కన్య రాశిలక్షణాలు, వ్యక్తిత్వం, బలం & బలహీనత: కన్య రాశి Kanya Raasi జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము, అదృష్ట విషయములు మరియు ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Raasi (Virgo Sign) Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.
Table of Contents
Kanya Raasi (Virgo Sign) Details
రాశి సంఖ్య | 6, సరి రాశి |
రాశి | కన్య |
అధిపతి | బుధుడు |
నక్షత్రములు | ఉత్తర 2,3,4, హస్త 1,2,3,4, చిత్త 1,2 |
గుర్తు | కన్య |
సూర్య గ్రహ సంచారం | ఆగస్టు 23 – సెప్టెంబర్ 22 |
తత్వము (element) | భూమి |
పురుషార్దము | అర్ధం |
శరీర భాగము | తుంటి భాగము (hip) |
చర/స్తిర/ ద్విస్వభావ | ద్విస్వభావ |
లింగము | స్త్రీ |
ఆయుర్వేద దోషము | వాతము |
గుణము | తమో |
దిశ | దక్షిణము |
రంగు | చిత్ర వర్ణము (mixed) |
పగలు / రాత్రి | పగలు |
ఉదయం (raising) | Seershodaya |
వర్ణం | వైశ్య |
Kanya Raasi Characteristics
కన్య రాశి లో జన్మించిన వారి గుణగణాదులు:
తెలివైన, పదునైన ఆలోచన, వక్త, శారీరక బలహీనత, విచక్షణ, యుక్తి,
Kanya Raasi Personality
కన్య రాశి లో జన్మించిన వారి స్వభావము:
ఈ రాశి కి అధిపతి బుధుడు. ఇది ఆరవ రాశి. బుధుడు ఇక్కడ ఉచ్చ పొందుతాడు మరియు మూల త్రికోణ రాశి.
ఈ రాశి వారు వ్యాపార లక్షణములు కలిగి వుంటారు. అన్నిటినీ త్వర గా అర్ధం చేసుకుంటారు.
ఖరీధయిన వస్తువులు, విలాసవంతమైన జీవితం కోరుకుంటారు మరియు వాటి కోసము కష్ట పడతారు. ఇంటి నుంచి దూరము గా స్తిర పడతారు.
వీరికి ఎవరైన నచ్చితే బాగా ప్రేమ గా చూసుకుంటారు. సహాయం చేసే గుణము వుంటుంది. కానీ వీరి సమస్యలను ఇతరులతో పంచుకోరు. గోడవలకు వెల్ల డానికి ఇష్ట పడరు.
పని పూర్తి చేయడము లో , పని కి సంభందించిన సమాచారము సేకరించడము లో వీరి సమర్ధులు, బుధుడు బలహీనము గా వుంటే జ్ఞాపక శక్తి తక్కువ గా వుంటుంది, అతిగా ఆలోచించి పనులు ఆలస్యము సమస్యలు తెచ్చుకుంటారు.
సాధారణము గా ఈ రాశి వారు బుధుడు లక్షణములు కలిగి మంచి మాట తీరు, వేగమైన ఆలోచనలు, మంచి జ్ఞాపకశక్తి, logical తార్కిక శక్తి కలిగి వుంటారు, గణితము పై మక్కువ వుంటుంది. మంచి వక్తలు గా కూడా రాణిస్తారు.
వాదనలలో మంచి తార్కిక అంశములతో ఇతరులను ఇబ్బంది పెట్ట గలరు. అవమానము ను భరించలేరు, అందువలన ప్రతి నిమిషము ఉన్నత స్తితికి రావాలని పని చేస్తారు.
వీటిని గమనించుటకు జాతక చక్రము లో ని గ్రహము బలము మరియు అమరిక చూడవలెను. వీరు నాయకులకు ఇష్టులు గా వుంటారు. కొన్ని సార్లు వీరి తెలివితేటల వలనే అహంకారము మరియు ఇతరులు సరిగా చేయుట లేదని అసహనము పొందుతారు.
Also Read: సింహా రాశి Simha Raasi Characteristics, Personality, Strength & Weakness
Kanya Raasi Strength
కన్య రాశి లో జన్మించిన వారి బలము
- యుక్తి
- విచక్షణ
- వ్యాపార దక్షత
Kanya Raasi Weakness
కన్య రాశి లో జన్మించిన వారి బలహీనత
- లోభము
- శారీరక బలహీనత
- వాయిదా వేయటము
Kanya Raasi Luck & Favourable
కన్య రాశి లో జన్మించిన వారి అదృష్ట మరియు అనుకూల అంశములు
అదృష్ట రంగు | చిత్ర వర్ణం |
అదృష్ట రత్నం | పచ్చ |
అదృష్ట వారము | శుక్ర , బుధ |
అదృష్ట సంఖ్య | 5 |
అనుకూల రాశి (compatible sign) | మకరము, మీనము, వృషభము |
బీజ మంత్రం | ॐ नमः पीं पीताम्बराय नमः ।। |
Kanya Raasi Education
కన్య రాశి – విద్య
న్యాయ సంభందిత విద్య, గణితం, జ్యోతిష్యం, విదేశీ బాషలు, ఎంబిఏ, జర్నలిసం, వైద్య విద్య
Kanya Raasi Profession, Job, Business
కన్య రాశి – వృత్తి, ఉద్యోగ, వ్యాపారములు
పరిశోధన, బిజినెస్, teaching, ఫార్మా, మెడికల్ షాప్, wholesale షాప్, ప్రింటింగ్, ఎడిటింగ్, law , డాక్యుమెంట్ writing, anchor
Kanya Raasi Health
కన్య రాశి – ఆరోగ్యము
చర్మ సంభందిత వ్యాధులు, ఉదరము, ప్రేగులు సంభందించిన వ్యాధులు, అల్సర్, dehydration, నాడీ, మానసిక మరియు ఇతరములు
Kanya Raasi Remedies
కన్య రాశి – పరిహారములు
బుధ వారము గణపతి ఆరాధన చేయటము వలన ధన సమస్యలు తొలుగును, కుండను దానము గా ఇవ్వండి, తెల్లని, పచ్చని రంగు దగ్గర ఉంచుకోవలెను. స్త్రీలను గౌరవించండి. పెసలు దానము గా ఇవ్వవలెను. పుణ్య నదీ స్నానము చేయడము మంచిది.