ధనస్సు రాశి లక్షణాలు, వ్యక్తిత్వం, బలం & బలహీనత: ధనస్సు రాశి Dhanassu Raasi జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము, అదృష్ట విషయములు మరియు ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Dhanassu Raasi (Sagittarius Sign) Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.
Table of Contents
Dhanassu Raasi (Sagittarius Sign) Details
రాశి సంఖ్య | 9, బేసి రాశి |
రాశి | ధనస్సు |
అధిపతి | గురువు |
నక్షత్రములు | మూల 1,2,3,4, పూర్వ షాడ 1,2,3,4 ఉత్తరాషాడ 1 పాదములు |
గుర్తు | విల్లు |
సూర్య గ్రహ సంచారం | నవంబర్ 22 – డిసెంబర్ 21 |
తత్వము (element) | అగ్ని |
పురుషార్దము | ధర్మము |
శరీర భాగము | తొడలు |
చర/స్తిర/ ద్విస్వభావ | ద్విస్వభావ |
లింగము | పురుష |
ఆయుర్వేద దోషము | పిత్తం |
గుణము | సత్వ |
దిశ | తూర్పు |
రంగు | పసుపు |
పగలు / రాత్రి | రాత్రి |
ఉదయం (raising) | prishthodaya |
వర్ణం | క్షత్రియ |
Dhanassu Raasi Characteristics
ధనస్సు రాశి లో జన్మించిన వారి గుణగణాదులు:
సాహసం, ఉన్నత విద్య, జ్ఞానం, సత్యం, సూత్రాలు, నియమాలు మరియు అదృష్టం. పొడవు, మంద పాటి జుట్టు, మంచి వాక్పఠిమ, ఆధ్యాత్మికత, ధర్మము, ప్రోత్సహించడం, స్పూర్తిదాయకం మరియు ఉదారత.
Dhanassu Raasi Personality
ధనస్సు రాశి లో జన్మించిన వారి స్వభావము:
ధనస్సు రాశి అధిపతి గురువు, ఇది అగ్ని తత్వ రాశి మరియు ధర్మము ను సూచించును.
గుర్తు ధనస్సు, గురువు నియమము లను సూచించించును.
సరి అయిన సమయము లో సరి అయిన నిర్ణయము తీసుకొనుట. ఒక వేళ వ్యక్తి గత జాతకము లో గురువు సరిగా లేక పోతే ధర్మ బద్దం గా నడుచు కోరు, సరి అయిన నిర్ణయము తీసుకోరు, వ్యసనాలు ఉండే అవకాశము కూడా వుండును.
సాధారణం గా ఈ రాశి వారు సాహసాలను ఇష్ట పడతారు. ఈ రాశి దూరపు ప్రయాణము లను కూడా సూచించును, గురువు మార్గ నిర్దేశము చేయు వాడు.
వీరు చక్కని మార్గము లో వెళుతూ ఇతరులకు స్పూర్తి దాయకము గా కూడా వుందురు. ఆధ్యాత్మిక మార్గం లో గురువు లు గా కూడా ఈ రాశి ప్రభావము కల వారు వుందురు.
ఒక దశ లో పిల్లల గురించి కలత చెంద వలసి వస్తుంది. వీరు ముందు ఒకలా వెనుక ఒకలాగా మాట్లాడరు.
నచ్చినట్లు జీవించాలి అని అనుకుంటారు. వృత్తి పరము గా ఆధిపత్య ధోరణి కలిగి వుంటారు. దీనివలన వీరిని చూసి ఇతరులు అసూయ చెందుతారు.
ధనం కోసము కష్ట పడతారు. చిన్న వయస్సు లోనే పెద్ద వారి వలె మాట్లాడుదురు. వీరి భాగస్వామి వీరి కన్నా ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి వుంటారు.
Visit: వృశ్చిక రాశి Vruschika Raasi Characteristics, Personality, Strength & Weakness
Dhanassu Raasi Strength
ధనస్సు రాశి లో జన్మించిన వారి బలము
జ్ఞానం
నియమ బద్ద జీవితము
ధైర్యము
Dhanassu Raasi Weakness
ధనస్సు రాశి లో జన్మించిన వారి బలహీనత
చికాకులు
Restlessness
Commitment issues
Dhanassu Raasi Luck & Favourable
ధనస్సు రాశి లో జన్మించిన వారి అదృష్ట మరియు అనుకూల అంశములు
అదృష్ట రంగు | పసుపు |
అదృష్ట రత్నం | కనక పుష్య రాగం |
అదృష్ట వారము | ఆది వారము |
అదృష్ట సంఖ్య | 3 |
అనుకూల రాశి (compatible sign) | మేషము, మిథునము |
బీజ మంత్రం | ॐ श्रीं देवकृष्णाय उर्ध्वदन्ताय नमः ।। |
Dhanassu Raasi Education
ధనస్సు రాశి – విద్య
అక్కౌంట్స్, డాటా అనాలిసిస్, ఫైనాన్స్, ఎకనమిక్స్, B.Ed, M.Ed, ఆధ్యాత్మిక జ్ఞానం, టీచర్ ట్రైనింగ్,
Dhanassu Raasi Profession, Job, Business
ధనస్సు రాశి – వృత్తి, ఉద్యోగ, వ్యాపారములు
అకౌంటింగ్, బ్యాంకింగ్, ప్రభుత్వ సంభందిత పనులు, బంగారము, ఎలెక్ట్రికల్, ట్రావెలింగ్, ట్రాన్స్పోర్ట్, ఆర్మీ, surgeon, spiritual teacher, teaching
Dhanassu Raasi Health
ధనస్సు రాశి – ఆరోగ్యము
ఈ రాశి ముఖ్యము గా శరీరము లో మోకాలు ను సూచించును, వీరికి రక్త సంభందిత మరియు హృదయ సంభందిత సమస్యలు, diabetes, లివర్, fat, కాన్సర్ సమస్యలు వచ్చు అవకాశము వున్నది.
Dhanassu Raasi Remedies
ధనస్సు రాశి – పరిహారములు
చందనము మాల దగ్గర వుంచుకొనవలెను, గురువులను, సాధువులను గౌరవించండి, తెల్లని వస్తువులు ఆహారము దానము చేయవలెను, నీలము రంగు వస్త్రము దగ్గర వుంచుకొనవలెను, గురువారము దక్షిణా మూర్తి కి ఆరాధన చేయవలెను, శనగలు నైవేద్యము గా పెట్టవలేను. గురు చరత్ర చేయటము మంచిది. మాటలతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. రావి చెట్టు దీపారాధన మంచిది.