Rohini Nakshatra (రోహిణి నక్షత్రం)

Rohini Nakshatra: రోహిణి నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Rohini Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.

Rohini Nakshatra Details

నక్షత్రముRohini
అధిదేవత బ్రహ్మ
తారల సంఖ్య 5
గుర్తు రథం
గ్రహం చంద్ర
పురుషార్థ మోక్ష
యోని (Gender)స్త్రీ
గణ మనుష్య
వర్ణ శూద్ర
ఎలిమెంట్ పృథ్వీ
త్రిమూర్తి బ్రహ్మ
త్రి దోష కఫము
రంగు తెలుపు
దిక్కు తూర్పు
గుణము సత్వ గుణం
శరీర భాగము నుదురు
జంతువు పాము
పక్షి గుడ్ల గూబ
చెట్టు నేరేడు
మొదటి అక్షరం వో, వా, వీ, వూ

Rohini Nakshatra Characteristics

రోహిణి నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:

ఈ రోహిణి నక్షత్రంలో జన్మించినవారి జీవితం చంద్ర మహాదశలో ప్రారంభమవుతుంది. ఈదశ 10 సం॥రలు. అనంతరం కుజ దశ 7 సంవత్సరాలు. ఈ రోహిణి నక్షత్రం లో జన్మించినవాళ్ళు చక్కటిస్వరూపం, సంభోగప్రియత్వం – తన్నిపుణత్వం, సామర్థ్యం ధనికత, నేత్రవ్యాధి, రవ్వంతపాదాంగ లోపం, కాస్తంత పాపవాంచి స్ఫుటమైన చిన్న నుదురుకల వాళ్ళూ అవుతారు.

Rohini Nakshatra Personality

రోహిణి నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:

రోహిణి నక్షత్రం 1 వ పాదం – ప్రథమపాదం కుజుడిది సేవాంశ చాపల్యం, రాగి రంగు వెంట్రుకలు, శౌర్యం, దూషికత్వం లక్షణాలు.

రోహిణి నక్షత్రం 2 వ పాదం – శుక్రుడిది భృత్యాంశ- పొడగరితనం, ఓటమిని యిసుమంతకూడా అంగీకరించలేనితనం, మంచిశీలం కలవాళ్ళవుతారు.

రోహిణి నక్షత్రం 3 వ పాదం – బుధుడిది – విద్యాంశ – పండితులూ, కవులూ, గణితశాస్త్రజ్ఞులు, లోక వ్యవహారజ్ఞానులూ, అవుతారు.
రోహిణి నక్షత్రం 4 వ పాదం – అత్యాశ – ఇతరుల ధనాన్ని అపహరించేవాళ్ళూ, తెలివైన వాళ్ళూ అవుతారు.

Rohini Nakshatra Strength

రోహిణి నక్షత్ర జాతకుల బలాలు:

  • ఆకర్షణ
  • సామర్థ్యం
  • తెలివి తేటలు

Rohini Nakshatra Weakness

రోహిణి నక్షత్ర జాతకుల బలహీనతలు:

  • పాప వాంఛ
  • అత్యాశ

Rohini Nakshatra Favorable & Unfavorable

  • అనుకూలము – సీమంతం, పుంసవనం, నామకరణం, అన్నప్రాశనం, ఉపనయనం, వేదశాస్త్రాభ్యాసం, సమావర్తనం, వివాహం, తైలాభ్యంగనం నూతనభూషణధారణం, రాజ్యాభిషేకం, సింహాసనాధిరోహణం, అధికార స్వీకారం, పల్లకీ నెక్కడం, నగర – గ్రామ, దేవతా ప్రతిష్టలూ, ఇతరేతర సము వాస్తుకర్మలూ, యజ్ఞాలు, హోమాలు, దానాలు శాంతికృత్యాలు, పౌష్ఠి కర్మలూ, ధనధాన్యసేకరణకూ, చెఱువులూ, నూతులూ వగయిరాలు త్రవ్వించడానికీ ఈ తార అత్యంతోపయుక్తమవుతుంది
  • ఈ జాతకులు పుట్టిన పది ఘటికలపైన అపమృత్యు భయంవుంది. అది తప్పినా – మూడు- పది దినాలలో అపమృత్యువుంటుంది. వాటి నధిగమించితే తొమ్మిదవయేట వాతజ్వరభయం, పదిహేడవయేట నేత్రరోగం కలుగుతాయి. ఇరవయ్యేడవయేట మేహరోగం ప్రాప్తిస్తుంది. యాభయ్యవయేట జ్వరపీడ, డెబ్బయ్యవయేట అపమృత్యు భీతీ – ఆ గండాలు గడిస్తే – ఎనభై సంవత్సరాలపైన యోగాయుర్దాయం ఉంటుంది.

రోహిణి నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు

Nakshatram Rohini
తిథి విదియ, పంచమి, దశమి, త్రయోదశి
వారాలు గురు, సోమ వారములు
సంవత్సరము 20, 27, 30, 36, 40, 45
నక్షత్రంఉత్తరాషాడ
సంఖ్య 2
రంగు తెలుపు
రత్నం ముత్యం
రుద్రాక్ష ద్వి ముఖి
లోహం వెండి
దిక్కు తూర్పు
దైవము శివుడు

Rohini Nakshatra – Education

రోహిణి నక్షత్రం – విద్య: ఫార్మసీ, డాక్టర్-ఐ, డెంటల్.వెటర్నరీ, జియాలజీ, వాటర్ వర్క్స్. డెర్మటాలజిస్ట్, క్రిమినల్ లా, ఇంటీరియర్ డెకరేటర్, క్యాటరింగ్

Rohini Nakshatra – Profession, Job, Business

రోహిణి నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు: బేకరీలు, బార్, నూనెలు, పాలు, ఐస్ క్రీం, సబ్బు, చందనం, రంగులు, రంగులు, వివాహ బ్రోకర్, దుస్తులు మరియు ముత్యాల వ్యాపారి, ద్రవాలు, ఆమ్లాలు, చక్కెర, కార్ట్ మెన్, ఆవులు.

Rohini Nakshatra Health

రోహిణి నక్షత్రం – ఆరోగ్యము: అపోప్లెక్సీ, రొమ్ము నొప్పి, వాపులు, గొంతు-నొప్పి, జలుబు, దగ్గు, గాయిటర్, కాళ్ల-పాదాల నొప్పి, క్రమరహిత రుతుక్రమం.

Rohini Nakshatra Remedies

రోహిణి నక్షత్రం – శాంతి పూజ విధులు:

4 చేతులూ, ఆ హస్తాలలో అక్షసూత్ర కమండువులూ కలిగి, హంసవాహనంపై అలరారుతూ, కృష్ణవర్గీయుడైన బ్రహ్మను ప్రతిమలోకి ఆవాహనం చేయాలి.
‘నమో బ్రహ్మః’ అనే మంత్రాద్యంగా షోడశోపచారాలతోనూ పూజించాలి. పూజలో నీలిరంగు వస్త్రాలనీ, కస్తూరీ గంధాలనీ, తామర లేదా – కలువ – పువ్వుల్నీ, సర్జక ధూపాన్నీ వినియోగించాలి. క్షీరానాన్ని నివేదించాలి. గాయత్రీ అష్టోత్తర శత సమేతంగా నవధాన్యాలతోనూ హోమం చేయాలి. గంధమూల్యాదులూ, క్షీరోదనాన్ని ఉత్తరదిశగా బలికుంచాలి. తద్వారా – ‘అస్వస్థులు’ తొమ్మిది రోజులలో కోలుకుంటారు.

Rohini Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka

రోహిణి నక్షత్ర గాయత్రి మంత్రం:

ఓం ప్రజావిరుధ్ధై చ విద్మహే
విశ్వరూపాయై ధీమహి
తన్నో రోహిణి ప్రచోదయాత్

రోహిణి నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః ।
అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః ॥ 13 ॥

రోహిణి నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

సర్వగః సర్వ విద్భానుర్విష్వక్సేనో జనార్దనః ।
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ 14 ॥

రోహిణి నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః ।
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః ॥ 15 ॥

రోహిణి నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః ।
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ 16 ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *