మిథున రాశి లక్షణాలు, వ్యక్తిత్వం, బలం & బలహీనత: మిథున రాశి Mithuna Raasi జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము, అదృష్ట విషయములు మరియు ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Mesha Raasi (Gemini Sign) Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.
Table of Contents
Mithuna Raasi (Gemini Sign) Details
రాశి సంఖ్య | 3, బేసి రాశి |
రాశి | మిథున రాశి |
అధిపతి | బుధుడు |
నక్షత్రములు | మృగశిర 3,4, ఆరుద్ర 1,2,3,4 పునర్వసు 1,2,3 |
గుర్తు | కవలలు |
సూర్య గ్రహ సంచారం | మే 21 – జూన్ 20 |
తత్వము (element) | వాయువు |
పురుషార్దము | కామము |
శరీర భాగము | చేతులు |
చర/స్తిర/ ద్విస్వభావ | ద్విస్వభావ రాశి |
లింగము | పురుష |
ఆయుర్వేద దోషము | మూడిటి మిశ్రమము (వాత,పిత్త,కఫ) |
గుణము | తమో |
దిశ | పశ్చిమము |
రంగు | పచ్చ |
పగలు / రాత్రి | రాత్రి |
ఉదయం (raising) | Seershodaya |
వర్ణం | శూద్ర (worker) |
Mithuna Raasi Characteristics
మిథున రాశి లో జన్మించిన వారి గుణగణాదులు:
ద్విస్వభావ ప్రవృత్తి, ఆకర్షణ, చక్కని మాట తీరు, presentation skills, సృజనాత్మకత, చక్కని ఊహాశక్తి, ఉత్సుకత, ఉల్లాసము.
Mithuna Raasi Personality
మిథున రాశి లో జన్మించిన వారి స్వభావము:
బుధుడు మిథున రాశి అధిపతి. వాయు తత్వరాసి ఇది వేగాన్ని సూచిస్తుంది. ద్విస్వభావ రాశి మరియు గుర్తు twins కవలలు కావున ప్రతి విషయము 2 కొణములలో ఆలోచించగలరు. ప్రతి విషయము లో మంచి చెడు ను చూడగలుగుతారు.
జాతకము లో గురువు బాలహీనము గా వుంటే నిర్ణయము తీసుకోటానికి చాలా సమయము పడుతుంది దాని వలన ఆలస్యము కూడా అయ్యే అవకాశము వున్నది.
రాశి చక్రము లో 3 వ రాశి ఆగుట వలన మరియు వాయు తత్వం కలిగి వుండుట వలన communication వీరు జీవితం లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. శుభ గ్రహమల ప్రభావం వుంటే మంచి మధుర భాషణ చేస్తారు. online technical విషయాలు ఇష్టపడతారు. marketing skills కలిగివుంటారు.
ఎదుటి వారిని సులభం గా అర్ధం చేసుకుంటారు. పని లేనపుడు బద్దకము గా వుంటారు కానీ పని వేగముగా చేస్తారు.
వీరి విషయాలను బయటకు తెలియ నివ్వరు. రాశి అధిపతి బుధుడు ఆగుట వలన చూడటానికి వయస్సు లో తమ వయస్సు కన్నా చిన్న వయస్సు వారి వలె కనిపిస్తారు.
తరుచూ ప్రయాణాలు చేయటానికి ఇష్టపడతారు. స్నేహితుల తో మంచిగా వుంటారు కానీ వీరి స్నేహితులు వీరిని చూసి అసూయ పడుతూ వుంటారు.
చదివిన చదువుకు పనికి సంభందము ఉండదు. వీరికి అయిదవ రాశి శుక్రుని రాశి ఆగుట చేత ప్రేమ వ్యవహారములు కూడా జీవితములో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
చక్కని ఊహాశక్తి, సృజనాత్మకత ఎక్కువ గా వుంటాయి. జ్ఞానం వున్న వారిని ఎక్కువ గా ఇష్ట పడతారు. పని లో అటువంటి భాగస్వామి కావాలని కోరుకుంటారు.
కానీ వివాహ భాగస్వామి విషయము లో వారిని అధిగమించాలి మరియి తమ అధినము లో వుంచాలి అని చూస్తారు. మూడవ వ్యక్తి కారణము గా వివాహము లో మనస్పర్ధలు వచ్చు అవకాశము వున్నది.
Also Read: కర్కాటక రాశి Karkataka Raasi Characteristics, Personality, Strength & Weakness
Mithuna Raasi Strength
మిథున రాశి లో జన్మించిన వారి బలము
- కమ్యూనికేషన్స్
- సృజనాత్మకత
- ఆకర్షణ
Mithuna Raasi Weakness
మిథున రాశి లో జన్మించిన వారి బలహీనత
- ద్విస్వభావం (dual)
- అసహనం
- Short cuts ని ఇష్టపడటం
Mithuna Raasi Luck & Favourable
మిథున రాశి లో జన్మించిన వారి అదృష్ట మరియు అనుకూల అంశములు
అదృష్ట రంగు | పచ్చ |
అదృష్ట రత్నం | పచ్చ |
అదృష్ట వారము | బుధ, శుక్ర |
అదృష్ట సంఖ్య | 5 |
అనుకూల రాశి (compatible sign) | తుల, ధనస్సు |
బీజ మంత్రం | ॐ श्रीं ऎं सौः | |
Mithuna Raasi Education
మిథున రాశి – విద్య
CA, అక్కౌంట్స్, న్యాయవాధి, ఎంబిఏ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, జర్నలిసం, గణితము.
Mithuna Raasi Profession, Job, Business
మిథున రాశి – వృత్తి, ఉద్యోగ, వ్యాపారములు
Tele communications, మార్కెటింగ్, law, న్యాయ వాధి వృత్తి, ఫ్యాషన్ డిజైన్, డిజైన్ వర్క్స్, ప్రింటింగ్, జర్నలిసం, విద్యా సంస్థల నిర్వహణ, అక్కౌంట్స్, ఫైనాన్స్, డ్రైవింగ్.
Mithuna Raasi Health
మిథున రాశి – ఆరోగ్యము
నిద్ర లేమి, ఆస్తమా, ఊపిరితిత్తులు, నాడీ మండలము, లివర్, arthritis సంభం దిత వ్యాధులు వచ్చు అవకాశము వున్నది.
Mithuna Raasi Remedies
మిథున రాశి – పరిహారములు
ఈ రాశి వారికి వేంకటేశ్వర స్వామి ఆరాధన ధన సమస్యలు రాకుండా చూచును. జంతువులకు, పక్షులకు ఆహారము ఇవ్వడము వలన మంచిది. వాటికి హాని కాలగచేయకూడదు. జంతు చర్మము తో చేసిన వస్తువులు వాడరాదు. పచ్చని రంగు వస్త్రము దగ్గర ఉంచుకొనవలెను. నదీ స్నానము మంచిది. పాలను దానము చేయవలెను. బుధ, శుక్ర వారములు విష్ణు సహస్రనామము చదవడము, దుర్గా దేవి ఆరాధన మంచి ఫలితములు ఇస్తాయి.