Magha Nakshatra: మఖ నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Magha Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.
Table of Contents
Magha Nakshatra Details
నక్షత్రము | మఖ |
---|---|
అధిదేవత | పితృ దేవతలు |
తారల సంఖ్య | 5 |
గుర్తు | పల్లకి |
గ్రహం | ketu |
పురుషార్థ | అర్థ |
యోని (Gender) | పురుష |
గణ | రాక్షస |
వర్ణ | శూద్ర |
ఎలిమెంట్ | అగ్ని |
త్రిమూర్తి | బ్రహ్మ |
త్రి దోష | కఫం |
రంగు | తెలుపు |
దిక్కు | పశ్చిమం |
గోత్రం | అంగీరస |
గుణము | తమో గుణం |
శరీర భాగము | పెదవులు |
జంతువు | ఎలుక |
పక్షి | గ్రద్ద |
చెట్టు | మర్రి |
మొదటి అక్షరం | మా, మీ, మూ, మే |
Magha Nakshatra Characteristics
మఖ నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:
ఈ మఖ నక్షత్రంలో జన్మించినవారి జీవితం కేతు మహాదశలో ప్రారంభమవుతుంది. ఈ దశ 7 సంవత్సరం లు. అనంతరం శుక్ర మహాదశ 20 సంవత్సరాలు. ఈ మఖ నక్షత్రంలో ఫుట్టినవాళ్ళు సర్వకార్య నిపుణులు, బంధువర్గాలకు ఉపకారాలు చేసేవాళ్ళు, చండీ దురా ఇ్యాది మాతృకల లేదా దేవీసంజ్ఞలయందు భక్తి . ఇతరుల్ని వశీకరణం చేసుకొనడంలో నేర్పరులు. శీఘ్ర కోపిస్టులూ భార్యారతులు, కాముకులు. శిల్పకర్మలు చేయడంలో నిమగ్గ్నులు అయి ఉంటారు. నిత్యరోగులు. కంటి దిగువభాగాలలో తిలకాదులు కలవాళ్ళూ ఉంటారు.
Magha Nakshatra Personality
మఖ నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:
మఖ నక్షత్రం 1 వ పాదం – మఖ ప్రథమపాదం కుజుడిది. సేవాంశ ఈ జాతకులు శరీరంపె ఎర్రని రోమాలు కలవారు, బలిష్టమైన పట్టుదల కలవాళ్ళూ, ప్రతిష్థ కలవాళ్ళుగా ఉంటారు.
మఖ నక్షత్రం 2 వ పాదం – ద్వితీయపాదం శుక్రుడిది, భుకాంశ ఈ జాతకులు ఏకాంత ప్రియులు, త్యాగశీలురు. దేనివైనా న్యాయంగా సంపాదించాలనే దృక్పథం కలవాళ్ళుగా ఉంటారు.
మఖ నక్షత్రం 3 వ పాదం – తృతీయపాదం బుధుడిది, విచక్షణాంశ. “ఈ పాదాంశా ప్రాభువులు జ్ఞానులు, మేధావులు, నేర్పరులూ అవుతారు.
మఖ నక్షత్రం 4 వ పాదం – నాలుగోపాదం చంద్రుడిది, ‘ అత్యాంశ,. వీళ్ళు స్త్రీ ప్రియులు, అంత్రరోగులూ, తెలివైనవాళ్ళే కాని కుటిల స్వభావులూ, పొట్టివారూ అవుతారు.
Magha Nakshatra Strength
మఖ నక్షత్ర జాతకుల బలాలు:
- నిపుణులు
- తెలివి
Magha Nakshatra Weakness
మఖ నక్షత్ర జాతకుల బలహీనతలు:
- కోపం
Magha Nakshatra Favorable & Unfavorable
- అనుకూలము – ఆడంబరాలు మరియు గొప్పతనం అవసరమైన వేడుకలు, పబ్లిక్ పెర్ఫార్మెన్స్ లు, పట్టాభిషేకాలు, పరేడ్ లు, అవార్డు ఫంక్షన్ లు, రీసెర్చింగ్ వంశపారంపర్యం, కెరీర్ వ్యూహాలు, గత విధానాలు, ఉన్నత స్థితి మరియు ఆస్తులకు అప్ గ్రేడ్ చేయడం, మతపరమైన కార్యకలాపాలు, వివాదాలను పరిష్కరించడం
- అననుకూలము – లెండింగ్, సర్వైల్ యాక్టివిటీస్, భవిష్యత్తు కొరకు ప్లానింగ్, టెక్నలాజికల్ ప్రాసెస్ లు మరియు ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఇమిడి ఉండే యాక్టివిటీస్
- ఈ నక్షత్రంలో 30 వ ఘటిక తర్వాత విషనాడీ
మఖ నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు
Nakshatram | Magha |
---|---|
తిథి | పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి |
వారాలు | ఆది, గురు వారములు |
సంవత్సరము | 16, 2, 30, 36, 42, 44, 48, 53 |
నక్షత్రాలు | రేవతి |
సంఖ్య | 7 |
రంగు | తెలుపు |
రత్నం | పిల్లి కన్ను |
రుద్రాక్ష | షష్టి ముఖి |
లోహం | వెండి |
దిక్కు | ఈశాన్యం |
దైవము | సూర్యుడు |
Magha Nakshatra – Education
మఖ నక్షత్రం – విద్య:
బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, శస్త్రచికిత్స, ఆయుర్వేద, పిల్లల ఆరోగ్యం. ఫార్మసీ, సంగీతం, చరిత్ర.
Magha Nakshatra – Profession, Job, Business
మఖ నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:
ప్రభుత్వ సేవలు లేదా సేవలో భద్రత, ఆభరణాల తయారీదారులు, నికెల్ తయారీదారులు, క్రోమియం పూత పూసిన శస్త్రచికిత్స పరికరాలు, న్యాయవాదులు, ఆయుధం తయారీదారు.
Magha Nakshatra Health
మఖ నక్షత్రం – ఆరోగ్యము:
జలుబు- కడుపు, మోకాళ్లు మరియు కాలు నొప్పులు, హిస్టీరియా, ఆందోళన, అజీర్ణం, కఫం, అపానవాయువు, గాలి-నొక్కే డయాఫ్రమ్, శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది, నెఫ్రిటిస్.
Magha Nakshatra Remedies
మఖ నక్షత్రం – శాంతి పూజ విధులు:
మఖ నక్షత్రం 1,3 పాదములు దోషము కలదు.
ఈ నక్షత్రంలో జ్వరపడినవారికి 7 దినాలు అరిష్టం, శాంతి కొరకు నాలుగు చేతులూ, ఆ నాలుగు చేతులందునా మూడింట అక్షసూత్రకమండువులు, 4 వ చేత వరదముద్రా ధరించి వున్నట్టుగానూ, నీలి రంగు -. కట్టుకున్న పితృదేవత విగ్రహాన్ని నిర్మించి ఆవాహన చేసి మంత్రాదిగా షోడశోపచారాలు – చేయాలి. ఈ పూజలోకి’ సంపెంగ పూవుల్నీ నేతితో కూడిన ధుపాన్ని గంధాన్ని ఉపయోగించాలి. ఆవుపాలు సమర్పించాలి.
Magha Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka
మఖ నక్షత్ర గాయత్రి మంత్రం:
ఓం మహా అనగాయ విద్మహే
పిత్రియాదేవాయ ధిమహి
తన్నో మఖ: ప్రచోదయాత్
మఖ నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః ।
అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ 37 ॥
మఖ నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
పద్మనాభోఽరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ ।
మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః ॥ 38 ॥
మఖ నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః ।
సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః ॥ 39 ॥
మఖ నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః ।
మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ 40 ॥