తుల రాశి Tula Raasi Characteristics, Personality, Strength & Weakness

తుల రాశి లక్షణాలు, వ్యక్తిత్వం, బలం & బలహీనత: తుల రాశి Tula Raasi జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము, అదృష్ట విషయములు మరియు ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Tula Raasi (Libra Sign) Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.

Tula Raasi (Libra Sign) Details

రాశి సంఖ్య7, బేసి రాశి
రాశితుల
అధిపతిశుక్రుడు
నక్షత్రములుచిత్త 3,4 స్వాతి 1,2,3,4 విశాఖ 1,2,3 పాదములు
గుర్తుత్రాసు
సూర్య గ్రహ సంచారంసెప్టెంబర్ 23 – అక్టోబర్ 22  
తత్వము (element)వాయువు
పురుషార్దముకామము
శరీర భాగమునాభి దిగువ
చర/స్తిర/ ద్విస్వభావచర
లింగముపురుష
ఆయుర్వేద దోషముమూడిటి మిశ్రమము (వాత,పిత్త,కఫ)
గుణమురజో
దిశపడమర
రంగునలుపు
పగలు / రాత్రిపగలు
ఉదయం (raising)Seershodaya
వర్ణంశూద్ర (worker)

Tula Raasi Characteristics

 తుల రాశి లో జన్మించిన వారి గుణగణాదులు:  

సున్నితంగా ఉంటారు, ఆసక్తి కలిగించేలా ఉంటారు, మనోహరంగా ఉంటారు మరియు ఇతరులతో సులభంగా కనెక్ట్ అవుతారు. చురుకుతనం, సమతుల్య స్వభావం, పక్ష పాత దొరణి లేకుండా ఆలోచించడం. దౌత్యపరమైన లక్షణాలు.

Tula Raasi Personality

 తుల రాశి లో జన్మించిన వారి స్వభావము: 

తుల రాశి అధిపతి శుక్రుడు. ఇది వాయు తత్వ రాశి. ఈ రాశి వారు ఆకర్షణ కలిగి వుంటారు.

ఎప్పుడు ఏదోకటి ఆలోచిస్తూ వుంటారు. ఆపకుండా పని చేయ గలరు. కర్మ కు కారకుడు అయిన శని ఇచ్చట ఉచ్చ స్తితి ని పొందును.

ఇతరులను judge చేయటము, ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించ గల తెలివితేటలు ఆలోచనలు భావాలు కలిగి వుంటారు. ఇది ఒక చర రాశి ఆగుట ఒక చోట స్తిరము గా కాకుండా ప్రయాణము లు చేయవలిసి వచ్చును.  

వీరికి త్వరగా కోపము రాదు వచ్చిన ఎక్కువ సేపు వుండదు. కానీ వీరి కోపానికి కారణమైన వారిని గుర్తు పెట్టుకునే స్వభావము కలిగి వుంటారు.

కళలను ఇష్టపడతారు. కళారంగము వారు ఈ రాశి లో వుంటారు. పెద్ద పెద్ద ఆశయములు కలిగి వుంటారు. విలాస వంతమైన జీవితము , ప్రజా ధరణ పొందాలని కోరుకుంటారు.

మంచి బోజన ప్రియులు కూడా వుంటారు. ఇతరుల సమస్యలను వీరి సమస్యలుగా భావించరు. ఈ రాశి వారికి ఇంటి నుంచి దూరంగా వెళ్ళాక స్తిర పడే అవకాశములు ఎక్కువ.

ఈ రాశి వారి లో ఎక్కువ మంది వీరి జీవిత భాగ స్వామి తో సరి అయిన  భందము నిలుపలేక కష్టాలు పడుతూ వుంటారు. ఈ రాశి కి 2,7 భావములు అధిపతి కుజుడు అవ్వడం వలన కుటుంభం లోని వారితోనే ఎక్కువ తగాదాలు పడుదురు.

వీరు ఇతరులతో సులభంగా కనెక్ట్ అవుతారు. సమాజము లో పలుకు బడి కలిగిన వ్యక్తులను సులభం గా కాలవ గలుగుతారు కానీ వీరి స్వంత పనుల కోసం వాడుకోరు. వీరి సమతుల్య స్వభావం వీరిని ఆచరణాత్మక పరిష్కారాల కోసం వెతకేలా చేస్తుంది.

Also See: మీన రాశి Meena Raasi Characteristics, Personality, Strength & Weakness

Tula Raasi Strength

 తుల రాశి లో జన్మించిన వారి బలము

  • చురుకుతనం
  • సమతుల్య భావం
  • ఆకర్షణ

Tula Raasi Weakness

 తుల రాశి లో జన్మించిన వారి బలహీనత

  • గుర్తింపు కోరుకోవటం
  • స్వంత వారికన్న ఇతరుల కోసం పని చేయడం
  • నిర్ణయము తీసుకొనడము కొన్నిసారులు కష్టం గా వుండును.

Tula Raasi Luck & Favourable

 తుల రాశి లో జన్మించిన వారి అదృష్ట మరియు అనుకూల అంశములు

అదృష్ట రంగునీలము , నలుపు
అదృష్ట రత్నంవజ్రము
అదృష్ట వారముశని వారము
అదృష్ట సంఖ్య6
అనుకూల రాశి (compatible sign)కుంభం, మేషం
బీజ మంత్రంॐ तत्वनिरञ्जनाय नमः ।।

Tula Raasi Education

తుల రాశి – విద్య

 గణితం, B.Com, chemical engineering, మార్కెటింగ్, ఫైనాన్స్, ఎకనమిక్స్ న్యాయవాది, alternative medicine, హోటల్ మ్యానేజ్మెంట్, ఎలెట్రికల్

Tula Raasi Profession, Job, Business

 తుల రాశి – వృత్తి, ఉద్యోగ, వ్యాపారములు

ప్రభుత్వ సంభందిత పనులు, ట్రావెలింగ్, మార్కెటింగ్, ఫైనాన్స్, న్యాయవాది, ఫ్యాన్సి షాప్, బ్యూటీ పార్లర్, డిజైన్, ఇంటీరియర్ డిజైన్, నగల దుకాణము, architect, సినిమా, కళలు.   

Tula Raasi Health

తుల రాశి – ఆరోగ్యము

తులా రాశి వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. వీరికి యూరినరీ , కిడ్ని , చర్మ, పక్షావాతము, నాడీ మండలము సంభందించిన సమస్యలు ఈ రాశి సూచించును.

Tula  Raasi Remedies

తుల రాశి – పరిహారములు

శుక్ర వారము లక్ష్మీ దేవి ఆరాధన చేయవలెను. జంతువులకు పక్షులకు ఆహారము ఇవ్వవలెను, ఎర్ర రంగు వస్త్రము దగ్గర వుంచుకొనవలెను, గో సేవ చేయవలెను. కృష్ణ ఆరాధన చేయడము , ఆవు నెయ్యి తో దీపారాధన మంచిది.

పాలు పాల పదార్ధములు దానము చేయవలెను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *