Chitra Nakshatra (చిత్ర/చిత్త నక్షత్రం)

Chitra Nakshatra: చిత్ర/చిత్త నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Chitra Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.

Chitra Nakshatra Details

నక్షత్రముచిత్ర
అధిదేవత విశ్వ కర్మ
తారల సంఖ్య 1
గుర్తు ముత్యం
గ్రహం కుజుడు
పురుషార్థ కామ
యోని (Gender)స్త్రీ
గణ రాక్షస
వర్ణ క్షత్రియ
ఎలిమెంట్ అగ్ని
త్రిమూర్తి విష్ణు
త్రి దోష పిత్తం
రంగు నలుపు
దిక్కు దక్షిణం
గోత్రం క్రతు
గుణము రజో గుణం
శరీర భాగము మెడ
జంతువు పులి
పక్షి వృకం
చెట్టు మారేడు
మొదటి అక్షరం పే, పో, రా, రి

Chitra Nakshatra Characteristics

చిత్ర నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:

ఈ చిత్ర నక్షత్రంలో జన్మించినవారి జీవితం కుజ మహాదశలో ప్రారంభమవుతుంది. ఈ దశ 7 సంవత్సరం లు. అనంతరం రాహు మహాదశ 18 సంవత్సరాలు. ఈ చిత్ర నక్షత్రంలో ఫుట్టినవాళ్ళు స్త్రీలోలులూ, భోగవంతులు కాముకులు, కానుశాస్త్రి, ప్రవీణులు, విశాలమైన కన్నులు కలవాడు, పెద్ద అడుగులున్నవాళ్ళూ, మంచి
అలంకరించుకోవడంలో ( ఇది ప్రాచీన విషయం పురుషులు కూడా పువ్వులు ముడుచుకోవడం ఉండేది. కాలరీత్యా మనం దీనిని పరిమళ ద్రవ్యాలంకరణ అంటే సెంట్లూ, అత్తరు వగయిరాల వినియోగంలో అని చెప్పుకోవాలి.) యిష్టత కలవారు అందరిచేతా ప్రేమింపబడేవారూ, ఎడమభాగంలో మత్స్యాం తిలకాలుండేవారూ అవుతారు.

Chitra Nakshatra Personality

చిత్ర నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:

చిత్ర నక్షత్రం 1 వ పాదం – ప్రథమపాదం రవిది. రాజాంశ. ఈవేళా సంజాతులు చంచల మనస్తత్వం కలవారూ, ఉగ్రస్వభావులూ అవుతారు.

చిత్ర నక్షత్రం 2 వ పాదం – ద్వితీయపాదం బుధుడిది. నపుంసకాంశ. ఈ జాతకులు తియ్యగా మాట్లాడతారు. కోపం వస్తే మాత్రం అధిక కాలం వుంటుంది.

చిత్ర నక్షత్రం 3 వ పాదం – తృతీయపాదం శుక్రుడిది. అభయాంశ వీళ్ళు కీర్తిమంతులు శౌర్యవంతులు అవుతారు. పండితులతో సహవాసం చేయడం, నిత్యం వారితోనే సహవాసం చేయడం చేస్తారు.
చిత్ర నక్షత్రం 4 వ పాదం – చతుర్ద పాదం కుజుడుది – సంపాదన ప్రారంబం లో దొంగతనలకు పాల్పడుతారు. దైర్యవంతులు

Chitra Nakshatra Strength

చిత్ర నక్షత్ర జాతకుల బలాలు:

  • చతురత
  • ధైర్యవంతులు.

Chitra Nakshatra Weakness

చిత్ర నక్షత్ర జాతకుల బలహీనతలు:

  • కోపం

Chitra Nakshatra Favorable & Unfavorable

  • అనుకూలము – ఆరోగ్యం మరియు శారీరక మెరుగుదల, కళలు మరియు హస్తకళలు, ఇంటీరియర్ డిజైనింగ్, స్పిరిచువాలిటీ, హెర్బ్ కలెక్షన్, వ్యతిరేక లింగాన్ని ఆకర్షించడం, అలంకరణ, సొగసు, చరిష్మా, ఆరోగ్య సంరక్షణ, కొత్త బట్టలు కొనడం, ఇంటి మరమ్మతులు, ఇంటి డిజైన్.
  • అననుకూలము – ఘర్షణ, దర్యాప్తు మరియు వివాహం
  • ఈ నక్షత్రంలో 20 వ ఘటిక తర్వాత విషనాడీ

చిత్ర నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు

Nakshatram Chitra
తిథి పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశి
వారాలు ఆది, మంగళ, గురు, వారములు
సంవత్సరము 25, 30, 36, 41, 43, 48
నక్షత్రాలు రోహిణి
సంఖ్య 1,3,9
రంగు ఎరుపు
రత్నం పగడం
రుద్రాక్ష త్రి ముఖి
లోహం బంగారం
దిక్కు దక్షిణం
దైవము విష్ణు

Chitra Nakshatra – Education

చిత్ర నక్షత్రం – విద్య:

బి.ఎ. లా, లిటరేచర్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స వ్యవసాయం/ఫిషరీస్/ఆయుర్వేద వైద్యంలో. బ్యాంక్ మేనేజ్ మెంట్, సివిల్ ఇంజినీరింగ్. Environment యాజమాన్యం.

Chitra Nakshatra – Profession, Job, Business

చిత్ర నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:

జైలుకు సరఫరాదారు, క్రిమినల్ లాయర్, పన్ను విభాగం. ఫైనాన్స్ డిపార్ట్ మెంట్, పోలీస్ భద్రతలు మరియు ట్రాఫిక్, రక్షణ డిపార్ట్ మెంట్, కాస్ట్ అకౌంట్స్, మిలటరీ అకౌంట్లు

Chitra Nakshatra Health

చిత్ర నక్షత్రం – ఆరోగ్యము:

అధిక మూత్రం, మూత్రపిండాల్లో రాళ్లు, మెదడు జ్వరం, లుంబాగో, మూత్రపిండాల రక్తస్రావం, పుండ్లు, పదునైన నొప్పులు, గాయాలు, కోలెరిక్ హ్యూమర్, దురద, చికాకు, పురుగులు, కాలు నొప్పి

Chitra Nakshatra Remedies

చిత్ర నక్షత్రం – శాంతి పూజ విధులు:

చిత్ర నక్షత్రం మొదటి 3 పాదములు దోషము కలదు.

ఈ నక్షత్రంలో శాంతి కొరకు నాలుగు చేతులూ, ఆ నాలుగు చేతులందునా అక్షసూత్రకమండువులు వరదముద్రా ధరించి వున్నట్టుగానూ, చిత్ర రంగు -. కట్టుకున్న బంగారు విగ్రహాన్ని నిర్మించి ఆవాహన చేసి చిత్రనామ దేవానాం అనే మంత్రాదిగా షోడశోపచారాలు చేయాలి. ఈ పూజలోకి’ ఉండ్రాళ్ళు, పాలు సమర్పించాలి.

Chitra Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka

చిత్ర నక్షత్ర గాయత్రి మంత్రం:

ఓం మహాదృష్టాయై విద్మహే
ప్రజారపాయై ధీమహి
తన్నో చిత్త: ప్రచోదయాత్

చిత్ర నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీర భూతభృద్ భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

చిత్ర నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

సోమపోఽమృతపః సోమః పురుజిత్ పురుసత్తమః ।
వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాం పతిః ॥ 54 ॥

చిత్ర నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

జీవో వినయితా సాక్షీ ముకుందోఽమిత విక్రమః ।
అంభోనిధిరనంతాత్మా మహోదధి శయోంతకః ॥ 55 ॥

చిత్ర నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనందోఽనందనోనందః సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *