Rohini Nakshatra: రోహిణి నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Rohini Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.
Table of Contents
Rohini Nakshatra Details
నక్షత్రము | Rohini |
---|---|
అధిదేవత | బ్రహ్మ |
తారల సంఖ్య | 5 |
గుర్తు | రథం |
గ్రహం | చంద్ర |
పురుషార్థ | మోక్ష |
యోని (Gender) | స్త్రీ |
గణ | మనుష్య |
వర్ణ | శూద్ర |
ఎలిమెంట్ | పృథ్వీ |
త్రిమూర్తి | బ్రహ్మ |
త్రి దోష | కఫము |
రంగు | తెలుపు |
దిక్కు | తూర్పు |
గుణము | సత్వ గుణం |
శరీర భాగము | నుదురు |
జంతువు | పాము |
పక్షి | గుడ్ల గూబ |
చెట్టు | నేరేడు |
మొదటి అక్షరం | వో, వా, వీ, వూ |
Rohini Nakshatra Characteristics
రోహిణి నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:
ఈ రోహిణి నక్షత్రంలో జన్మించినవారి జీవితం చంద్ర మహాదశలో ప్రారంభమవుతుంది. ఈదశ 10 సం॥రలు. అనంతరం కుజ దశ 7 సంవత్సరాలు. ఈ రోహిణి నక్షత్రం లో జన్మించినవాళ్ళు చక్కటిస్వరూపం, సంభోగప్రియత్వం – తన్నిపుణత్వం, సామర్థ్యం ధనికత, నేత్రవ్యాధి, రవ్వంతపాదాంగ లోపం, కాస్తంత పాపవాంచి స్ఫుటమైన చిన్న నుదురుకల వాళ్ళూ అవుతారు.
Rohini Nakshatra Personality
రోహిణి నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:
రోహిణి నక్షత్రం 1 వ పాదం – ప్రథమపాదం కుజుడిది సేవాంశ చాపల్యం, రాగి రంగు వెంట్రుకలు, శౌర్యం, దూషికత్వం లక్షణాలు.
రోహిణి నక్షత్రం 2 వ పాదం – శుక్రుడిది భృత్యాంశ- పొడగరితనం, ఓటమిని యిసుమంతకూడా అంగీకరించలేనితనం, మంచిశీలం కలవాళ్ళవుతారు.
రోహిణి నక్షత్రం 3 వ పాదం – బుధుడిది – విద్యాంశ – పండితులూ, కవులూ, గణితశాస్త్రజ్ఞులు, లోక వ్యవహారజ్ఞానులూ, అవుతారు.
రోహిణి నక్షత్రం 4 వ పాదం – అత్యాశ – ఇతరుల ధనాన్ని అపహరించేవాళ్ళూ, తెలివైన వాళ్ళూ అవుతారు.
Rohini Nakshatra Strength
రోహిణి నక్షత్ర జాతకుల బలాలు:
- ఆకర్షణ
- సామర్థ్యం
- తెలివి తేటలు
Rohini Nakshatra Weakness
రోహిణి నక్షత్ర జాతకుల బలహీనతలు:
- పాప వాంఛ
- అత్యాశ
Rohini Nakshatra Favorable & Unfavorable
- అనుకూలము – సీమంతం, పుంసవనం, నామకరణం, అన్నప్రాశనం, ఉపనయనం, వేదశాస్త్రాభ్యాసం, సమావర్తనం, వివాహం, తైలాభ్యంగనం నూతనభూషణధారణం, రాజ్యాభిషేకం, సింహాసనాధిరోహణం, అధికార స్వీకారం, పల్లకీ నెక్కడం, నగర – గ్రామ, దేవతా ప్రతిష్టలూ, ఇతరేతర సము వాస్తుకర్మలూ, యజ్ఞాలు, హోమాలు, దానాలు శాంతికృత్యాలు, పౌష్ఠి కర్మలూ, ధనధాన్యసేకరణకూ, చెఱువులూ, నూతులూ వగయిరాలు త్రవ్వించడానికీ ఈ తార అత్యంతోపయుక్తమవుతుంది
- ఈ జాతకులు పుట్టిన పది ఘటికలపైన అపమృత్యు భయంవుంది. అది తప్పినా – మూడు- పది దినాలలో అపమృత్యువుంటుంది. వాటి నధిగమించితే తొమ్మిదవయేట వాతజ్వరభయం, పదిహేడవయేట నేత్రరోగం కలుగుతాయి. ఇరవయ్యేడవయేట మేహరోగం ప్రాప్తిస్తుంది. యాభయ్యవయేట జ్వరపీడ, డెబ్బయ్యవయేట అపమృత్యు భీతీ – ఆ గండాలు గడిస్తే – ఎనభై సంవత్సరాలపైన యోగాయుర్దాయం ఉంటుంది.
రోహిణి నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు
Nakshatram | Rohini |
---|---|
తిథి | విదియ, పంచమి, దశమి, త్రయోదశి |
వారాలు | గురు, సోమ వారములు |
సంవత్సరము | 20, 27, 30, 36, 40, 45 |
నక్షత్రం | ఉత్తరాషాడ |
సంఖ్య | 2 |
రంగు | తెలుపు |
రత్నం | ముత్యం |
రుద్రాక్ష | ద్వి ముఖి |
లోహం | వెండి |
దిక్కు | తూర్పు |
దైవము | శివుడు |
Rohini Nakshatra – Education
రోహిణి నక్షత్రం – విద్య: ఫార్మసీ, డాక్టర్-ఐ, డెంటల్.వెటర్నరీ, జియాలజీ, వాటర్ వర్క్స్. డెర్మటాలజిస్ట్, క్రిమినల్ లా, ఇంటీరియర్ డెకరేటర్, క్యాటరింగ్
Rohini Nakshatra – Profession, Job, Business
రోహిణి నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు: బేకరీలు, బార్, నూనెలు, పాలు, ఐస్ క్రీం, సబ్బు, చందనం, రంగులు, రంగులు, వివాహ బ్రోకర్, దుస్తులు మరియు ముత్యాల వ్యాపారి, ద్రవాలు, ఆమ్లాలు, చక్కెర, కార్ట్ మెన్, ఆవులు.
Rohini Nakshatra Health
రోహిణి నక్షత్రం – ఆరోగ్యము: అపోప్లెక్సీ, రొమ్ము నొప్పి, వాపులు, గొంతు-నొప్పి, జలుబు, దగ్గు, గాయిటర్, కాళ్ల-పాదాల నొప్పి, క్రమరహిత రుతుక్రమం.
Rohini Nakshatra Remedies
రోహిణి నక్షత్రం – శాంతి పూజ విధులు:
4 చేతులూ, ఆ హస్తాలలో అక్షసూత్ర కమండువులూ కలిగి, హంసవాహనంపై అలరారుతూ, కృష్ణవర్గీయుడైన బ్రహ్మను ప్రతిమలోకి ఆవాహనం చేయాలి.
‘నమో బ్రహ్మః’ అనే మంత్రాద్యంగా షోడశోపచారాలతోనూ పూజించాలి. పూజలో నీలిరంగు వస్త్రాలనీ, కస్తూరీ గంధాలనీ, తామర లేదా – కలువ – పువ్వుల్నీ, సర్జక ధూపాన్నీ వినియోగించాలి. క్షీరానాన్ని నివేదించాలి. గాయత్రీ అష్టోత్తర శత సమేతంగా నవధాన్యాలతోనూ హోమం చేయాలి. గంధమూల్యాదులూ, క్షీరోదనాన్ని ఉత్తరదిశగా బలికుంచాలి. తద్వారా – ‘అస్వస్థులు’ తొమ్మిది రోజులలో కోలుకుంటారు.
Rohini Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka
రోహిణి నక్షత్ర గాయత్రి మంత్రం:
ఓం ప్రజావిరుధ్ధై చ విద్మహే
విశ్వరూపాయై ధీమహి
తన్నో రోహిణి ప్రచోదయాత్
రోహిణి నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః ।
అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః ॥ 13 ॥
రోహిణి నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
సర్వగః సర్వ విద్భానుర్విష్వక్సేనో జనార్దనః ।
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ 14 ॥
రోహిణి నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః ।
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః ॥ 15 ॥
రోహిణి నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం
భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః ।
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ 16 ॥