Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.
Table of Contents
Uttara Phalguni Nakshatra Details
నక్షత్రము | ఉత్తరా ఫల్ఘుని |
---|---|
అధిదేవత | ఆర్యమన్ |
తారల సంఖ్య | 2 |
గుర్తు | మంచం యొక్క వెనక పాదాలు |
గ్రహం | సూర్య |
పురుషార్థ | ధర్మ |
యోని (Gender) | మోక్ష |
గణ | మనుష్య |
వర్ణ | క్షత్రియ |
ఎలిమెంట్ | అగ్ని |
త్రిమూర్తి | శివ |
త్రి దోష | వాతం |
రంగు | నీలం |
దిక్కు | తూర్పు |
గుణము | రజో గుణం |
శరీర భాగము | ఎడమ చేయీ |
జంతువు | ఆవు |
పక్షి | నెమలి |
చెట్టు | రేగు చెట్టు |
మొదటి అక్షరం | టే, టో, పా, పి |
Uttara Phalguni Nakshatra Characteristics
ఉత్తరా ఫల్ఘుని నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:
ఈ ఉత్తరా ఫల్ఘుని నక్షత్రంలో జన్మించినవారి జీవితం సూర్య మహాదశలో ప్రారంభమవుతుంది. ఈ దశ 6 సంవత్సరం లు. అనంతరం చంద్ర మహాదశ 10 సంవత్సరాలు. ఈ ఉత్తర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఆత్మాభిమానులు, సర్వ కార్య నిర్వహణదక్షులు, ధర్మాత్ములు నేర్పరులూ, ప్రతాపవంతులూ, వినయశీలురు పండితులు, దేహంపై తిలకాలు గలవాళ్ళూ అవుతారు. వీళ్ళది వేడిశరీరం, అల్ప సౌఖ్యం. (స్త్రీ) వ్యసనం వల్ల రోగపీడితులవుతూ ఉంటారు.
Uttara Phalguni Nakshatra Personality
ఉత్తరా ఫల్ఘుని నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:
ఉత్తరా ఫల్ఘుని నక్షత్రం 1 వ పాదం – పుష్యమీ ప్రథమపాదం గురుడుది ఈ వేళా సంజాతులు వాతరోగులు, పరిశుద్దులు, కవులు వుంటారు
ఉత్తరా ఫల్ఘుని నక్షత్రం 2 వ పాదం – ద్వితీయపాదం శనిది. పాపాంశ పరపీడ, చంచలత్వం దరిద్రం.
ఉత్తరా ఫల్ఘుని నక్షత్రం 3 వ పాదం – మూడవపొదం కూడా శనిదే. ఇది ఉగ్రాంశ ఈ అంశలో జన్మించిన వాళ్ళు చేసిన మేలును మరచిపోయె వాళ్ళూ, చెడువాదనలు, డాంబికులు, గర్విష్టులు అందరినీ వేళాకోళం చేసేవాళ్ళూ అవుతారు.
ఉత్తరా ఫల్ఘుని నక్షత్రం 4 వ పాదం – నాలుగోపాదం గురుడిది. శుభాంశం. ఈ జాతకులు విద్యవినయసంపన్నులూ , పుత్రవంతులూ అవుతారు.
Uttara Phalguni Nakshatra Strength
ఉత్తరా ఫల్ఘుని నక్షత్ర జాతకుల బలాలు:
- మేధావులు
- సంపన్నులు
Uttara Phalguni Nakshatra Weakness
ఉత్తరా ఫల్ఘుని నక్షత్ర జాతకుల బలహీనతలు:
- పొగరు
- పరపీడ
Uttara Phalguni Nakshatra Favorable & Unfavorable
- అనుకూలము – వివాహం, లైంగిక కార్యకలాపాలు, కార్యకలాపాలు ప్రారంభించడం, ఒక సంస్థను స్థాపించడం, అధికార వ్యక్తులతో వ్యవహరించడం, అడ్మినిస్ట్రేటివ్ వర్క్, ఇల్లు కొనడం, ప్రారంభోత్సవాలు, వేడుకలు నిర్వహించడం, దాతృత్వానికి ఇవ్వడం, దౌత్యం మరియు కొత్త దుస్తులు లేదా ఆభరణాలను ధరించడం
- అననుకూలము – ముగింపులు, పూర్తి చేయడం, ఘర్షణలు, ప్రతీకారం తీర్చుకోవడం, కఠినమైన ప్రవర్తన అవసరమైన కార్యకలాపాలు, ప్రతీకారం తీర్చుకోవడం, యుద్ధం చేయడం మరియు డబ్బు అప్పు ఇవ్వడం
- ఈ నక్షత్రంలో 18 వ ఘటిక తర్వాత విషనాడీ
ఉత్తరా ఫల్ఘుని నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు
Nakshatram | Uttara Phalguni |
---|---|
తిథి | పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశి |
వారాలు | ఆది, బుద, గురు వారములు |
సంవత్సరము | 16, 23, 30, 37, 45, 50 |
నక్షత్రాలు | రోహిణి |
సంఖ్య | 1 |
రంగు | నీలం |
రత్నం | కెంపు |
రుద్రాక్ష | ఏక ముఖి |
లోహం | బంగారం |
దిక్కు | తూర్పు |
దైవము | సూర్యుడు |
Uttara Phalguni Nakshatra – Education
ఉత్తరా ఫల్ఘుని నక్షత్రం – విద్య:
M.Tech, ఎలక్ట్రికల్ ఇంజనీర్, టూరిజం, టీచింగ్, మాస్టర్ ఆఫ్ సర్జరీ, హార్ట్, చెస్ట్, వెటర్నరీ, హాస్పిటల్ మేనేజ్ మెంట్.
Uttara Phalguni Nakshatra – Profession, Job, Business
ఉత్తరా ఫల్ఘుని నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:
ప్రభుత్వం, వాణిజ్యం కింద ఏదైనా సేవ, స్టాక్ ఎక్స్ఛేంజ్, మెటర్నిటీ హోమ్, లెక్చరర్, విద్యాశాఖ, కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్, కాంట్రాక్టర్లు, వైద్యులు
Uttara Phalguni Nakshatra Health
ఉత్తరా ఫల్ఘుని నక్షత్రం – ఆరోగ్యము:
మచ్చల జ్వరం, నొప్పులు, బి.పి., మూర్ఛ, పిచ్చి, మెదడు, రక్తం, గడ్డకట్టడం, గుండె దడ, కడుపు రుగ్మతలు, గొంతు నొప్పి, ప్రేగు కణితులు, మెడ వాపు.
Uttara Phalguni Nakshatra Remedies
ఉత్తరా ఫల్ఘుని నక్షత్రం – శాంతి పూజ విధులు:
పుష్యమి నక్షత్రం మొదటి 2 పాదములు దోషము కలదు.
ఈ నక్షత్రంలో జ్వరపడినవారికి 7 దినాలు అరిష్టం, శాంతి కొరకు నాలుగు చేతులూ, ఆ నాలుగు చేతులందునా అక్షసూత్రకమండువులు వరదముద్రా ధరించి వున్నట్టుగానూ, బంగారపు రంగు -. కట్టుకున్న బృహస్పతి విగ్రహాన్ని నిర్మించి ఆవాహన చేసి “బృహస్పతే…. అనే మం త్రాదిగా షో డశోపచారాలు – చేయాలి. ఈ పూజలోకి’ ఎర్రతామర పూవుల్నీ చంద్రధూకుంకుముగంధాన్ని ఉపయోగించాలి. _ దద్దోజనాన్ని సమర్పించాలి.
Uttara Phalguni Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka
ఉత్తరా ఫల్ఘుని నక్షత్ర గాయత్రి మంత్రం:
ఓం మహాబకాయై విద్మహే
మహాశ్రేష్ఠాయై ధీమహి తన్నో
ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్
ఉత్తరా ఫల్ఘుని నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ 45 ॥
ఉత్తరా ఫల్ఘుని నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
విస్తారః స్థావర స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ ।
అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥ 46 ॥
ఉత్తరా ఫల్ఘుని నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
అనిర్విణ్ణః స్థవిష్ఠో భూద్ధర్మయూపో మహామఖః ।
నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః, క్షామః సమీహనః ॥ 47 ॥
ఉత్తరా ఫల్ఘుని నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః ।
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥ 48 ॥