Purva Bhadrapada Nakshatra (పూర్వ భాద్రపద నక్షత్రం)

Purva Bhadrapada Nakshatra: పూర్వ భాద్రపద నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Purva Bhadrapada Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.

Purva Bhadrapada Nakshatra Details

నక్షత్రముపూర్వ భాద్రపద
అధిదేవత అజ ఏకపాద
తారల సంఖ్య 2
గుర్తు కత్తి
గ్రహం గురు
పురుషార్థ అర్థ
యోని (Gender)పురుష
గణ మనుష్య
వర్ణ బ్రాహ్మణ
ఎలిమెంట్ ఆకాశ
త్రిమూర్తి బ్రహ్మ
త్రి దోష వాతం
రంగు వెండి
దిక్కు పశ్చిమం
గోత్రం మారిచి
గుణము సత్వ గుణం
శరీర భాగము కుడి తొడ
జంతువు సింహం
పక్షి పావురం
చెట్టు మామిడి
మొదటి అక్షరం సే, సో, దా, ది

Purva Bhadrapada Nakshatra Characteristics

పూర్వ భాద్రపద నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:

ఈ పూర్వ భాద్రపద నక్షత్రంలో జన్మించినవారి జీవితం శని మహాదశలో ప్రారంభమవుతుంది. ఈ దశ 19 సంవత్సరం లు. అనంతరం బుద మహాదశ 17 సంవత్సరాలు. ఈ పూర్వ భాద్రపద నక్షత్రంలో ఫుట్టినవాళ్ళు అత్యంత ఉదార స్వభావులూ. జ్ఞానవంతులూ. వినయవంతులు. పుత్రసంతానం అధికంగా కలవారు. పొడుగైన నాలుక కలవాళ్ళూ. ఉత్కృష్టమైన పనులు చేయడంలో యిష్టంగలవాళ్ళూ. పొడగరి శరీరం కలవాళ్ళూ. ముఖమందునా. గుహ్యస్తానంలోనూ తిలక మత్సా్యాంకాలున్న వాళ్ళూ అవుతారు. చెవిరోగాలుంటాయి.

Purva Bhadrapada Nakshatra Personality

పూర్వ భాద్రపద నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:

పూర్వ భాద్రపద నక్షత్రం 1 వ పాదం – ప్రథమపాదం కుజుడిది ఉద్యోగస్తులు, దైవ భక్తులు, భోగవంతులు

పూర్వ భాద్రపద నక్షత్రం 2 వ పాదం – ద్వితీయపాదం సుక్రుడిది భోగంశ – సాహసవంతులు, మంత్రోపాశకులు, రాజ్యవిరోధులు

పూర్వ భాద్రపద నక్షత్రం 3 వ పాదం – మూడో పాదం బుదుడిది విచక్షణం, పితృ ప్రియం, సుఖవంతులు, జ్ఞానం
పూర్వ భాద్రపద నక్షత్రం 4 వ పాదం – నాలుగోపాదం చంద్రుడిది ధనాంశ అందరికీ నచ్చిన వారు, స్త్రీ లాలసులు, మాతృ సేవకులు.

Purva Bhadrapada Nakshatra Strength

పూర్వ భాద్రపద నక్షత్ర జాతకుల బలాలు:

  • జ్ఞానం
  • ధైర్యవంతులు.

Purva Bhadrapada Nakshatra Weakness

పూర్వ భాద్రపద నక్షత్ర జాతకుల బలహీనతలు:

  • మోసం

Purva Bhadrapada Nakshatra Favorable & Unfavorable

  • అనుకూలము – ప్రమాదకరమైన కార్యకలాపాలు, అనిశ్చితి, రిస్క్, మెకానిజం, టెక్నాలజీ, ఫ్యూనరల్స్, తీర్మానాలు, మరణం, వ్యవసాయం మరియు నీరు
  • అననుకూలము – ప్రారంభం, దీక్షలు, వివాహం, లైంగిక కార్యకలాపాలు, పై అధికారులతో వ్యవహరించడం
  • ఈ నక్షత్రంలో 16 వ ఘటిక తర్వాత విషనాడీ

పూర్వ భాద్రపద నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు

Nakshatram Purva Bhadrapada
తిథి పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశి
వారాలు బుద, గురు, శుక్ర, శని వారములు
సంవత్సరము 16, 23, 30, 36, 42, 44, 48, 53
నక్షత్రాలు స్వాతి
సంఖ్య 3
రంగు పసుపు
రత్నం కనక పుష్య రాగం
రుద్రాక్ష 3,5 ముఖి
లోహం వెండి
దిక్కు ఈశాన్యం
దైవము శివుడు

Purva Bhadrapada Nakshatra – Education

పూర్వ భాద్రపద నక్షత్రం – విద్య:

అండర్ గ్రాడ్యుయేట్, బీఏ, బీఎడ్, M.Sc డిప్లొమా రేడియాలజీ, ఎలక్ట్రోలజీ/ఫార్మాలో

Purva Bhadrapada Nakshatra – Profession, Job, Business

పూర్వ భాద్రపద నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:

మంత్రి, కౌన్సిలర్, రాజకీయ నాయకుడు, అధ్యక్షుడు, జడ్జి, క్రిమినల్ లాయర్, జైళ్ల సందర్శకులు, ప్లానింగ్ కమిషన్, అన్వేషకుడు, వైద్యుడు, బ్యాంకు, విదేశీ మారకద్రవ్యం, యుద్ధఖైదీలు

Purva Bhadrapada Nakshatra Health

పూర్వ భాద్రపద నక్షత్రం – ఆరోగ్యము:

సక్రమంగా లేని ప్రసరణ వ్యవస్థ, వ్రణోత్పత్తి చిగుళ్ళు, వాపు పాదాలు, విస్తరించిన కాలేయం, హెర్నియా, కామెర్లు, పొత్తికడుపు కణితి, పాదాలలో మొక్కజొన్నలు, చెమటలు పాదాలు, ప్రేగు లోపం

Purva Bhadrapada Nakshatra Remedies

పూర్వ భాద్రపద నక్షత్రం – శాంతి పూజ విధులు:

పూర్వ భాద్రపద నక్షత్రం 4 పాదములు సామాన్య దోషము కలదు.

అక్షసూత్రదండకమండలు పాశుదండాలతో కూడిన చతుర్చుజయుక్త అజైకపద స్వర్ణ విగ్రహం చేయించి *శన్నోదేవి మంత్రయుక్తంగా షోడశోపచారాలతో పూజించాలి. ఈ పూజలో ఎర్రని వస్త్రాన్ని కుంకుమగంధాన్నీ. అర్క (జిల్లేడు), గుగ్గులు ధూపం తప్పనిసరిగా ఉపయోగించాలి. దద్దోజనం నైవేద్యం చేయాలి. అనంతరం నెయ్యి గుమ్మడీ హోమం చేయాలి.

Purva Bhadrapada Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka

పూర్వ భాద్రపద నక్షత్ర గాయత్రి మంత్రం:

ఓం తేజస్కరాయ విద్మహే
అజరక పాదాయ ధీమహి తన్నో
పూర్వప్రోష్టపత: ప్రచోదయాత్

పూర్వ భాద్రపద నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః ॥ 97 ॥

పూర్వ భాద్రపద నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

అక్రూరః పేశలో దక్షో దక్షిణః, క్షమిణాంవరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥

పూర్వ భాద్రపద నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వప్ననాశనః ।
వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః ॥ 99 ॥

పూర్వ భాద్రపద నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

అనంతరూపోఽనంత శ్రీర్జితమన్యుర్భయాపహః ।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *