Kruthika Nakshatra: కృతిక నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. kruthika Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.
Table of Contents
Kruthika Nakshatra Details
నక్షత్రము | Kruthika |
అధిదేవత | అగ్ని |
తారల సంఖ్య | 6 |
గుర్తు | కత్తి |
గ్రహం | సూర్యుడు |
పురుషార్థ | కామ |
యోని (Gender) | పురుష |
గణ | రాక్షస |
వర్ణ | బ్రాహ్మణ |
ఎలిమెంట్ | పృథ్వీ |
త్రిమూర్తి | శివ |
త్రి దోష | కఫ |
రంగు | తెలుపు |
దిక్కు | ఉత్తరం |
గోత్రం | అంగీరస |
గుణము | రజో గుణం |
శరీర భాగము | తల |
జంతువు | ఆడ మేక |
పక్షి | నెమలి |
చెట్టు | ఔదుంబర |
మొదటి అక్షరం | ఆ, ఈ, ఊ, ఏ |
Kruthika Nakshatra Characteristics
కృతిక నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:
ఈ కృత్తిక నక్షత్రంలో జన్మించినవారి జీవితం సూర్య మహాదశలో ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు – ఈ తారాజాతకులు బుద్ధిమంతులు, తేజోవంతులు, కీర్తిమంతులు, అతి తిండిపోతులు, బంధుప్రియులూ, స్వయం కృషితో సంపాదించుకునే వాళ్ళు, పాపచింతాపరులుగా ఉంటారు. కంఠప్రాంతంలో మత్స్యాంశం ఉంటుంది.
Kruthika Nakshatra Personality
కృతిక నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:
కృతిక నక్షత్రం 1 వ పాదం – ఈ తార ప్రథమపాదం గురుడిది – ధనాంశ – ఈ వేళాసంజాతులు, ధనికులు, ప్రతాపవంతులు, నిపుణులుగా ఉంటారు.
కృతిక నక్షత్రం 2 వ పాదం – ద్వితీయపాదం శనిది- పాపాంశ – ఈ జాతకులు పాపకర్ములూ, వేశ్యాగృహాలలలో జీవించేవాళ్ళూగా ఉంటారు.
కృతిక నక్షత్రం 3 వ పాదం – తృతీయపాదం కూడా శనిదేకాని, ఉగ్రాంశ కావడంవలన
నైపుణ్యం వున్నప్పటికీ మందబుద్ధులుగా ఉంటారు. చెడుసావాసాలు చేస్తారు.
కృతిక నక్షత్రం 4 వ పాదం – చతుర్దపాదం గురువుది. ఉత్కృష్టాంశ – వీళ్ళు విద్యావినయసంపన్నులూ, ధార్మికులుగా ఉంటారు.
Kruthika Nakshatra Strength
కృతిక నక్షత్ర జాతకుల బలాలు:
- నైపుణ్యం కలవారు
- ధార్మికులు
Kruthika Nakshatra Weakness
కృతిక నక్షత్ర జాతకుల బలహీనతలు:
- చెడుసావాసం
- అతి తిండి
- తేలికగా తీసుకొను స్వబావము
Kruthika Nakshatra Favorable & Unfavorable
- ఈ తారలో షురకర్మ చేయించుకోకూడదు. విషప్రయోగ, ధాతువాద, లోహకర్మారంభాలకీ, పరద్రవ్యాపహరణకీ, అప్పులు తీర్చడానికీ, ధనధాన్యాలు సమకూర్చుకోవడానికీ, పశువిక్రయానికీ, అంజన సంగ్రహణానికీ, ముళ్ళ చెట్లు పాతడానికీ ఈ తార శ్రేయస్కరమైనది. ఈ తారలో ఎవరైనా మరణించినట్లయితే – ఆ ఇంటిని నాలుగు నెలలపాటు విడిచిపెట్టాలి.
- ఈ తారా జాతులకు జపనాదిగా – మూడు నెలలో మొదటి ఏడాది చలిజ్వరం, రెండవయేట సర్పగండం, 5-7-12 సంవత్సరాలలో వాతజ్వరభయం, ఆయుధభయం కలుగుతాయి. ఇరవయ్యొకటవయేట అపమృత్యుభయం దానిని అధిగమించితే 80 సంవత్సరాలు పరమాయువు.
కృతిక నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు
Nakshatram | Kruthika |
తిథి | పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి |
వారాలు | ఆది, సోమ, గురు వారములు |
సంవత్సరము | 16, 23, 30, 39, 43 |
సంఖ్య | 1,3,5,9 |
రంగు | తెలుపు |
రత్నం | కెంపు |
రుద్రాక్ష | ఏక ముఖి, పంచ ముఖి |
లోహం | బంగారం |
దిక్కు | ఉత్తరం |
దైవము | శివుడు, సూర్యుడు, కుమార స్వామి |
Kruthika Nakshatra – Education
కృతిక నక్షత్రం – విద్య:
బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, ENT, MBA, జర్నలిజం, సాహిత్యం, విదేశీ భాష, ప్రచురణ, సివిల్/కెమికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్.
Kruthika Nakshatra – Profession, Job, Business
కృతిక నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:
ప్రయాణాలు, పరిశ్రమలు, వైద్యం, శస్త్రచికిత్స, నౌకాదళం, భూముల సేకరణ, బాంబులు, క్రాకర్లు, అగ్గిపెట్టెలు, ఇనుము మరియు ఉక్కు పాత్రలు, యుద్ధ సామగ్రి, న్యాయమూర్తులు, సాంకేతిక వృత్తులు, బ్లాక్ స్మిత్‌లు, పోలీసు శాఖ
Kruthika Nakshatra Health
కృతిక నక్షత్రం – ఆరోగ్యము:
సెరిబ్రల్ మెనింజైటిస్, కార్బంకిల్, పదునైన జ్వరం, మలేరియా, ప్లేగు, చిన్న పెట్టె, కోతలు, గాయాలు, మెదడు జ్వరం, గాయం, ప్రమాదాలు, పేలుళ్లు, అగ్ని ప్రమాదం, మొటిమలు, ఎర్రటి కన్ను, గొంతు సమస్యలు, మెడ పైన వాపు
Kruthika Nakshatra Remedies
కృతిక నక్షత్రం – శాంతి పూజ విధులు: కృతిక నక్షత్ర 4 పదములకు సాదారణ దోషము.
మేకవాహనం, ఎరుపురంగు, నాలుగు చేతులు అందులో రెండు చేతులు వరాల్నిస్తున్నట్లుగా వున్న ప్రతిమ యందు అగ్నిని ఆవాహనం చేయాలి.
“అగ్నిన్నః పాతుకృత్తికా” ఇత్యాది మంత్రాలతో షోడశోప చారాలతో పూజచేయాలి – ఈ పూజలో ఎరటి వస్త్రం ఎర్రటి గంధం, కరవీరపుష్పం, నేతితో కూడిన గుగ్గుల ధూపం నేతితో కూడిన అన్నం నివేదించాలి. పూజానంతరం గాయత్రష్టోత్తర శతసహితంగా మధువు ఘృతం, ఆజ్యంకలవి – హోమం చేయాలి. ఆ హోమానంతరం గంధమాల్యాది దధ్యోన్నాదుల్ని ఆగ్నేయదిశగా బలి చేయాలి. ఈ విధంగా చేయడం వలన అరిష్టాలు శాంతించి, రోగులు అతిత్వరలోనే కోలుకుంటారు.
Kruthika Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka
కృతిక నక్షత్ర గాయత్రి మంత్రం:
ఓం కృష్ణవర్ణై విద్మహే
దండధరాయై ధిమహి
తన్నో భరణి: ప్రచోదయాత్
కృతిక నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమః క్రమః ।
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్॥ 9 ॥
కృతిక నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।
అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః ॥ 10 ॥
కృతిక నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః ।
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ 11 ॥
కృతిక నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితస్సమః ।
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ 12 ॥