సింహా రాశి Simha Raasi Characteristics, Personality, Strength & Weakness

 సింహా రాశి లక్షణాలు, వ్యక్తిత్వం, బలం & బలహీనత: సింహా రాశి Simha Raasi జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము, అదృష్ట విషయములు మరియు ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Simha Raasi (Leo Sign) Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.

Simha Raasi (Leo Sign) Details

రాశి సంఖ్య5, బేసి రాశి
రాశిసింహా రాశి
అధిపతిసూర్యుడు
నక్షత్రములుమఖ 1,2,3,4, పుబ్బ 1,2,3,4 ఉత్తర 1 వ పాదములు
గుర్తుసింహము
సూర్య గ్రహ సంచారంజులై 23 – ఆగస్టు 22
తత్వము (element)అగ్ని
పురుషార్దముపురుష
శరీర భాగముఉదరము
చర/స్తిర/ ద్విస్వభావస్తిర రాశి
లింగముపురుష
ఆయుర్వేద దోషముపిత్తము
గుణముసత్వ
దిశతూర్పు
రంగుతెలుపు
పగలు / రాత్రిపగలు
ఉదయం (raising)Seershodaya
వర్ణంక్షత్రియ

Simha Raasi Characteristics

సింహా రాశి లో జన్మించిన వారి గుణగణాదులు: 

 రాచరికం, ఆత్మగౌరవం, పెంకితనం, ఆధిపత్యం, ఆత్మ స్తయిర్యం, అహంకారం, ఆకర్షణ, కళల ను ప్రోత్సహించడం, అసహనం, కుటుంభ పెద్ద, దయ , దాన గుణం, రొమాన్స్, మంత్ర సాధన, ఆధిపత్య ధోరణి.

Simha Raasi Personality

సింహా రాశి లో జన్మించిన వారి స్వభావము: 

ఈ రాశి కి అధిపతి సూర్యుడు. ఇది అయిదవ రాశి. సూర్యుడు గ్రహాలకు రాజు, ఆత్మ కారకుడు, కుటుంభం లో తండ్రిని సూచించును.

రాజు వలె దయ గుణము వుంటుంది మరియు అహం కారము వుంటుంది.

కళల ను ఇష్ట పడతారు ఇంకా ప్రోత్సాహిస్తారు. పొగడ్తలను ఇష్ట పడతారు కానీ అబద్దము చెప్పువారిని ఇష్టపడరు. తొందరగా అసహనానికి లోనూ అవుతారు.

రొమాన్స్ ను ఇష్ట పడతారు, ప్రేమ వ్యవహారాలు జీవితము లో ఎదురు అవుతాయి.

గ్రహములు యోగిస్తే చక్కని ఆకర్షణ కలిగి జనము మెచ్చిన నాయకులు ఈ రాశి లో ఎక్కువ గా వుంటారు. చూడచక్కగా వుంటారు. రవి బలము గా వుంటే will power ఎక్కువగా వుంటుంది.

అసాధారణ పనులు చేసి చూపుతారు. దాన దర్మములలో కూడా ఒక రాజు వలె నడుచుకుంటారు.   team లీడర్, నాయకత్వ లక్షణములు కలిగి వ్యవహార దక్షతను కూడా చూపిస్తారు.

జ్యోతిష్యము విద్య, మంత్ర సాధన వంటి విద్యలు కూడా చేయగలుగుతారు. ఉన్నత విద్యను చేయుటకు అవకాశము కూడా వుంటుంది.

వీరికి ఆధిపత్య ధోరణి వుండటము వలన శత్రువులను బాగా బయ పెట్టె గుణము వుంటుంది కానీ భాగస్వామి తో ఆధిపత్య ధోరణి వలన సమస్యలు తలెత్త వచ్చును.

సృజనాత్మకత వీరికి బాగా వుంటుంది వీరు చేసే పని లో ప్రతిబింబిస్తుంది. ఉన్నతమైన లక్షణము లు కలిగిన భాగస్వామిని కోరుకుంటారు. అందువలన సరి అయిన భాగ్య స్వామి కోసం వెతుకుతూ వివాహము ఆలస్యం అయ్యే అవకాశము వున్నది.

Must Read: మిథున రాశి Mithuna Raasi Characteristics, Personality, Strength & Weakness

Simha Raasi Strength

 సింహా రాశి లో జన్మించిన వారి బలము

  • నాయకత్వ లక్షణాలు
  • బాధ్యత తీసుకొనుట
  • వ్యవహార దక్షత (Administration skills)

Simha Raasi Weakness

సింహా రాశి లో జన్మించిన వారి బలహీనత

  • Ego
  • అసహనం
  • బద్దకం

Simha  Raasi Luck & Favorable

సింహా రాశి లో జన్మించిన వారి అదృష్ట మరియు అనుకూల అంశములు

అదృష్ట రంగుతెలుపు, కాషాయము
అదృష్ట రత్నంకెంపు
అదృష్ట వారముఆది వారము
అదృష్ట సంఖ్య1
అనుకూల రాశి (compatible sign)ధనస్సు, కుంభము
బీజ మంత్రంॐ क्लीं ब्रह्मणे जगदाधाराय नमः ।।

Simha Raasi Education

సింహా రాశి – విద్య

 రాజనీతి శాస్త్రము, ఎంబిఏ, B. Ed, కెమిస్ట్రీ, జియోగ్రఫీ, సివిక్స్, లిటరేచర్, హిస్టరీ, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్

Simha Raasi Profession, Job, Business

 సింహా రాశి – వృత్తి, ఉద్యోగ, వ్యాపారములు

రాజకీయములు, ప్రభుత్వ వృత్తులు, రియల్ ఎస్టేట్, సివీల్స్ సర్విస్, పోలీస్, పురాతత్వ శాస్త్రము, forest, ట్రస్ట్ మరియు organization.

Simha Raasi Health

సింహా రాశి – ఆరోగ్యము

అజీర్తి, ఉదర సంభందిత సమస్యలు, పిత్త దోషము, హృదయం, fertility, జుట్టు

వీటికి సంభందించిన వ్యాధులు వచ్చు అవకాశము వున్నది.

Simha Raasi Remedies

 సింహా రాశి – పరిహారములు

లక్ష్మీ నారాయణుడిని ఆరాధన చేయటము వలన ధన సమస్యలు తొలుగును, బుధవారము జంతువులకు ఆహారము వేయవలెను, పేద వారికి అన్న దానము చేయండి. పెద్దలను, గురువులను గౌరవించండి. రాగి,  నారింజ రంగు దగ్గర ఉంచుకోవలెను. గోధుమలు, వస్త్రములు దానము గా ఇవ్వవలెను. ప్రతి రోజు సూర్యునికి అర్ఘ్యము యిచ్చుట ఆదిత్య హృదయము చేయటము మంచిది.  మహాగణపతిని ఆరాధన చేయుట వలన సంతాన సమస్యలు తొలగును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *