Ardra Nakshatra: ఆరుద్ర నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Ardra Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.
Table of Contents
Ardra Nakshatra Details
నక్షత్రము | ఆరుద్ర |
---|---|
అధిదేవత | రుద్రుడు |
తారల సంఖ్య | 1 |
గుర్తు | కన్నీటి బిందు |
గ్రహం | రాహు |
పురుషార్థ | కామ |
యోని (Gender) | స్త్రీ |
గణ | మనుష్య |
వర్ణ | చండాలుడు |
ఎలిమెంట్ | జలము |
త్రిమూర్తి | శివ |
త్రి దోష | వాతము |
రంగు | హరిత (గ్రీన్) |
దిక్కు | పశ్చిమం |
గోత్రం | పులశ |
గుణము | తమో గుణం |
శరీర భాగము | కన్ను |
జంతువు | ఆడ కుక్క |
పక్షి | క్రౌంచం |
చెట్టు | చండ్ర |
మొదటి అక్షరం | కూ, ఖం, చా |
Ardra Nakshatra Characteristics
ఆరుద్ర నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:
ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించినవారి జీవితం రాహు మహాదశలో ప్రారంభమవుతుంది. ఈదశ 18 సం॥రలు. అనంతరం గురు దశ 16 సంవత్సరాలు. ఈ ఆరుద్ర నక్షత్రం లో జన్మించినవాళ్ళు గుణవంతులూ, ఆచారవంతులు. ఉంటారు. కొనుగోలు అమ్మకాల విషయంలో నేర్పరులవుతారు, గర్విష్థులూ, పాపకర్మాసక్తులూ, విశ్వానఘాతకులు, అధిక ఆయుర్దాయం కలవాళ్ళుగా ఉంటారు.
Ardra Nakshatra Personality
ఆరుద్ర నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:
ఆరుద్ర నక్షత్రం 1 వ పాదం – ప్రథమపాదం గురుడిది. కృపాంశ – ఈ అంశలో జన్మించిన వాళ్ళు గుణవంతులు నిత్యం, ప్రశాంతంగా వుండే చక్కటి ముఖం కలవాళ్ళూ, తామున్న రంగంలో వేర్చరులూ అవుతారు.
ఆరుద్ర నక్షత్రం 2 వ పాదం – ద్వితీయపాదం శవిది. తస్కరాంశ – ఈ జాతకులు కలహ ప్రియులు, దొంగలు ఆతి దాహం కలవారు, హీనమైన కంఠ స్వరం కలవాళ్ళుగా ఉంటారు.
ఆరుద్ర నక్షత్రం 3 వ పాదం – మూడవపాదం శనిది కాని ఇది ఉగ్రాంశ అందువల్ల వీళ్ళు పాపకర్మలు, చెడు ఆలోచనలు చేసేవారూ స్తిరమ్టైన ధనం లేనివారు, దుబారా చేయువారు, సూచీ లేని వారు.
ఆరుద్ర నక్షత్రం 4 వ పాదం – చతుర్థ పాదం గురువుది – ధర్మాత్ములు, మంచి ఆచారవంతులు, ఇతరులను గౌరవించేవారు అవుతారు.
Ardra Nakshatra Strength
ఆరుద్ర నక్షత్ర జాతకుల బలాలు:
- వర్తక నేర్పరులు
- సామర్దయమ్
Ardra Nakshatra Weakness
ఆరుద్ర నక్షత్ర జాతకుల బలహీనతలు:
- గర్వం
- కోపం
Ardra Nakshatra Favorable & Unfavorable
- అనుకూలము – అగ్ని ప్రయోగం, అక్షర స్వీకారం, అస్త్ర విద్యాభ్యాసారంభం, దొంగతనావికి బయలుదేరడం, భూత గ్రహ ఛటనకు, మంత్ర ప్రయోగం, శివ లింగ ప్రతిష్టకు, తీర్థ యాత్రలకు, శ్రాద్ద కర్మలకు అనుకూలం
- అననుకూలము – వివాహములకు , శృంగారమునకు, ఓపిక పట్టవలసిన విషయములయందు ఆరుద్ర నక్షత్రము అనుకూలము కాదు.
- నక్షత్రాది 21 ఘటికలు తర్వాత విష నాడీ
ఆరుద్ర నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు
Nakshatram | Ardra |
---|---|
తిథి | తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి |
వారాలు | బుధ, శుక్ర, శని వారములు |
సంవత్సరము | 18, 21, 26, 36, 40, 47, 53 |
నక్షత్రాలు | థనిస్టా |
సంఖ్య | 4,8 |
రంగు | ఆకుపచ్చ |
రత్నం | గోమేదికమ్ |
రుద్రాక్ష | అష్ట ముఖి |
లోహం | వెండి |
దిక్కు | ఉత్తరం |
దైవము | శివుడు, దుర్గా మాత |
Ardra Nakshatra – Education
ఆరుద్ర నక్షత్రం – విద్య:
రవాణా/వ్యవసాయం/రబ్బరు ఇంజనీరింగ్. పశు సంవర్ధకము, అణు పరిశోధన. జర్నలిజం, వైద్యుడు.
Ardra Nakshatra – Profession, Job, Business
ఆరుద్ర నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:
పోస్ట్ మరియు టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్, కమ్యూనికేషన్, రవాణా, పుస్తక విక్రేత, ప్రకటన, రచయిత, వేలిముద్ర నిపుణుడు, ఫైనాన్స్ బ్రోకర్, డ్రగ్స్, పానీయాలు, క్యాన్డ్ గూడ్స్ వ్యాపారం.
Ardra Nakshatra Health
ఆరుద్ర నక్షత్రం – ఆరోగ్యము:
గవదబిళ్ళలు, ఆస్తమా, పొడి దగ్గు, చెవిలో చీము, ఈస్నోఫిలియా, డిఫ్తీరియా, చెవిలో ఇబ్బంది.
Ardra Nakshatra Remedies
ఆరుద్ర నక్షత్రం – శాంతి పూజ విధులు: ఈ నక్షత్రంలో ఏర్పడిన జ్వరం ప్రాణాంతకనువుతుంది. 3 నెలల పాటు అరిష్టాలపాలు చేస్తుంది. తత్ శాంతి నిమిత్తంగా – త్రినేత్రుడు, తెల్లటివర్ణం, తెల్లటి వస్త్రం, రెండు చేతులు, ఒక చేత త్రిశూలం, వృషభవాహనుడూ అయిన రుద్రుడిని ప్రతిమయందు అవాహన చేసి “నమశళ్ళంభవే అనే మం త్ర పూర్వకంగా షోడశోపచారపూజ వహించాలి. తెల్లటి గంధం, అగరుధూపం, దుత్తూర పుష్పం, నివేదనార్దం శాల్యాన్నాన్ని ఉపయోగించాలి. అనంతరం – గాయత్రీ అష్టోత్తర శతయుక్తంగా – తేనె, నెయ్యితో హోమం చేయాలి. గంధమాల్య పాయసాన్నాలను ఈశాన్య దిశలో బలి గా ఉంచాలి. శక్తిమంతులు తెల్లటి గోవును దానం చేయాలి. తద్వారా ఆరుద్ర తారారిష్టాలు 1 మాసం లో తొలగి సుఖసౌఖ్యాలు ఏర్పడతాయి.
Ardra Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka
ఆరుద్ర నక్షత్ర గాయత్రి మంత్రం:
ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే
పశుం తనాయ ధిమహి
తన్నో ఆర్ద్రా: ప్రచోదయాత్
ఆరుద్ర నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః ।
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ 21 ॥
ఆరుద్ర నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
అమృత్యుః సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిరః ।
అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ 22 ॥
ఆరుద్ర నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః ।
నిమిషోఽనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః ॥ 23 ॥
ఆరుద్ర నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
అగ్రణీగ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ॥ 24 ॥