Uttara Ashadha Nakshatra (ఉత్తరాషాడ నక్షత్రం)

Uttara Ashadha Nakshatra: ఉత్తరాషాడ నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Uttara Ashadha Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.

Uttara Ashadha Nakshatra Details

నక్షత్రముఉత్తరాషాడ
అధిదేవత విశ్వేదేవ
తారల సంఖ్య 4
గుర్తు ఏనుగు దంతం
గ్రహం సూర్య
పురుషార్థ మోక్ష
యోని (Gender)స్త్రీ
గణ మనుష్య
వర్ణ క్షత్రియ
ఎలిమెంట్ వాయు
త్రిమూర్తి శివ
త్రి దోష కఫం
రంగు రాగి
దిక్కు దక్షిణం
గోత్రం క్రతు
గుణము రజో గుణం
శరీర భాగము నడుము
జంతువు ముంగీస
పక్షి కోకిల
చెట్టు పనస
మొదటి అక్షరం బే, బో, జా, జి

Uttara Ashadha Nakshatra Characteristics

ఉత్తరాషాడ నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:

ఈ ఉత్తరాషాడ నక్షత్రంలో జన్మించినవారి జీవితం సూర్య మహాదశలో ప్రారంభమవుతుంది. ఈ దశ 6 సంవత్సరం లు. అనంతరం చంద్ర మహాదశ 10 సంవత్సరాలు. ఈ ఉత్తరాషాడ నక్షత్రంలో ఫుట్టినవాళ్ళు శుచిమంతులు. సర్వ విషయాలు తెలిసినవాళ్ళు. సద్గుణాలు కలవాళ్ళూ. అతిథుల్ని గౌరవించే ఆనవాయితి కలవాళ్ళు. హాస్య ప్రియులు. పుత్రసంతానం కలవారూ, దయాహృదయులు. వినయంతో కూడిన వాక్‌ సంపన్నులు. శూరులు, ‘పెద్దముక్కు కలవారు అవుతారు.

Uttara Ashadha Nakshatra Personality

ఉత్తరాషాడ నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:

ఉత్తరాషాడ నక్షత్రం 1 వ పాదం -.ప్రదమ పాదం గురువుది. ఉత్త్పన్నాంశ. ఈ వేళాసంజాతులు బుద్రిమంతులు. శాస్త్రవేత్తలు. ఆస్తికులు. గురుభక్తులు. స్వధర్మ పాలనాచరితులు అవుతారు.

ఉత్తరాషాడ నక్షత్రం 2 వ పాదం – ద్వితీయ పాదం శనిది. పాపాంశ. ఈ జాతకులు పనికిరాని పనులుచేయడంలో ఘనులు. ఇతర మతాలపట్ల ప్రేమాభిమానాలు కలవాళ్ళు ఉంటారు.

ఉత్తరాషాడ నక్షత్రం 3 వ పాదం – తృతీయపాదం కూడా శనిదే. ఇది ఉగ్రాంశ. స్టూలశరీరులు. అల్పసంతోషులు, నిత్యం వ్యాదిగ్రస్తం
ఉత్తరాషాడ నక్షత్రం 4 వ పాదం – చతుర్ధ పాదం గురువుది – నిత్యం ఏదో ఒక పని చేసే వారు, శాస్త్ర చర్చ, వ్యాపారులు, ఉత్సాహవంతులు

Uttara Ashadha Nakshatra Strength

ఉత్తరాషాడ నక్షత్ర జాతకుల బలాలు:

  • మేధావులు
  • ధైర్యవంతులు.

Uttara Ashadha Nakshatra Weakness

ఉత్తరాషాడ నక్షత్ర జాతకుల బలహీనతలు:

  • పొగరు

Uttara Ashadha Nakshatra Favorable & Unfavorable

  • అనుకూలము – కార్యకలాపాలను ప్రారంభించడం, కార్యక్రమాలను ప్లాన్ చేయడం, ఆధ్యాత్మిక కార్యకలాపాలు, ఆచారాలు, వివేచనను ఉపయోగించడం, వ్యాపార వ్యవహారాలు, ఒప్పందాలు, పదోన్నతులు, అధికారంతో వ్యవహరించడం, కళాత్మక వెంచర్లు, ఒక భవనానికి పునాది వేయడం, కొత్త ఇంటికి మారడం, వివాహం, రాజకీయాలు మరియు చట్టపరమైన విషయాలు, ఒప్పందాలు, కళ, రాజకీయాలు, చట్టం
  • అననుకూలము – ప్రయాణం, తీర్మానాలు లేదా ఏదైనా విధమైన ముగింపులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అనైతిక కార్యకలాపాలు, క్రిమినల్ యాక్టివిటీ, ఆకస్మిక చర్యలు మరియు మొరటు ప్రవర్తన
  • ఈ నక్షత్రంలో 20 వ ఘటిక తర్వాత విషనాడీ

ఉత్తరాషాడ నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు

Nakshatram Uttara Ashadha
తిథి పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశి
వారాలు ఆది, గురు వారములు
సంవత్సరము 16, 23, 30, 36, 41, 45, 56
నక్షత్రాలు రోహిణి
సంఖ్య 1
రంగు కాషాయం
రత్నం కెంపు
రుద్రాక్ష సప్త ముఖి
లోహం బంగారం
దిక్కు తూర్పు
దైవము విష్ణువు

Uttara Ashadha Nakshatra – Education

ఉత్తరాషాడ నక్షత్రం – విద్య:

బీఏ, ఆర్ట్స్/ఎకనామిక్స్, డెంటల్ సర్జరీ, M.Tech. B.Sc. కంప్యూటర్, కెమికల్ఇంజనీరింగ్

Uttara Ashadha Nakshatra – Profession, Job, Business

ఉత్తరాషాడ నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:

ట్రస్ట్ యొక్క స్థానం, గని, బొగ్గు, శాస్త్రీయ రీసెర్చ్, ఫైనాన్స్ డిపార్ట్ మెంట్, కంట్రోల్డిపార్ట్ మెంట్, స్మారక చిహ్నాలు, పురావస్తు శాస్త్రం, పురాతన వస్తువులు, పురాతన భాష, చర్మాలు, చర్మాలు, ఉన్ని.

Uttara Ashadha Nakshatra Health

ఉత్తరాషాడ నక్షత్రం – ఆరోగ్యము:

తామర, చర్మవ్యాధి, కుష్టువ్యాధి, నిస్తేజమైన నొప్పి, జీర్ణ సమస్య, గుండె దడ, రుమటిజం, కార్డియాక్ థ్రోంబోసిస్, కడుపు గ్యాస్ వల్ల ఇబ్బంది..

Uttara Ashadha Nakshatra Remedies

ఉత్తరాషాడ నక్షత్రం – శాంతి పూజ విధులు:

ఉత్తరాషాడ నక్షత్రం 4 పాదములు దోషము లేదు.

ఈ నక్షత్రంలో అక్షసూత్ర కమండులాదులు ధరింబన నాలుగుచేతులు కలిగిన, శ్వేతవర్షమయ విశ్వేదేవతల స్వర్ణవిగ్రహాన్ని చెయించి ఆరాధించాలి మంత్రంతో . శ్వేతవస్త్రం, శ్రీగంధం, అయిదు రంగులపువ్వులు, అమలకధూపాలతో ఉపచారాలు అర్చించి పంచభక్ష్యాలను నివేదించాలి, అనంతరం గాయాత్రి అష్టోత్తరం తో పెసరపప్పు అన్నం నేతితో హోమం చేయాలి.

Uttara Ashadha Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka

ఉత్తరాషాడ నక్షత్ర గాయత్రి మంత్రం:

ఓం విశ్వేదేవాయ విద్మహే
మహాషాఢాయ ధిమహి
తన్నో ఉత్తరాషాఢా: ప్రచోదయాత్

ఉత్తరాషాడ నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

తేజోఽవృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాంవరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః ॥ 81 ॥

ఉత్తరాషాడ నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః ।
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥

ఉత్తరాషాడ నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥

ఉత్తరాషాడ నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః ।
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *