Purva Ashadha Nakshatra: పూర్వషాఢ నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Purva Ashadha Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.
Table of Contents
Purva Ashadha Nakshatra Details
నక్షత్రము | పూర్వషాఢ |
---|---|
అధిదేవత | ఆపః |
తారల సంఖ్య | 2 |
గుర్తు | బుట్ట |
గ్రహం | శుక్ర |
పురుషార్థ | మోక్ష |
యోని (Gender) | స్త్రీ |
గణ | మనుష్య |
వర్ణ | బ్రాహ్మిన్ |
ఎలిమెంట్ | వాయు |
త్రిమూర్తి | విష్ణు |
త్రి దోష | పిత్తం |
రంగు | నలుపు |
దిక్కు | తూర్పు |
గోత్రం | పులహ |
గుణము | సత్వ గుణం |
శరీర భాగము | వెనక |
జంతువు | కోతి |
పక్షి | చిలుక |
చెట్టు | అశోక, చింత |
మొదటి అక్షరం | బూ, ధా, భా, డా |
Purva Ashadha Nakshatra Characteristics
పూర్వషాఢ నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:
ఈ పూర్వషాఢ నక్షత్రంలో జన్మించినవారి జీవితం శుక్ర మహాదశలో ప్రారంభమవుతుంది. ఈ దశ 20 సంవత్సరం లు. అనంతరం సూర్య మహాదశ 6 సంవత్సరాలు. ఈ పూర్వషాఢ నక్షత్రంలో రవంత పొడగరులై వుంటారు. చిన్నచిన్న వేళ్ళువుంచాయి. ఏ పనిపడితే ఆ పని చేసేవాళ్ళూ, బుద్దిమంతులు. ఏ విషయాన్నయినా ఇట్టే తెలుసుకోగలవాళ్ళు, ప్రతిస్టావంతులుగా ఉంటారు.
Purva Ashadha Nakshatra Personality
పూర్వషాఢ నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:
పూర్వషాఢ నక్షత్రం 1 వ పాదం – ప్రథమపాదం . ఉత్పన్నాంశ. ఈ వేళాసంజాతు ఎర్రని నేత్రాలు కలిగివుంటారు. అమిత శూరత్వం కలిగివుంటారు. సుఖం తక్కువ
పూర్వషాఢ నక్షత్రం 2 వ పాదం – బుధుడిది. అభయాంశ. ఈ జాతకులకు పెద్ద ఉదరం వుంటుంది. వాగుడుకాయలుగా వుంటారు. అయినా మృదువుగా మాట్లాడతారు. అవతలివాళ్ళలోని గుణాలను తెలుసుకోగలుగుతారు
పూర్వషాఢ నక్షత్రం 3 వ పాదం – తృతీయ పాదం శుక్రుడిది, భాగ్యాంశ, వీళ్ళు నిత్యం సూచి గా వుంటారు, దయాహృదయలు, భాగ్యవంతులు, చపలచిత్తులు,
పూర్వషాఢ నక్షత్రం 4 వ పాదం – చతుర్ధపాదం కుజుడిది, పండిత ద్వేషం. ఉగ్రస్వభావం. పాప కార్యాసక్తత, అబద్దాలాడడం వీళ్ళ స్వభానంగ ఉంటుంది,
Purva Ashadha Nakshatra Strength
పూర్వషాఢ నక్షత్ర జాతకుల బలాలు:
- మేధావులు
Purva Ashadha Nakshatra Weakness
పూర్వషాఢ నక్షత్ర జాతకుల బలహీనతలు:
- బద్దకం
Purva Ashadha Nakshatra Favorable & Unfavorable
- అనుకూలము – ధైర్యవ౦తమైన పరిస్థితులు, అప్పులు తీర్చడ౦, ప్రకటన చేయడ౦, ప్రేరణ, ప్రేరేపి౦చడ౦, యుద్ధ౦ చేయడ౦, ఘర్షణ, పునరుజ్జీవన౦, స్వస్థత, జల స్థలాలను స౦దర్శి౦చడ౦, సాహస౦, ఆధ్యాత్మికత, గుర్రపు చర్యలు, కళ, ప్రాచీన స్థలాలు, వివాహ౦, లైంగికత, నమ్మక౦, నీటి కార్యకలాపాలు, స్త్రీ దేవతలను ఆరాధి౦చడ౦
- అననుకూలము – లౌక్యం మరియు దౌత్యం అవసరం, ప్రశాంతమైన ప్రతిబింబం, వాగ్ధానం, పనులు పూర్తి చేయడం, ల్యాండ్ జర్నీలు
- ఈ నక్షత్రంలో 24 వ ఘటిక తర్వాత విషనాడీ
పూర్వషాఢ నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు
Nakshatram | Purva Ashadha |
---|---|
తిథి | పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశి |
వారాలు | బుద, గురు, శుక్ర, శని వారములు |
సంవత్సరము | 16, 23, 30, 33, 42, 44, 48, 51 |
నక్షత్రాలు | రేవతి |
సంఖ్య | 6 |
రంగు | తెలుపు |
రత్నం | వజ్రం |
రుద్రాక్ష | 1,5 ముఖాలు |
లోహం | వెండి |
దిక్కు | తూర్పు |
దైవము | శివుడు |
Purva Ashadha Nakshatra – Education
పూర్వషాఢ నక్షత్రం – విద్య:
బి.ఎ. M.Sc, సి.ఎ. గణితం, టెలికాం, జవళి.
Purva Ashadha Nakshatra – Profession, Job, Business
పూర్వషాఢ నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:
బ్యాంకర్, క్యాషియర్, అకౌంటెంట్, డైరెక్టర్, రెవిన్యూ మరియు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఫారిన్ ట్రేడ్, ఎక్స్ఛేంజ్, రెస్టారెంట్లు, హాస్టళ్లు, మహిళలు మరియు పిల్లల ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రం.
Purva Ashadha Nakshatra Health
పూర్వషాఢ నక్షత్రం – ఆరోగ్యము:
సయాటికా, డయాబెటిస్, కీళ్లనొప్పులు, హిప్ గౌట్, శ్వాసకోశ వ్యాధి, ఊపిరితిత్తుల క్యాన్సర్, పురిటి నొప్పులు, సర్ఫిట్ కోల్డ్.
Purva Ashadha Nakshatra Remedies
పూర్వషాఢ నక్షత్రం – శాంతి పూజ విధులు:
పూర్వషాఢ నక్షత్రం 1,2,4 పాదములు దోషము కలదు.
తెలుపురంగు కలిగి. రెండు చేతులు కలిగి. ఒకచేత అంకుశాన్ని ధరించి మొసలి వాహనాన్ని అధిరోహీంచిన ఆపోదేవతా ప్రతిమ బంగారంతో చేయించి తెలుపురంగు వస్త్రం. (శ్రీగంధం. కలువపువ్వు, ధూపాన్ని ‘వినియోగించి “యత్కించిద్వరుణి మంత్రాదిగా షోడశోపచార పూజలు చేయాలి. క్షీరాన్నం నివేదించాలి. పూజానంతరం గాయత్రాస్టోతరయుతంగా. ఎరుపు రంగులో వుండే బియ్యం నేతితో హోమం చేయాలి.
Purva Ashadha Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka
పూర్వషాఢ నక్షత్ర గాయత్రి మంత్రం:
ఓం సముద్ర కామాయై విద్మహే
మహాబీజితాయై ధిమహితన్నో
పూర్వాషాఢా ప్రచోదయాత్
పూర్వషాఢ నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః ॥ 77 ॥
పూర్వషాఢ నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
ఏకో నైకః సవః కః కిం యత్తత్ పదమనుత్తమమ్ ।
లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥
పూర్వషాఢ నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ ।
వీరహా విషమః శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥
పూర్వషాఢ నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।
సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః ॥ 80 ॥