Aswini Nakshatra (అశ్విని నక్షత్రం)

Aswini Nakshatra: అశ్విని నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Ashwini Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.

Aswini Nakshatra Details

నక్షత్రముఅశ్విని
అధిదేవత అశ్విని కుమారులు
తారల సంఖ్య 3
గుర్తు గుర్రపు ముఖం
గ్రహం కేతు
పురుషార్థ ధర్మ
యోని (Gender)పురుష
గణ దేవ
వర్ణ వైశ్య
ఎలిమెంట్ పృథ్వీ
త్రిమూర్తి బ్రహ్మ
త్రి దోష వాతము
రంగు కృష్ణ వర్ణము
దిక్కు దక్షిణము
గోత్రం మారిచి
గుణము తమో గుణం
శరీర భాగము ఎగువ పాదం
జంతువు మగ గుర్రం
పక్షి హంస
చెట్టు విషముష్టి (Poison nut tree) లేదా జీడిమామిడి
మొదటి అక్షరం చు, చే, చో, లా

Aswini Nakshatra Characteristics

అశ్విని నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:

ఈ అశ్విని నక్షత్రంలో జన్మించినవారి జీవితం కేతుమహాదశలో ప్రారంభమవుతుంది. ఈదశ 7 సం॥రలు. అనంతరం శుక్రమహాదశ 20 సంవత్సరాలు. ఈ అశ్విని నక్షత్రం లో జన్మించినవాళ్ళు దీర్ఘాయువులవుతారు, స్థూలకాయులు, పొడుగాటి చేతులు, చిన్న ముక్కు, విశాలమైన కళ్ళు కలవారు, చక్కటి రూపవంతులు, అందరి చేత ప్రేమించబడే వాళ్ళు, సమర్థులు, తెలివైనవాళ్లు, రాజ గౌరవం పొందేవాళ్ళు, అభరణ ప్రియులు, చెడుసావాసలు చేసేవారు, సాహసవంతులు, లోభులు, చాపల్యం కలవాళ్ళు, కటి ప్రాంతం లో పుట్టుమచ్చలు కలవాళ్ళు గా ఉంటారు.

Aswini Nakshatra Personality

అశ్విని నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:

విపరీతమైన ధోరణి , సోదరుడి అనారోగ్యం, దురభిమానం, భూమి ఆస్తుల గురించి చింత, సోదరుడితో వివాదాలు, విభజన, చేతబడి.

అశ్వినీ నక్షత్రం 1 వ పాదం – అశ్వినీ నక్షత్రం ప్రథమపాదం కుజునియొక్క తస్కరాంశకు చెందినదికావడంవలన, ఆ జాతకులు వైభవోపేతులు, భోగులు, యోధులు, లోభులు, పరస్త్రీరతులు, చేతివాటం కలవాళ్ళుగా ఉంటారు.

అశ్వినీ నక్షత్రం 2 వ పాదం – అశ్విని నక్షత్ర ద్వితీయపాదం శుక్రునిది. భోగాంశకావడం వలన తత్పాదజాతులు ధర్మాత్ములు, తేజోవంతులు, ధనధాన్యవృద్ధి గలవాళ్ళు అవుతారు.

అశ్వినీ నక్షత్రం 3 వ పాదం – ఈ తారయొక్క తృతీయపాదం బుధునిది. విలక్షణంశ. ఈ పాదం లో జన్మించినవాళ్ళు వైభవోపేతులు, భోగులూ, యుద్ధాలలో గెలుపొందే వాళ్ళుగా ఉంటారు.
అశ్వినీ నక్షత్రం 4 వ పాదం – అశ్వినీ నక్షత్ర చతురపాదం చంద్రునిది – ధర్మాంశ, ఈ పాదంలో పుట్టినవాళ్ళు దేవ పూజాతత్పరులు, నిత్యం ధర్మకార్యాచరణలో నిమగ్నమయ్యేవాళ్ళుగా ఉంటారు.

Aswini Nakshatra Strength

అశ్విని నక్షత్ర జాతకుల బలాలు:

  • ధైర్యము
  • సాహసము
  • ముక్కుసూటి మనిషి
  • కాంపిటీషన్సలో రాణించుట
  • స్వయం సమృద్ది
  • సహాయ సహకరములు చేయుట
  • ముందడుగు

Aswini Nakshatra Weakness

అశ్విని నక్షత్ర జాతకుల బలహీనతలు:

  • ధీర్గకాల సంబందంలో అసమర్థత
  • కోపములో  సలహాలు తీసుకొనుట
  • దూకుడు మొండి పట్టుదల & అహంకారం
  • సులభంగా నిరాశ చెందుట  
  •    అసంతృప్తిగా ఉండుట   
  • తొందరపాటు

Aswini Nakshatra Favorable & Unfavorable

  • అనుకూలము – నూతనముగా వాహనములో ప్రయాణించడానికీ, క్రొత్తవూరిలో అడుగు మోపడానికీ, వైద్యారంభానికీ, అమ్ముట లేదా కొనుటకు, మరమ్మత్తులకి, మంత్రస్వీకార జపారంభాలకీ, గృహ సౌధ -గ్రామాదుల ప్రతిష్ఠాపనోత్సవాలకీ, యాత్రకూ, పట్టాభిషేకాదులకీ, యజ్ఞయాగాది క్రతుదీక్షా స్వీకారానికీ, శాంతులకీ ఈ అశ్వినీ నక్షత్రం యోగ్యమైనది.
  • అననుకూలము – వివాహములకు , శృంగారమునకు, ఓపిక పట్టవలసిన విషయములయందు అశ్విని నక్షత్రము అనుకూలము కాదు.
  • నక్షత్రాది 2 ఘటికలు గండాంత కాలం – అభుక్తదోషం.
  • ఈ నక్షత్రంలో జన్మించినవారికి జననాది ప్రథమ సంవత్సరమ అగ్నిభయం; మూడవయేట ఉదరవ్యాధి, అయిదవయేట నేత్రవ్యాధి ఆరవయేడు నడును ద్రవ్య హాని, పదవయేటగాని – ఇరవయ్యవ యేటగా మేహరోగం కలుగుతాయి. ఇరవయ్యొకటన సంవత్సరం అపమృత్యు భయము. 24వ యేట దొంగలవలనా – మృగాదుల వలనా భయం. 40 యేట పునఃమారక ప్రమాదం ఉంది. ఆ గండం గడిస్తే 76 సంవత్సరాల ఆయుర్దాయంతో శోభిస్తారు. (Danger years 1,3,5,6,10,20,21,24,40).

అశ్విని నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు

Nakshatram Aswini
తిథి తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి
వారాలు ఆది, గురు, శుక్ర వారములు
సంవత్సరము 18, 20, 26, 29, 36, 42, 47, 50, 56
నక్షత్రాలు శతభిష
సంఖ్య 1, 7
రంగు తెలుపు, గోదుమ
రత్నం వైడూర్యం (Cat’s eye)
రుద్రాక్ష సప్త ముఖి
లోహం వెండి
దిక్కు ఉత్తరం
దైవము శివుడు, సూర్యుడు, గణపతి

Aswini Nakshatra – Education

అశ్విని నక్షత్రం – విద్య:

ఇంజనీరింగ్ – అగ్రికల్చర్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, సివిల్, ఆర్ట్స్, లా, మాథెమాటిక్స్, జూలోజి, బోటనీ.

Aswini Nakshatra – Profession, Job, Business

అశ్విని నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:

మిలిటరీ, మెడికల్, పోలీస్, సర్జరీ, జైలు, రైల్వేస్, ఐరన్, స్టీల్, కాపర్, మెషినరీ, ఫీజిషన్స్, అటెండంట్స్, హార్స్ డీలర్,
ట్రేడర్స్.

Aswini Nakshatra Health

అశ్విని నక్షత్రం – ఆరోగ్యము:

థ్రాంబోసిస్, మూర్ఛ, తలకు గాయం, స్ట్రోక్స్, స్పామ్, కోమా, మలేరియా, ట్రాన్స్, స్మాల్ పాక్స్, తలనొప్పి, న్యూరల్జియా, సెరిబ్రల్ హెమరేజ్, బెల్స్ పాల్సీ, మెనింజైటిస్

Aswini Nakshatra Remedies

అశ్విని నక్షత్రం – శాంతి పూజ విధులు: 1 వ పదము తండ్రికి దోషము, తక్కిన పదములకు దోషము లేదు.

శ్వేతవర్ణం, ద్విభుజం, అమృత భాండాన్నీ- కమండువులనూ ధరించివున్నది తెల్లని పూవులతో – వస్త్రాలతో కూడినదీయైన అశ్వినిని బంగారపు ప్రతిమయందు ఆవాహన చేయాలి. మలయజ గంధం, గుగ్గిల ధూపం, తామరపూవులతో అర్చించాలి. క్షీరాన్నం నైవేద్యముంచాలి.

‘‘దేవస్యత్వ…..” ఇత్యాది యంత్రయుతంగా షోడశోపచారాలతోనూ పూజించాలి. క్షీరాన్నం, సమిథలూ, ఆవు నెయ్యితో గాయత్రీ అష్టోత్తర శతంతో హోమం చేయాలి. గంధ మాల్యాదులూ, మినుముతో వండిన అన్నాన్నీ తూర్పుదిశలో బలిగా యివ్వాలి. ఈవిధంగా శాంతి జరపడం వలన అశ్వినీతారా సంజాతులైన వారికి అరిష్టాలు ఉపశమిస్తాయి. వారం రోజులలో స్వస్థత కలుగుతుంది.

Aswini Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka

అశ్విని నక్షత్ర గాయత్రి మంత్రం:

ఓం శ్వేతవర్ణై విద్మహే
సుధాకరాయై ధిమహి
తన్నో అశ్వినేన ప్రచోదయాత్

అశ్విని నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః ।
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ 1 ॥

అశ్విని నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః ।
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ॥ 2 ॥

అశ్విని నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః ।
నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ॥ 3 ॥

అశ్విని నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *