మేష రాశి Mesha Raasi Characteristics, Personality, Strength & Weakness

మేష రాశి లక్షణాలు, వ్యక్తిత్వం, బలం & బలహీనత: మేష రాశి (Mesha Raasi) జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము, అదృష్ట విషయములు మరియు ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Mesha Raasi (Aries Sign) Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.

Mesha Raasi (Aries Sign) Details

రాశి సంఖ్య1 = బేసి రాశి
రాశిమేషం
అధిపతిమంగళుడు, అంగారకుడు
నక్షత్రములుఅశ్విని 1,2,3,4, భరణి 1,2,3,4, కృత్తిక 1 వ పాదము
గుర్తుపొట్టేలు
సూర్య గ్రహ సంచారంమార్చి 21 – ఏప్రిల్ 19
తత్వము (element)అగ్ని
పురుషార్దముధర్మము
శరీర భాగముతల
చర/స్తిర/ ద్విస్వభావచర రాశి (dynamic)
లింగముపురుష రాశి
ఆయుర్వేద దోషముపిత్తము
గుణమురజో గుణము
దిశతూర్పు
రంగురక్త వర్ణం
పగలు / రాత్రిరాత్రి
ఉదయం (raising)Prishthodaya రాశి
వర్ణంక్షత్రియ

Mesha Raasi Characteristics

మేష రాశి లో జన్మించిన వారి గుణగణాదులు: 

డైనమిక్, కష్టాలను ఆస్వాదించడం, తమ కంఫర్ట్ జోన్ వదిలి పనిచేయడము, బాధ్యత మరియు యజమానిగా ఉండాలనే కోరిక, వేగము,  అనూహ్యంగా, పారదర్శకంగా ఉండటం, తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నప్పటికీ విధేయుడు, అతి, పొడిగా, తొందరపాటు, ఔత్సాహికం

Mesha Raasi Personality

మేష రాశి లో జన్మించిన వారి స్వభావము:

మంగళుడు  ఈ మేష రాశి అధిపతి. వీరు జీవితంలో ధైర్యమైన మరియు ఉత్సాహభరితమైన మార్గాన్ని కోరుకుంటారు.

ఈ మేష రాశి కి సప్తమము లో తుల రాశి ఆగుట చేత మేష రాశి లో జన్మించిన వ్యక్తి అందం, కళ మరియు చక్కదనం ఇష్టపడతారు.

మేషం యొక్క జాతకులు స్వతంత్ర ఆలోచనల ను కలిగివుంటారు, వారు తమ స్వంత విభిన్న మార్గాన్ని కనుగొనడానికి ఇష్టపడతారు మరియు బలమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.

మొదటి చర్య తీసుకోవడాన్ని ఉత్సాహము చూపుతారు. కానీ ఈ  రెసి వారు అపజయము ఒప్పుకోలేరు, కొందరకి త్వరగా అసహన స్వభావం వస్తుంది, దానివలన అసహనం కోపముగా మారు అవకాశము వుంది. అస్థిరత మరియు భాగస్వామి తో కఠినము గా వుండడము,గుర్తింపు కోసము తపిస్తారు, అసూయకు గురి అవ్వడము ఈ మేష రాశి వారి ప్రతికూల లక్షణాలు.

ఈ మేష రాశిలో మొదట అమాయకులు మరియు త్వరగా విశ్వసించేవారు వుంటారు. ఎక్కువగా ప్రతి పని లో  చాలా ఆశాజనకంగా ఉంటారు. అదే సమయంలో మేషరాశి వారు తమ ప్రియమైన వారిని చాలా స్వాధీనపరుచు కోవాలని భావిస్తారు. ఇది భాగస్వామికి కొంత ఇబ్బంది మరే అవకాశము వునది.  పోటీ తత్వము, మేషరాశి వారు తమను తాము మరియు వారు చేసే పనులకు గుర్తింపు మరియు ప్రశంసలను ఇష్టపడతారు.

వీరు విస్మరించబడటం మరియు క్షమా గుణము కూడా కలిగి వుంటారు. మేషరాశి మనిషి తన సొంత నిర్ణయాలపై దృఢ నిశ్చయము మరియు నమ్మకంగా ఉంటారు.

Mesha Raasi Strength

మేష రాశి లో జన్మించిన వారి బలము

  • పెద్ద ఆశయములు
  • నిజాయితీ
  • ఆత్మవిశ్వాసం
  • సానుకూల దృక్పదం

Mesha Raasi Weakness

మేష రాశి లో జన్మించిన వారి బలహీనత

  • తొందరపాటు
  • నిరంకుశత్వ దోరణి
  • విపరీత పోటీ తత్వం  

Mesha Raasi Luck & Favourable

మేష రాశి లో జన్మించిన వారి అదృష్ట మరియు అనుకూల అంశములు

అదృష్ట రంగుఎరుపు
అదృష్ట రత్నంపగడము
అదృష్ట వారముమంగళ, ఆది, గురు వారములు
అదృష్ట సంఖ్య1,9
అనుకూల రాశి (compatible sign)సింహం, ధనస్సు, తుల
బీజ మంత్రంॐ ऎं क्लीं सौः |

Mesha Raasi Education

మేష రాశి – విద్య

 మెకానికల్, ఎలెక్ట్రికల్, ఆటలు, వైద్యము, అగ్రికల్చర్, రక్షణ సంభందిత విద్యలు, రాజనీతి, పర్యాటకం వంటి విద్యలను మేష రాశి ప్రభావితము చేయును.

Mesha Raasi Profession, Job, Business

మేష రాశి – వృత్తి, ఉద్యోగ, వ్యాపారములు

మెకానికల్ ఇంగినీరింగ్, కెమీకల్స్, అగ్ని సంభందిత పనులు, రక్షణ వ్యవస్త, పోలీస్, ఆర్మీ, సేల్స్, క్రీడా రంగం, వ్యవసాయం, వంటలు, తలకు సంబందించిన వైద్యం, పర్యాటకం, రిస్క్ ఎక్కువ వున్న పనులను మేష రాశి సూచించును.

Also See: 760+ Baby Names for Aries Zodiac

Mesha Raasi Health

మేష రాశి – ఆరోగ్యము

పిత్తం దోషము, అజీర్తి, తల, thyroid, కళ్ళు, పళ్ళు  కు సంభందించిన వ్యాధులు,

Mesha Raasi Remedies

మేష రాశి – పరిహారములు

మేషరాశి వారు ప్రతి మంగళ వారము ఆంజనేయ స్వామి వారిని పూజించవలెను. ముఖ్యమైన పనులకు ఎర్రని వస్త్రము దగ్గర వుంచుకొనవలెను. చందనము నుదుటన ధరించ వలెను.  తల్లి,తండ్రుల మరియు గురువుల సేవ చేయవలెను.

శుక్ర వారము పూట తీపి పదార్దములు శ్రీ లక్ష్మీ నారాయణునికి నివేధన చేసి ప్రసాదమును దానము ఇవ్వడము వలన దాంపత్య సమస్యలు తొలుగుతాయి.

అంగ వైకల్యం కల వారికి సాయము చేయ వలెను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *