Shravana Nakshatra (శ్రవణ నక్షత్రం)

Shravana Nakshatra: శ్రవణ నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Shravana Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.

Shravana Nakshatra Details

నక్షత్రముశ్రవణ
అధిదేవత విష్ణు
తారల సంఖ్య 3
గుర్తు 3 అడుగులు
గ్రహం చంద్ర
పురుషార్థ అర్థ
యోని (Gender)పురుష
గణ దేవ
వర్ణ మ్లేచ్చుడు
ఎలిమెంట్ వాయు
త్రిమూర్తి బ్రహ్మ
త్రి దోష కఫం
రంగు నీలం (light blue)
దిక్కు ఉత్తరం
గోత్రం వశిష్ట
గుణము సత్వ గుణం
శరీర భాగము మర్మ భాగం , చెవి
జంతువు కోతి
పక్షి కొంగ
చెట్టు జిల్లేడు
మొదటి అక్షరం జూ,జే,జో,ఘా

Shravana Nakshatra Characteristics

శ్రవణ నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:

ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించినవారి జీవితం చంద్ర మహాదశలో ప్రారంభమవుతుంది. ఈ దశ 10 సంవత్సరం లు. అనంతరం కుజ మహాదశ 7 సంవత్సరాలు. ఈ శ్రవణ నక్షత్రంలో ఫుట్టినవాళ్ళు చిత్రమాల్య సుగంధప్రియులు, స్థూలకాయులు. సుభగులు. పరస్త్రీ లాలసులు. బంధువులకీ – ఆ శ్రితులకీ ప్రియం కలిగించేవాళ్ళు. ఉదారగుణం కలవాళ్ళు. వాగుడుకాయలు, భోగవంతులు. విదేశయాన నిమగ్నులు. వివేకవంతులు. చపలురు.

Shravana Nakshatra Personality

శ్రవణ నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:

శ్రవణ నక్షత్రం 1 వ పాదం – ప్రథనుపాదం కుజుడిది. మంగళాంశ. గుల్మరోగులు. కలహటప్రియులు. పుత్రసంతానం లేనివాళ్ళూ అవుతారు

శ్రవణ నక్షత్రం 2 వ పాదం – ద్వితీయపాదం శుక్రుడిది. భోక్తాంశ – అనేకనుంది సేవకులు కలవాళ్ళూ. తంత్ర విద్యావేత్తలు. కాముకులూ అవుతారు.

శ్రవణ నక్షత్రం 3 వ పాదం – తృతీయపాదం బుధుడిది. ఈ జాతకులు అత్యంత ఉదారస్వభావులు. చిత్రలేఖకులు. కలహప్రియులుగా ఉంటారు.
శ్రవణ నక్షత్రం 4 వ పాదం – నాలుగవ పాదం చంద్రుడిది – వీరు పశువుల్ని అమ్మడం లో నిపుణులు, ధార్మికులు, యోగులు

Shravana Nakshatra Strength

శ్రవణ నక్షత్ర జాతకుల బలాలు:

  • మేధావులు
  • ఆకర్షణ

Shravana Nakshatra Weakness

శ్రవణ నక్షత్ర జాతకుల బలహీనతలు:

  • చపలచిత్తులు

Shravana Nakshatra Favorable & Unfavorable

  • అనుకూలము – కొత్త వెంచర్లు ప్రారంభించడం, కౌన్సిలింగ్, వినడం, ప్రయాణం, ఆస్తిని కొనుగోలు చేయడం, వైద్య చికిత్స, సామాజికీకరించడం, నేర్చుకోవడం, భాషలు చదవడం మరియు రాయడం, సంగీతం, తత్వశాస్త్రం, ధ్యానం, మతపరమైన కార్యకలాపాలు, రాజకీయాలు, మానవతా కార్యకలాపాలు
  • అననుకూలము – దురాక్రమణ, వ్యాజ్యాలు, యుద్ధాలు లేదా యుద్ధాలు, రిస్క్ లు తీసుకోవడం, వాగ్దానాలు చేయడం, ప్రమాణాలు తీసుకోవడం, యాక్టివిటీని పూర్తి చేయడం, డబ్బు అప్పు ఇవ్వడం, వివాహం, దత్తత తీసుకోవడం
  • ఈ నక్షత్రంలో 10 వ ఘటిక తర్వాత విషనాడీ

శ్రవణ నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు

Nakshatram Shravana
తిథి పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశి
వారాలు సోమ, గురు, శని వారములు
సంవత్సరము 23, 27, 32, 37, 41, 47, 50
నక్షత్రాలు ఉత్తరా
సంఖ్య 2
రంగు తెలుపు
రత్నం ముత్యం
రుద్రాక్ష 2,7 ముఖి
లోహం వెండి
దిక్కు ఉత్తరం
దైవము విష్ణువు

Shravana Nakshatra – Education

శ్రవణ నక్షత్రం – విద్య:

.ఎమ్.బి.బి.ఎస్. మెడిసిన్/సర్జరీ/అనస్థీషియా/ఛాతీ వ్యాధి, బి.ఎడ్, M.Tech, కెమికల్ఇంజనీరింగ్, బి.బి.ఎ.

Shravana Nakshatra – Profession, Job, Business

శ్రవణ నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:

మంత్రి, రాజులు, మత్స్యకారులు, ప్లంబర్, గని ఉత్పత్తులు, బావులు, కందకాలు, త్రవ్వకం, వ్యవసాయదారులు, డ్రైవర్లు, రాత్రి సేవ చేసే వారు, భూగర్భం, జలాంతర్గామి, ముత్యాలు.

Shravana Nakshatra Health

శ్రవణ నక్షత్రం – ఆరోగ్యము:

చర్మవ్యాధి, కుష్టు వ్యాధి, చీము ఏర్పడటం, క్షయవ్యాధి, కీళ్లనొప్పులు, బొబ్బలు, ఫైలేరియల్, పేలవమైన జీర్ణక్రియ.

Shravana Nakshatra Remedies

శ్రవణ నక్షత్రం – శాంతి పూజ విధులు:

శ్రవణ నక్షత్రం 4 పాదములు దోషము లేదు.

శంకచక్ర పద్మాలను ధరించి. ఒకచేత అభయముద్రని వహించి, గరుడ వాహనారూఢుడైన చతుర్భుజ విష్ణువును కృష్ణలోహంతో ప్రతిమగామలచి. కుంకుమకస్తూరీ గంధం. ఎరుపువస్త్రం. తులసీదళాలు దశాంగ గుగ్గులుధూపాలతో ఇదం విష్ణుః అనే మంత్రయుక్తంగా షోడశోపచార విధిని ఆరాధించి. శాలి అన్నాన్ని నైవేద్యంచేయాలి. అనంతరం గాయత్ర్యా స్టోత్తరంతో రావిసమిధల్నీ బియ్యాన్నీ నేతితోకలిపి హోమంచేయాలి. గంధమాల్యాలనీ క్షీరాన్నాన్నీ ఉత్తరదిక్కులో బలి చేయాలి

Shravana Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka

శ్రవణ నక్షత్ర గాయత్రి మంత్రం:

ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే
పుణ్యశ్లోకాయ ధీమహి
తన్నో శ్రవణ ప్రచోదయాత్

శ్రవణ నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః ।
అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ ॥ 85 ॥

శ్రవణ నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

సువర్ణబిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః ।
మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥

శ్రవణ నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

కుముదః కుందరః కుందః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాశోఽమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః ॥ 87 ॥

శ్రవణ నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

సులభః సువ్రతః సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధోఽదుంబరోఽశ్వత్థశ్చాణూరాంధ్ర నిషూదనః ॥ 88 ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *