Dhanishta Nakshatra: ధనిష్ట నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Dhanishta Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.
Table of Contents
Dhanishta Nakshatra Details
నక్షత్రము | ధనిష్ట |
---|---|
అధిదేవత | అష్ట వశువులు |
తారల సంఖ్య | 3 |
గుర్తు | మద్దెలు |
గ్రహం | కుజ |
పురుషార్థ | ధర్మ |
యోని (Gender) | స్త్రీ |
గణ | రాక్షస |
వర్ణ | సేవక |
ఎలిమెంట్ | ఆకాశ |
త్రిమూర్తి | విష్ణు |
త్రి దోష | పిత్తం |
రంగు | వెండి |
దిక్కు | తూర్పు |
గోత్రం | అంగీరస |
గుణము | రజో గుణం |
శరీర భాగము | అధో |
జంతువు | సింహం |
పక్షి | నెమలి |
చెట్టు | జమ్మి |
మొదటి అక్షరం | గా,గీ,గూ,గే |
Dhanishta Nakshatra Characteristics
ధనిష్ట నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:
ఈ ధనిష్ట నక్షత్రంలో జన్మించినవారి జీవితం కుజ మహాదశలో ప్రారంభమవుతుంది. ఈ దశ 7 సంవత్సరం లు. అనంతరం రాహు మహాదశ 18 సంవత్సరాలు. ఈ ధనిష్ట నక్షత్రంలో ఫుట్టినవాళ్ళు తేజోవంతులు గుణవంతులు, ఉద్యోగవంతులు, దయాహీనులు, బ్రహ్మద్వేషులూ, వేడి శరీరతత్వం కలవాళ్ళూ, లోభులూ, పెద్దపెద్ద పాదాలు కలవాళ్ళు, స్థూల శరీరులుగా ఉంటారు.
Dhanishta Nakshatra Personality
ధనిష్ట నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:
ధనిష్ట నక్షత్రం 1 వ పాదం – ప్రథమపాదం రవిది.రాజాంశ..ఈ ‘ వేళాసంజాతులు స్థ్రూలకాయులుగా ఉంటారు.
ధనిష్ట నక్షత్రం 2 వ పాదం – ద్వితీయపాదం బుధుడిది. సౌమ్యాంశ. వినయం ఉట్టిపడేలా మాట్టాడతారు. విద్యావంతులవుతారు
ధనిష్ట నక్షత్రం 3 వ పాదం – మూడో పాదం శుక్రుడిది. అభయాంశ. గుణవంతులు. చిరాయుష్మంతులు. కాలవేత్తలుగా ఉంటారు,
ధనిష్ట నక్షత్రం 4 వ పాదం – నాలుగోపాదం కుజుడిది. (కూరాంశ. ఈ జాతకులు నిత్యం పాపకర్మలు చేయడంలో లీనమైవుంటారు
Dhanishta Nakshatra Strength
ధనిష్ట నక్షత్ర జాతకుల బలాలు:
- సమర్దయమ్
Dhanishta Nakshatra Weakness
ధనిష్ట నక్షత్ర జాతకుల బలహీనతలు:
- దయ లేని వాళ్ళు
Dhanishta Nakshatra Favorable & Unfavorable
- అనుకూలము – మతపరమైన ఆచారాలు, వేడుకలు, సమూహ పని, సంగీతం, నృత్యం, కచేరీలు, ఆడంబరాలు, కదిలే మరియు స్థిరాస్తులు, ప్రయాణం, చురుకైన విధానాలు, బట్టలు, మనీ లెండింగ్, జ్యువెలరీ డిజైనింగ్, వైద్యం, కీర్తి, హైటెక్ పరికరాలు, ప్రయాణం, సృజనాత్మక కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, ధ్యానం, యోగా, గార్డెనింగ్, వ్యాధుల చికిత్స
- అననుకూలము – వివాహం, లైంగికత, పాత అలవాట్లను విడిచిపెట్టడం, భాగస్వామ్యాలు, గృహ పని, నిర్బంధ ప్రవర్తన, కొత్త భాగస్వామ్యాలు, గృహ కార్యకలాపాలు, లౌక్యం అవసరమైన కార్యకలాపాలు, చాతుర్యం లేదా సున్నితత్వం
- ఈ నక్షత్రంలో 10 వ ఘటిక తర్వాత విషనాడీ
ధనిష్ట నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు
Nakshatram | Dhanishta |
---|---|
తిథి | పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశి |
వారాలు | ఆది, గురు, మంగళ వారములు |
సంవత్సరము | 18, 25, 30, 36, 45, 50, 54 |
నక్షత్రాలు | హస్త |
సంఖ్య | 1,9 |
రంగు | ఎరుపు |
రత్నం | పగడం |
రుద్రాక్ష | త్రి ముఖి |
లోహం | బంగారం |
దిక్కు | ఆగ్నేయం |
దైవము | శివుడు |
Dhanishta Nakshatra – Education
ధనిష్ట నక్షత్రం – విద్య:
బి.ఎ. బ్యాంక్ మేనేజ్ మెంట్, ఎమ్.బి.ఎ. సాహిత్యం, జవళి. హాస్పిటల్ మేనేజ్ మెంట్, నర్సింగ్
Dhanishta Nakshatra – Profession, Job, Business
ధనిష్ట నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:
హోమియోపతి, జైళ్ల శాఖ, గని మరియు గ్రౌండ్ ఇంజనీర్, బీమా, తత్వవేత్త, హంతకులు, వధశాల, కార్మికుడు డిపార్ట్ మెంట్, ఇండస్ట్రీ, టూల్స్, స్పేర్స్ పార్టులు.
Dhanishta Nakshatra Health
ధనిష్ట నక్షత్రం – ఆరోగ్యము:
మలేరియా, ఫైలేరియా, అధిక జ్వరం, బొబ్బలు, ఎలిఫెంటియాసిస్, పొడి దగ్గు, ఎక్కిళ్ళు, కాలు-గాయం, కుంటితనం, హెచ్.బి.పి, నిద్రలేమి, కార్డియాక్ థ్రోంబోసిస్, గుండె వైఫల్యం, మూర్ఛపోవడం, రక్తం వేడెక్కడం.
Dhanishta Nakshatra Remedies
ధనిష్ట నక్షత్రం – శాంతి పూజ విధులు:
ధనిష్ట నక్షత్రం 4 పాదములు దోషము లేదు.
శ్వేతవర్ణం. చతుర్చుజం. లాంగూల పద్మాభయపాణీయుతం. పీతవస్త్ర, సంహితంగా వసువుల స్వర్ణ విగ్రహాన్ని చేయించి చందనగందం, జాబిపువ్వులు. గుగ్గులు ధూపాలతో సవిత్రు మండల మంత్రయుక్తంగా షోడశోపచారాలతో పూజించాలి. పాయసాన్నం నివేదించాలి. అనంతరం గాయత్రాష్తోత్తరంతో మేడి సమిధలూ నెయ్యితో హోమం చెయ్యాలి గంధమాల్యాలనీ పెసర అన్నాన్ని ఉత్తరదిక్కులో బలిచెయ్యాలి. దీనివల్ల అరిష్టాలు తొలగి ఆరోగ్యం. సుఖం కలుగుతాయి
Dhanishta Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka
ధనిష్ట నక్షత్ర గాయత్రి మంత్రం:
ఓం అగ్రనాథాయ విద్మహే
వసూప్రితాయ ధీమహి
తన్నో శర్విష్ఠా: ప్రచోదయాత్
ధనిష్ట నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః ।
అమూర్తిరనఘోఽచింత్యో భయకృద్భయనాశనః ॥ 89 ॥
ధనిష్ట నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥
ధనిష్ట నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
భారభృత్ కథితో యోగీ యోగీశః సర్వకామదః ।
ఆశ్రమః శ్రమణః, క్షామః సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥
ధనిష్ట నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః ।
అపరాజితః సర్వసహో నియంతాఽనియమోఽయమః ॥ 92 ॥