Ardra Nakshatra (ఆరుద్ర నక్షత్రం)

Ardra Nakshatra: ఆరుద్ర నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Ardra Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.

Ardra Nakshatra Details

నక్షత్రముఆరుద్ర
అధిదేవత రుద్రుడు
తారల సంఖ్య 1
గుర్తు కన్నీటి బిందు
గ్రహం రాహు
పురుషార్థ కామ
యోని (Gender)స్త్రీ
గణ మనుష్య
వర్ణ చండాలుడు
ఎలిమెంట్ జలము
త్రిమూర్తి శివ
త్రి దోష వాతము
రంగు హరిత (గ్రీన్)
దిక్కు పశ్చిమం
గోత్రం పులశ
గుణము తమో గుణం
శరీర భాగము కన్ను
జంతువు ఆడ కుక్క
పక్షి క్రౌంచం
చెట్టు చండ్ర
మొదటి అక్షరం కూ, ఖం, చా

Ardra Nakshatra Characteristics

ఆరుద్ర నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:

ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించినవారి జీవితం రాహు మహాదశలో ప్రారంభమవుతుంది. ఈదశ 18 సం॥రలు. అనంతరం గురు దశ 16 సంవత్సరాలు. ఈ ఆరుద్ర నక్షత్రం లో జన్మించినవాళ్ళు గుణవంతులూ, ఆచారవంతులు. ఉంటారు. కొనుగోలు అమ్మకాల విషయంలో నేర్పరులవుతారు, గర్విష్థులూ, పాపకర్మాసక్తులూ, విశ్వానఘాతకులు, అధిక ఆయుర్దాయం కలవాళ్ళుగా ఉంటారు.

Ardra Nakshatra Personality

ఆరుద్ర నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:

ఆరుద్ర నక్షత్రం 1 వ పాదం – ప్రథమపాదం గురుడిది. కృపాంశ – ఈ అంశలో జన్మించిన వాళ్ళు గుణవంతులు నిత్యం, ప్రశాంతంగా వుండే చక్కటి ముఖం కలవాళ్ళూ, తామున్న రంగంలో వేర్చరులూ అవుతారు.

ఆరుద్ర నక్షత్రం 2 వ పాదం – ద్వితీయపాదం శవిది. తస్కరాంశ – ఈ జాతకులు కలహ ప్రియులు, దొంగలు ఆతి దాహం కలవారు, హీనమైన కంఠ స్వరం కలవాళ్ళుగా ఉంటారు.

ఆరుద్ర నక్షత్రం 3 వ పాదం – మూడవపాదం శనిది కాని ఇది ఉగ్రాంశ అందువల్ల వీళ్ళు పాపకర్మలు, చెడు ఆలోచనలు చేసేవారూ స్తిరమ్టైన ధనం లేనివారు, దుబారా చేయువారు, సూచీ లేని వారు.

ఆరుద్ర నక్షత్రం 4 వ పాదం – చతుర్థ పాదం గురువుది – ధర్మాత్ములు, మంచి ఆచారవంతులు, ఇతరులను గౌరవించేవారు అవుతారు.

Ardra Nakshatra Strength

ఆరుద్ర నక్షత్ర జాతకుల బలాలు:

  • వర్తక నేర్పరులు
  • సామర్దయమ్

Ardra Nakshatra Weakness

ఆరుద్ర నక్షత్ర జాతకుల బలహీనతలు:

  • గర్వం
  • కోపం

Ardra Nakshatra Favorable & Unfavorable

  • అనుకూలము – అగ్ని ప్రయోగం, అక్షర స్వీకారం, అస్త్ర విద్యాభ్యాసారంభం, దొంగతనావికి బయలుదేరడం, భూత గ్రహ ఛటనకు, మంత్ర ప్రయోగం, శివ లింగ ప్రతిష్టకు, తీర్థ యాత్రలకు, శ్రాద్ద కర్మలకు అనుకూలం
  • అననుకూలము – వివాహములకు , శృంగారమునకు, ఓపిక పట్టవలసిన విషయములయందు ఆరుద్ర నక్షత్రము అనుకూలము కాదు.
  • నక్షత్రాది 21 ఘటికలు తర్వాత విష నాడీ

ఆరుద్ర నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు

Nakshatram Ardra
తిథి తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి
వారాలు బుధ, శుక్ర, శని వారములు
సంవత్సరము 18, 21, 26, 36, 40, 47, 53
నక్షత్రాలు థనిస్టా
సంఖ్య 4,8
రంగు ఆకుపచ్చ
రత్నం గోమేదికమ్
రుద్రాక్ష అష్ట ముఖి
లోహం వెండి
దిక్కు ఉత్తరం
దైవము శివుడు, దుర్గా మాత

Ardra Nakshatra – Education

ఆరుద్ర నక్షత్రం – విద్య:

రవాణా/వ్యవసాయం/రబ్బరు ఇంజనీరింగ్. పశు సంవర్ధకము, అణు పరిశోధన. జర్నలిజం, వైద్యుడు.

Ardra Nakshatra – Profession, Job, Business

ఆరుద్ర నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:

పోస్ట్ మరియు టెలిగ్రాఫ్ డిపార్ట్‌మెంట్, కమ్యూనికేషన్, రవాణా, పుస్తక విక్రేత, ప్రకటన, రచయిత, వేలిముద్ర నిపుణుడు, ఫైనాన్స్ బ్రోకర్, డ్రగ్స్, పానీయాలు, క్యాన్డ్ గూడ్స్ వ్యాపారం.

Ardra Nakshatra Health

ఆరుద్ర నక్షత్రం – ఆరోగ్యము:

గవదబిళ్ళలు, ఆస్తమా, పొడి దగ్గు, చెవిలో చీము, ఈస్నోఫిలియా, డిఫ్తీరియా, చెవిలో ఇబ్బంది.

Ardra Nakshatra Remedies

ఆరుద్ర నక్షత్రం – శాంతి పూజ విధులు: ఈ నక్షత్రంలో ఏర్పడిన జ్వరం ప్రాణాంతకనువుతుంది. 3 నెలల పాటు అరిష్టాలపాలు చేస్తుంది. తత్‌ శాంతి నిమిత్తంగా – త్రినేత్రుడు, తెల్లటివర్ణం, తెల్లటి వస్త్రం, రెండు చేతులు, ఒక చేత త్రిశూలం, వృషభవాహనుడూ అయిన రుద్రుడిని ప్రతిమయందు అవాహన చేసి “నమశళ్ళంభవే అనే మం త్ర పూర్వకంగా షోడశోపచారపూజ వహించాలి. తెల్లటి గంధం, అగరుధూపం, దుత్తూర పుష్పం, నివేదనార్దం శాల్యాన్నాన్ని ఉపయోగించాలి. అనంతరం – గాయత్రీ అష్టోత్తర శతయుక్తంగా – తేనె, నెయ్యితో హోమం చేయాలి. గంధమాల్య పాయసాన్నాలను ఈశాన్య దిశలో బలి గా ఉంచాలి. శక్తిమంతులు తెల్లటి గోవును దానం చేయాలి. తద్వారా ఆరుద్ర తారారిష్టాలు 1 మాసం లో తొలగి సుఖసౌఖ్యాలు ఏర్పడతాయి.

Ardra Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka

ఆరుద్ర నక్షత్ర గాయత్రి మంత్రం:

ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే
పశుం తనాయ ధిమహి
తన్నో ఆర్ద్రా: ప్రచోదయాత్

ఆరుద్ర నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః ।
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ 21 ॥

ఆరుద్ర నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

అమృత్యుః సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిరః ।
అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ 22 ॥

ఆరుద్ర నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః ।
నిమిషోఽనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః ॥ 23 ॥

ఆరుద్ర నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

అగ్రణీగ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ॥ 24 ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *