Hasta Nakshatra: హస్త నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Hasta Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.
Table of Contents
Hasta Nakshatra Details
నక్షత్రము | హస్త |
---|---|
అధిదేవత | సవితుర్ |
తారల సంఖ్య | 5 |
గుర్తు | అర చేయి |
గ్రహం | చంద్ర |
పురుషార్థ | ధర్మ |
యోని (Gender) | పురుష |
గణ | దేవ |
వర్ణ | వైశ్య |
ఎలిమెంట్ | పృథ్వీ |
త్రిమూర్తి | బ్రహ్మ |
త్రి దోష | వాతం |
రంగు | నలుపు |
దిక్కు | పశ్చియం |
గోత్రం | పులహ |
గుణము | సత్వ గుణం |
శరీర భాగము | వేళ్ళు |
జంతువు | గేద |
పక్షి | చిలుక |
చెట్టు | కుంకుడు |
మొదటి అక్షరం | పూ,షాం, ణా, ఢా |
Hasta Nakshatra Characteristics
హస్త నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:
ఈ హస్త నక్షత్రంలో జన్మించినవారి జీవితం చంద్ర మహాదశలో ప్రారంభమవుతుంది. ఈ దశ 10 సంవత్సరంలు. అనంతరం కుజ మహాదశ 7 సంవత్సరాలు. ఈ హస్త నక్షత్రంలో ఫుట్టినవాళ్ళు ఇతరులయందు రక్షకులుగా వ్యవహరించేవాళ్ళూ, ధనవంతులు, అధిక సంతాన వంతులు. యౌవ్వనంలో వున్న స్త్రీలను ఆనందింపచేసే వారూ సర్వదా రాజుమల్లే ప్రవర్తించేవాళ్ళూ, నిపుణులు, కీర్తి ప్రతిష్ఠలు గలవాళ్ళూ బ్రాహ్మణులనూ, గురువుల్నీ, పెద్దల్నీ గౌరవించే వాళ్ళుగా ఉంటారు. శరీరం మీద మత్స్యాంశాలు ఉంటాయి. అప్పుడప్పుడు భార్యకు విచారం కలిగిస్తూ ఉంటారు.
Hasta Nakshatra Personality
హస్త నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:
హస్త నక్షత్రం 1 వ పాదం – హస్త మొదటి పాదం కుజుడిది. క్రూరాంశ. ఈ వేళాసంజాతులు పాపకార్యాలు చేసేవాళ్ళూ, బలవంతులూ, పారమార్థిక చింతన కలవారూ అవుతారు.
హస్త నక్షత్రం 2 వ పాదం – రెండోపాదం శుక్రుడిది. ముక్తాంశ. ఈ జాతకులు నిత్యం మంచిమాటలనే మాట్లాడేవారూ, కాస్తంత మేదకులూ అవుతారు.
హస్త నక్షత్రం 3 వ పాదం – తృతీయపాదం బుధుడిది. పండితాంశ . వీళ్ళు చెడ్డ బుద్ధికలవారూ, కాముకులూ, అమ్మకం కొనుగోళ్ళు విషయాలలో మహానిపుణులుగా ఉంటారు.
హస్త నక్షత్రం 4 వ పాదం – చతుర్దపాదం చంద్రుడిది. ధనాంశ. వీళ్ళు రాచకార్యాలు చేయడంలో ఇష్టంగలవారు. సన్మానాలు పొందేవారూ, అభిమానవంతులు, రవంత కోషిష్టివారూ అవుతారు.
Hasta Nakshatra Strength
హస్త నక్షత్ర జాతకుల బలాలు:
- వర్తకులు
Hasta Nakshatra Weakness
హస్త నక్షత్ర జాతకుల బలహీనతలు:
- దొంగతనం చేయడం పట్ల మక్కువ
Hasta Nakshatra Favorable & Unfavorable
- అనుకూలము – సాధారణంగా అన్ని కార్యకలాపాలకు మంచిది, నవ్వులు పుట్టించే కార్యకలాపాలు, కుండలు, ఆభరణాల డిజైనింగ్, లింగ్విస్టిక్స్, హోలిస్టిక్ హీలింగ్ ప్రొసీజర్స్, మ్యాజిక్, హ్యాండ్స్ యొక్క నైపుణ్యాలు, పిల్లలతో వ్యవహరించడం, ఇళ్లు మార్చడం, క్రాఫ్ట్ లు, కుండలు, డొమెస్టిక్ వర్క్, గేమ్స్ ఆడటం
- అననుకూలము – దీర్ఘకాలిక లక్ష్యాలు మరియు లక్ష్యాలను ప్లాన్ చేయడం, లైంగిక చర్యలు, నిష్క్రియాత్మకత, విశ్రాంతి, కార్యనిర్వాహక పరిపక్వత, రాత్రి సమయ చట్టాలు
- ఈ నక్షత్రంలో 21 వ ఘటిక తర్వాత విషనాడీ
హస్త నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు
Nakshatram | Hasta |
---|---|
తిథి | పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశి |
వారాలు | సోమ, మంగళ, గురు, వారములు |
సంవత్సరము | 16, 25, 34, 42, 50 |
నక్షత్రాలు | ఉత్తరాషాడ |
సంఖ్య | 1,2,7 |
రంగు | తెలుపు |
రత్నం | ముత్యం |
రుద్రాక్ష | ద్వి ముఖి |
లోహం | వెండి |
దిక్కు | పశ్చిమం |
దైవము | సూర్యుడు |
Hasta Nakshatra – Education
హస్త నక్షత్రం – విద్య:
డిప్లొమా ఇన్ వెనెరాలజీ, న్యూరాలజీ, కుష్టు వ్యాధి, ఫోరెన్సిక్ మెడిసిన్, దంత శస్త్రచికిత్స, మైనింగ్ ఎంగ్. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్..
Hasta Nakshatra – Profession, Job, Business
హస్త నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:
ఓవర్సీస్, మెయిల్ ఆర్డర్ బిజినెస్, క్లియరింగ్ఏజెంట్, ఇంజనీరు, వంతెనలు, కాలువలు, ఆనకట్టలు, ఎగుమతి, దిగుమతి, రాజకీయ నాయకుడు, రాయబారి
Hasta Nakshatra Health
హస్త నక్షత్రం – ఆరోగ్యము:
గ్యాస్ ఏర్పడటం, విరేచనాలు, స్వల్ప శ్వాస, పురుగులు, హిస్టీరియా, టైఫాయిడ్, డయేరియా, కలరా, విరేచనాలు, భయం సంక్లిష్టత, చేతులు బలహీనంగా ఉండటం & భుజాలు, ప్రేగు రుగ్మతలు, అమీబిక్.
Hasta Nakshatra Remedies
హస్త నక్షత్రం – శాంతి పూజ విధులు:
హస్త నక్షత్రం 3 వ పాదము దోషము కలదు.
ఈ నక్షత్రంలో జన్మించిన వారు తామరపువ్వు రంగులో, రెండు చేతులు కలిగి, ఒక చేత పద్మాన్ని ధరించి, యేడు గుఱ్ఱాల్నిపూన్చిన రథంలో వున్న సవితాదేవత యొక్క బంగారు ప్రతిమను చెక్కించి, ప్రాణ ప్రతిష్ఠాన్యాసాధ్యాకళావాహనాదుల్నీ చేసి ‘జాతవేదసే’ అనే మంత్రయుతంగా ఎరుపు వస్త్రం, ఎరుపుగంధం, ఎరుపురంగు పువ్వులు దశాంగం గుగ్గులు ధూపాల నుపయోగిస్తూ
షోడశోపచార విధిగా పూజించాలి. అనంతరం గాయత్రాష్టోత్తరంతో అర్క (జిల్లేడు) సమిధల్ని నేతితో హోమం చేయాలి.
Hasta Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka
పుష్యమి నక్షత్ర గాయత్రి మంత్రం:
ఓం ప్రయచ్చతాయై
విద్మహే ప్రకృప్రణీతాయై ధీమహి
తన్నో హస్తా: ప్రచోదయాత్
పుష్యమి నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ ।
మనోహరో జితక్రోధో వీర బాహుర్విదారణః ॥ 49 ॥
పుష్యమి నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్। ।
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ 50 ॥
పుష్యమి నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్క్షరమక్షరం॥
అవిజ్ఞాతా సహస్త్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥
పుష్యమి నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూత మహేశ్వరః ।
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥