Mrigasira Nakshatra: మృగశిర నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Mrigasira Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.
Table of Contents
Mrigasira Nakshatra Details
నక్షత్రము | మృగశిర |
---|---|
అధిదేవత | సోమ |
తారల సంఖ్య | 3 |
గుర్తు | జింక ముఖం |
గ్రహం | కుజ |
పురుషార్థ | ధర్మ |
యోని (Gender) | నపుంసక |
గణ | దేవ |
వర్ణ | బ్రహ్మణ |
ఎలిమెంట్ | పృథ్వీ |
త్రిమూర్తి | విష్ణు |
త్రి దోష | పిత్తం |
రంగు | కృష్ణ వర్ణము |
దిక్కు | దక్షిణము |
గోత్రం | పులస్త్య |
గుణము | తమో గుణం |
శరీర భాగము | కన్ను |
జంతువు | పాము |
పక్షి | కోడి |
చెట్టు | చంద్ర చెట్టు |
మొదటి అక్షరం | ఇ, కె, కొ, హ, హి |
Mrigasira Nakshatra Characteristics
మృగశిర నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:
ఈ మృగశిర నక్షత్రంలో జన్మించినవారి జీవితం కుజ మహాదశలో ప్రారంభమవుతుంది. ఈదశ 7 సంవత్సరములు. అనంతరం రాహు దశ 18 సంవత్సరాలు. ఈ మృగశిర నక్షత్రం లో జన్మించినవాళ్ళు ఉత్సాహవంతులు, పాపకర్మలకు భయపడేవాళ్ళూ, మాతృభక్తులూ, చిరకాల ఆయుష్మంతులూ, పీనపక్షులూ అవుతారు. యోగం వికటిస్తే మాత్రం అవివేకులూ, జనదూషితులూ, అంకుచిత భుజాలు కలవాళ్ళు, ఒక్కసారి యేదైనా చెబితే దానిని మర్చిపోనివాళ్ళుగా ఉంటారు.
Mrigasira Nakshatra Personality
మృగశిర నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:
మృగశిర నక్షత్రం 1 వ పాదం – మృగశిర మొదటి పాదం రవిది – రాజాంశ – వీళ్ళు పెద్ద పనుల్ని, తలకుమించిన పనుల్ని నెత్తిన వేసుకుంటారు. ధనికులవుతారు. శత్రువుల్ని గెలుచుకునివస్తారు.
మృగశిర నక్షత్రం 2 వ పాదం – ద్వితీయపాదం – బుధుడిది – చండాశ యజ్ఞ క్రియలు, మంచివాచకం కలవారూ, భోగులూ అవుతారు.
మృగశిర నక్షత్రం 3 వ పాదం – తృతీయపాదం శుక్రుడిది – అభయాంశ.ఈ జాతకులు ఉదారవంతులూ, దేనికయినా సిద్దపడేవాళ్ళుగా ఉంటారు.
మృగశిర నక్షత్రం 4 వ పాదం – చతుర్ధపాదం – కుజుడిది -నీచాంశ. ఈ ‘ జాతకులు ‘పరజనద్వేషులు, కాముకులు, పుండ్లతో గూడిన తలగలవాళ్ళుగా ఉంటారు.
Mrigasira Nakshatra Strength
మృగశిర నక్షత్ర జాతకుల బలాలు:
- ధైర్యము
- వేగం
- ధ్యానం
Mrigasira Nakshatra Weakness
మృగశిర నక్షత్ర జాతకుల బలహీనతలు:
- ద్వేషం
- దూకుడు మొండి పట్టుదల & అహంకారం
Mrigasira Nakshatra Favorable & Unfavorable
- అనుకూలము – రజస్వలాముహూర్హం, నామకరణం, అన్న ప్రాశన, చౌలం, వడుగు, అక్షరాభ్యాసం, వేదశా(స్రాదుల వ ప్రారంభం, తైలాభ్యంగం, సర్వ్యాభరణధారణ, పట్టాభిషేకం, గజతురగాధిరోహణం, పల్లకీవాడకం, సనుస్తమైన వాస్తుకర్మలూ, నూతన గ్రామ – నగర గృహ ్రవేశాదులూ, వ్యవసాయారంభం, బీజావాపనం వగయిరా శుభకార్యాలకీ నక్షత్రం ప్రశస్తమైనది.
- అననుకూలము – వివాహం, ఘర్షణ లేదా పోరాటం వంటి కఠినమైన లేదా దూకుడు చర్య, వివాహానికి ముందు వేడుకలు, దీర్ఘకాలిక నిర్ణయాలు.
- ఈ నక్షత్రంలో పుట్టినవాళ్ళు 18 రోజుల లోపల గ్రహణాది “ఉత్పాతాలు జరిగితే , మూడవయేట సర్పభయం, 25వ యేట అపనిందలు, స్తానభ్రష్టుత్వం, 50వ యేట భార్యాపుత్రాది వియోగం జరుగుతాయి.
మృగశిర నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు
Nakshatram | Mrigasira |
---|---|
తిథి | తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి |
వారాలు | సోమ, గురు వారములు |
సంవత్సరము | 18, 25, 29, 36, 45, 54 |
సంఖ్య | 9 |
నక్షత్రం | శ్రవణం |
రంగు | వెండి |
రత్నం | పగడం |
రుద్రాక్ష | త్రి ముఖి |
లోహం | బంగారం |
దిక్కు | దక్షిణం |
దైవము | సుబ్రమణ్య |
Mrigasira Nakshatra – Education
మృగశిర నక్షత్రం – విద్య: ఇంజనీరింగ్ – మెకానికల్, టెక్స్టైల్, కెమికల్, సౌండ్, ఎలక్ట్రికల్, లా, ఐ / డెంటిస్ట్, సినిమా
Mrigasira Nakshatra – Profession, Job, Business
మృగశిర నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు: మొబైల్ నిర్మాణాలు, ఎరువులు, టైలర్, ఆటోమొబైల్ ఇంజనీర్, చర్మం మరియు చర్మాలు, పొగాకు, ఎస్టేట్ యజమాని, భూమి, భవనం, వెటర్నరీ వైద్యులు, పశుపోషణ
Mrigasira Nakshatra Health
మృగశిర నక్షత్రం – ఆరోగ్యము: టాన్సిల్స్, మొటిమలు, గొంతు నొప్పి, గాయిటర్, అడినాయిడ్స్, డిఫ్తీరియా, మలబద్ధకం, వెనిరియల్ డిస్టెంపర్, పాలీపస్, పాడైన రక్తం, దురదలు, గాయాలు మరియు చేతులు పగుళ్లు
Mrigasira Nakshatra Remedies
మృగశిర నక్షత్రం – శాంతి పూజ విధులు: తెల్లటి వర్ణం, తెల్లటి వాహనం ఆ రెండు చేతులలో ఒకటి అభయ ప్రదం మరొకటి వరప్రదం గా వున్న చంద్రుణ్ణి అవహన చేయాలి.
“నన్ నవోభవతి’ అనే మంత్రపూర్వకంగా – షోడశోపచార పూజలు చేయాలి.
తెల్లటి వస్త్రాన్ని, తెల్లటిగంధాన్నీ, కలున ఫుష్పాల్నీ సమర్పించాలి. క్షీరానాన్ని నివేదించాలి, గాయ త్రాషోత్తర శతంతో – _నేయీ త్షీరాన్నం కలిపి హోమం చేయాలి. – మంచిగంధాన్నీ, మూల్యాన్నీ, త్నీరాన్నాలనీ తూర్పుదిక్కులో బలి [ అన్నంగా ఉంచాలి తద్వారాఅయిదు రోజులలో అరిష్టం తొలగిపోతుంది.
Mrigasira Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka
మృగశిర నక్షత్ర గాయత్రి మంత్రం:
ఓం శశిశేఖరాయ విద్మహే
మహారాజాయ ధిమహి తన్నో
మృగశిర: ప్రచోదయాత్
మృగశిర నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః ।
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః ॥ 17 ॥
మృగశిర నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః ।
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ॥ 18 ॥
మృగశిర నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః ।
అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ ॥ 19 ॥
మృగశిర నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః ।
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః ॥ 20 ॥