Revati Nakshatra: రేవతి నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Revati Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.
Table of Contents
Revati Nakshatra Details
నక్షత్రము | రేవతి |
---|---|
అధిదేవత | పూషన్ |
తారల సంఖ్య | 3 |
గుర్తు | చేప |
గ్రహం | బుద |
పురుషార్థ | మోక్ష |
యోని (Gender) | స్త్రీ |
గణ | దేవ |
వర్ణ | శూద్ర |
ఎలిమెంట్ | ఆకాశ |
త్రిమూర్తి | శివ |
త్రి దోష | కఫం |
రంగు | గోదుమ |
దిక్కు | తూర్పు |
గోత్రం | క్రతు |
గుణము | సత్వ గుణం |
శరీర భాగము | చీలమండలు |
జంతువు | ఏనుగు |
పక్షి | నెమలి |
చెట్టు | విప్ప |
మొదటి అక్షరం | దే,దో, చా,చి |
Revati Nakshatra Characteristics
రేవతి నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:
ఈ రేవతి నక్షత్రంలో జన్మించినవారి జీవితం బుద మహాదశలో ప్రారంభమవుతుంది. ఈ దశ 17 సంవత్సరం లు. అనంతరం కేతు మహాదశ 7 సంవత్సరాలు. ఈ రేవతి నక్షత్రంలో ఫుట్టినవాళ్ళు స్థూలకాయులు. భాగ్యవంతులు. చక్కటి రూపసౌందర్యం కలవాళ్ళూ. భోగులూ. యాచకులకు ప్రియం చేసేవాళ్ళూ. పండితులు. అన్నదాతలు. ఇతరుల కార్యాలు నెరవేర్చడంలో నిమగ్నమయివుండేవాళ్ళు. పరదేశవాసులు. వీళ్ళ తేజస్సు ఇతరులకు భయం కలిగిస్తుంది. ఇంత ఉత్తమ లక్షనాలున్న కూడా జాతకులు ఎడతెగని చింతతో మునిగివుంటారు.
Revati Nakshatra Personality
రేవతి నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:
రేవతి నక్షత్రం 1 వ పాదం – ప్రథమపాదం గురువుది. ఉత్పన్నాంశ, ఈవేళాసంజాతులు శాస్త్రవేత్తలు. తాత్వికులు నీతిమంతులూ అవుతారు.
రేవతి నక్షత్రం 2 వ పాదం – ద్వితీయపాదం శనిది పాపాంశ పాపకర్మలు చేసే వారూ, జూదగాళ్లు, కుటిలబుద్ది
రేవతి నక్షత్రం 3 వ పాదం – మూడో పాదం శనిది ఉగ్రంశ సౌన్దర్యవంతులు, మందబుద్దులు, కోపిస్టులు
రేవతి నక్షత్రం 4 వ పాదం – నాలుగోపాదం గురుడిది శోభనంశ దైవకార్యాలు, వేదాలు చదవటం, పండితులు
Revati Nakshatra Strength
రేవతి నక్షత్ర జాతకుల బలాలు:
- మేధావులు
- ధైర్యవంతులు.
Revati Nakshatra Weakness
రేవతి నక్షత్ర జాతకుల బలహీనతలు:
- అసూయ
Revati Nakshatra Favorable & Unfavorable
- అనుకూలము – దీక్షలు, వివాహం, లైంగికత, వస్తువుల లావాదేవీలు మరియు వ్యాపారం, సంగీతం, కళ, క్షుద్ర, ఆధ్యాత్మికత, వైద్యం, విశ్రాంతి చర్యలు మరియు తోటపని, తీర్మానాలు, వ్యాపారం లేదా ఆర్థిక విషయాలు, వస్తువులు, సంగీతం, నాటకం మరియు సృజనాత్మక కార్యకలాపాలు, దాతృత్వం, ఆధ్యాత్మిక లేదా క్షుద్ర బోధనలు అధ్యయనం, రోగాలను నయం చేయడం మరియు చికిత్స చేయడం, విశ్రాంతి మరియు విశ్రాంతి కోసం కార్యకలాపాలు, ముగింపు లేదా పూర్తి చేయడం
- అననుకూలము – తీవ్రమైన వ్యూహాలు లేదా సాహసోపేతమైన చర్య అవసరమైన కార్యకలాపాలు, అడ్డంకులను అధిగమించడం, శత్రుత్వం, విపత్తులు, పదునైన చర్యలు, శస్త్రచికిత్స, శారీరకంగా కఠినమైన కార్యకలాపాలు, రేవతి యొక్క చివరి రెండు పదాలు ఒక కొత్త కార్యకలాపాన్ని ప్రారంభించడానికి మద్దతు ఇవ్వవు.
- ఈ నక్షత్రంలో 30 వ ఘటిక తర్వాత విషనాడీ
రేవతి నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు
Nakshatram | Revati |
---|---|
తిథి | పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశి |
వారాలు | బుద, గురు, శుక్ర, శని వారములు |
సంవత్సరము | 16, 23, 30, 36, 42, 44, 48, 53 |
నక్షత్రాలు | అనురాధ |
సంఖ్య | 5 |
రంగు | పచ్చ |
రత్నం | పచ్చ |
రుద్రాక్ష | 5,7 ముఖి |
లోహం | వెండి |
దిక్కు | ఈశాన్యం |
దైవము | శివుడు |
Revati Nakshatra – Education
రేవతి నక్షత్రం – విద్య:
ఇంజినీరింగ్- ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్/కెమికల్/పాలిమర్/సివిల్,ఆర్కిటెక్చర్, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్, లెదర్ & ప్రింటింగ్ టెక్నాలజీ, డాక్టర్ ఆఫ్ మెడిసిన్.
Revati Nakshatra – Profession, Job, Business
రేవతి నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:
ఎడిటర్, పబ్లిషర్, లాయర్, జడ్జి, ఆడిటర్, పరిశ్రమ, వేలిముద్ర నిపుణుడు, షేర్ బ్రోకర్, దౌత్యవేత్త, జ్యోతిష్కుడు, పురోహితులు, గవర్నర్, గుమాస్తా, ఎక్సైజ్, అకౌంటెంట్, విజయవంతమైన దౌత్యవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, ఏజెంట్, బ్యాంకు.
Revati Nakshatra Health
రేవతి నక్షత్రం – ఆరోగ్యము:
పేగుల్లో అల్సర్, పాదాల్లో గౌట్, చెవిటితనం, ఇయర్పస్, తిమ్మిరి, పాదాల వైకల్యాలు, లాసిట్యూడ్, నెఫ్రిటిస్, పొత్తికడుపు రుగ్మతలు.
Revati Nakshatra Remedies
రేవతి నక్షత్రం – శాంతి పూజ విధులు:
రేవతి నక్షత్రం 4 వ పాదము దోషము కలదు.
పద్మాసన, పూషనామక సూర్య దేవ విగ్రహాన్ని బంగారం తో చెక్కించాలీ, రెండుచేతులలో, ఒక చేతిలో పద్మపుష్పం, మరోచేతిలో అభయముద్ర ధరించి వుండాలి, అ ప్రతిమను రక్త ( ఎర్రని) వస్త్ర, గంధాలతో నూ, జిల్లేడు పువ్వులతో గుగ్గలధూపంతో షోడశోపచారాలూ గావించాలి, నువ్వుల అన్నం నివేదించాలి. పూజానంతరం తరగబడని ఫలాలతోనూ. జువ్వి, మేడి యిత్యాది సమిధలతోనూ, నేతితోనూ హోమం చేయాలి
Revati Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka
రేవతి నక్షత్ర గాయత్రి మంత్రం:
ఓం విశ్వరూపాయ విద్మహే
పూష్ణ దేహాయ ధీమహి
తన్నో రేవతి: ప్రచోదయాత్
రేవతి నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః ।
యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్యమన్నమన్నాద ఏవ చ ॥ 105 ॥
రేవతి నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః ।
దేవకీనందనః స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥
రేవతి నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
శంఖభృన్నందకీ చక్రీ శారంగధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః ॥ 107 ॥
రేవతి నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి ।
వనమాలీ గదీ శారంగీ శంఖీ చక్రీ చ నందకీ ।
శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోఽభిరక్షతు ॥ 108 ॥
ఆర్థిక సమస్యలు ఎప్పటికి తీరతాయాండి , ఇల్లు ఎప్పుడొస్తుంది
8500851185 whatsapp నెంబర్ ను contact చేసి appointment తీసుకోండి, మీ వ్యక్తిగత జాతక చక్రము పరిశీలించి సమాధానము చెప్పగలము.